AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nirupam: ప్రేమంటే ఇదేరా! పుట్టినరోజున భార్యకు డాక్టర్ బాబు అద్దిరిపోయే సర్‌ప్రైజ్.. వీడియో ఇదిగో

నిరుపమ్ పరిటాల .. ఈ పేరు వింటే చాలామంది గుర్తు పట్టకపోవచ్చు కానీ డాక్టర్ బాబు అంటే ఇట్టే కళ్ల ముందు మెదులుతాడీ బుల్లితెర ఫేమస్ యాక్టర్. కార్తీకదీపం సీరియల్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ నటుడికి తెలుగు రాష్ట్రాల్లో సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది.

Nirupam: ప్రేమంటే ఇదేరా! పుట్టినరోజున భార్యకు డాక్టర్ బాబు అద్దిరిపోయే సర్‌ప్రైజ్.. వీడియో ఇదిగో
Nirupam Family
Basha Shek
|

Updated on: May 11, 2025 | 7:10 AM

Share

కార్తీకదీపం సీరియల్ తో బాగా పాపులర్ అయ్యాడు నిరుపమ్ పరిటాల. ఇందులో అతను పోషించిన డాక్టర్ బాబు పాత్ర బుల్లితెర ఆడియెన్స్ కు బాగా చేరువైంది. అందుకే తన ఒరిజినల్ నేమ్ నిరుపమ్ కంటే డాక్టర్ బాబుతోనే ఎక్కువ ఫేమస్ అయ్యాడు. ప్రస్తుతం కార్తీక దీపం 2 సీరియల్ లో నటిస్తూ బిజీగా ఉంటున్నాడు డాక్టర్ బాబు. ఇక నిరుపమ్ భార్య మంజుల కూడా బుల్లితెర ఆడియెన్స్ కు బాగా సుపరిచితమే. చంద్రముఖి సీరియల్ తో ఇద్దరి ప్రేమ ప్రయాణం మొదలైంది. ఆ తర్వాత పెద్దల అనుమతితో ఇద్దరూ పెళ్లిపీటలెక్కారు. ఇప్పుడు ఎవరు సీరియల్స్ లో వారు నటిస్తూ బిజీగా గడుపుతున్నారు. తాజాగా నిరుపమ్ తన భార్య మంజుల పుట్టిన రోజు (మే09) సందర్భంగా ఆమెకు ఓ సర్ ప్రైజ్ ఇచ్చాడు. ఈ సందర్భంగా తన చేతిపై ఆమె పేరును పచ్చబొట్టుగా వేయించుకున్నాడు. ఈ విషయాన్నిఅతనే సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశాడు. ‘ఇది నా భార్య పుట్టిన రోజుకు బహుమతిగా సప్రైజ్ గా అందించనున్నాను’ అని ఆయన టాటూ వేయించుకున్న వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. దీనిని చూసిన వారందరూ బుల్లితెర ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ‘ నిరూపమ్ తన భార్యపై చూపిస్తున్న ప్రేమకు గ్రేట్.. మీ జంట చాలా బాగుంది’ అని కామెంట్స్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

కాగా నిరుపమ్ కెరీర్ ప్రారంభంలో ఫిట్టింగ్ మాస్టర్, రభస సినిమాల్లో నటించాడు. ఆ తర్వాత కార్తీకదీపం సీరియల్ తో పాటు మూగమనసులు, అత్తారింటికి దారేది, రాధకు నీవే రా ప్రాణం తదితర ధారా వాహికల్లో నటించాడు. ఇక మంజుల కూడా చంద్రముఖి, తరంగాలు, లేత మనసులు, ఆకాశమంత, కృష్ణవేణి, నీలాంబరి, చంద్రలేఖ, గోకులంలో సీత, ఇద్దరమ్మాయిలు, జానకి కలగనలేదు సీరియల్స్ లో నటించి మెప్పించారు.

భార్య పేరును పచ్చబొట్టుగా వేయించుకుంటోన్న డాక్టర్ బాబు అలియాస్ నిరుపమ్ పరిటాల.. వీడియో..

భార్య మంజులతో నిరుపమ్ పరిటాల..

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి . .

Follow Us
బయట జోరు వాన..ఇంట్లో ఘుమఘుమలాడే అరటికాయ బజ్జీ.. ఎలా చేయాలంటే?
బయట జోరు వాన..ఇంట్లో ఘుమఘుమలాడే అరటికాయ బజ్జీ.. ఎలా చేయాలంటే?
పాటే ప్రాణంగా వస్తున్న సింగీతం శ్రీనివాసరావు ‘సింగ్ గీతం’..!
పాటే ప్రాణంగా వస్తున్న సింగీతం శ్రీనివాసరావు ‘సింగ్ గీతం’..!
పనిమనిషిగా వెళ్లి తల్లిగా మారిన ఆదిలక్ష్మి.. భావోద్వేగ కథ
పనిమనిషిగా వెళ్లి తల్లిగా మారిన ఆదిలక్ష్మి.. భావోద్వేగ కథ
ఇరాన్ టీమ్‌కు నరకం చూపిస్తున్న అమెరికా అడ్మినిస్ట్రేషన్
ఇరాన్ టీమ్‌కు నరకం చూపిస్తున్న అమెరికా అడ్మినిస్ట్రేషన్
ఒకే ఫ్రేమ్‌లో 120 మంది.. వనపర్తి జిల్లాలో ఐదు తరాల అపురూప సంగమం
ఒకే ఫ్రేమ్‌లో 120 మంది.. వనపర్తి జిల్లాలో ఐదు తరాల అపురూప సంగమం
ఎంపీ, ఎమ్మెల్యేల దెబ్బతో సోనియాతో దీదీ కీలక భేటీ!
ఎంపీ, ఎమ్మెల్యేల దెబ్బతో సోనియాతో దీదీ కీలక భేటీ!
9 నిమిషాల్లో 50 కిలోమీటర్ల ప్రయాణం.. మెరుపు తీగల దూసుకుపోయే రైలు
9 నిమిషాల్లో 50 కిలోమీటర్ల ప్రయాణం.. మెరుపు తీగల దూసుకుపోయే రైలు
మొన్ననే బ్రేకప్ అన్నారు.. అప్పుడే మళ్లీ కలిసిపోయిన జయం రవి,కెనీషా
మొన్ననే బ్రేకప్ అన్నారు.. అప్పుడే మళ్లీ కలిసిపోయిన జయం రవి,కెనీషా
గిల్, రాహుల్‌లు కాదు.. అతడే టీమిండియా టెస్ట్ బ్యాటర్
గిల్, రాహుల్‌లు కాదు.. అతడే టీమిండియా టెస్ట్ బ్యాటర్
ఇంజనీరింగ్‌ అడ్మిషన్లు మొదలవుతున్నాయ్‌.. జూన్‌ 19 నుంచే ప్రారంభం
ఇంజనీరింగ్‌ అడ్మిషన్లు మొదలవుతున్నాయ్‌.. జూన్‌ 19 నుంచే ప్రారంభం