AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Karthi-Suriya: మీ మనసు బంగారం సర్.. సత్యం సుందరం దర్శకుడికి డ్రీమ్ కార్ గిఫ్ట్ ఇచ్చిన సూర్య, కార్తి..

కోలీవుడ్ ఇండస్ట్రీలో అతి తక్కువ సమయంలోనే స్టార్ డమ్ సంపాదించుకున్న ఇద్దరు అన్నదమ్ములు సూర్య, కార్తి. హీరోయిజం సినిమాలు కాకుండా విభిన్నమైన కథలు.. వైవిధ్యమైన పాత్రలు ఎంచుకుంటూ వరుసగా హిట్స్ ఖాతాలో వేసుకుంటున్నారు. తాజాగా తమ కెరీర్ లో సూపర్ హిట్ సినిమా ఇచ్చిన దర్శకుడికి జీవితంలో గుర్తుండిపోయే గిఫ్ట్ ఇచ్చారు సూర్య, కార్తి.

Karthi-Suriya: మీ మనసు బంగారం సర్.. సత్యం సుందరం దర్శకుడికి డ్రీమ్ కార్ గిఫ్ట్ ఇచ్చిన సూర్య, కార్తి..
Karthi
Rajitha Chanti
|

Updated on: May 11, 2025 | 2:05 PM

Share

సినిమా అంటే ఫైట్స్, రొమాన్స్ ఉండక్కర్లేదని.. మనసులను తాకే ఎమోషన్స్ ఉంటే చాలని నిరూపించారు డైరెక్టర్ ప్రేమ్ కుమార్. తమిళంలో ఇప్పటివరకు ఆయన తెరకెక్కించిన చిత్రాలన్నీ ప్రత్యేకం. ఎలాంటి యాక్షన్ సీన్స్, హీరోయిజం, రొమాన్స్ లేకుండా సహజ కథలను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. ఇటీవల ప్రేక్షకులను హృదయాలను తాకిన సినిమాల్లో సత్యం సుందరం ఒకటి. కోలీవుడ్ డైరెక్టర్ ప్రేమ్ కుమార్ తెరకెక్కించిన ఈ సినిమా ఎలాంటి హడావిడి లేకుండా విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. ఇందులో హీరో కార్తి, అరవింద స్వామి ప్రధాన పాత్రలు పోషించారు. గతేడాది విడుదలైన ఈ సినిమా ఎంతటి విజయాన్ని అందుకుందో చెప్పక్కర్లేదు. థియేటర్లలోనే కాదు.. అటు ఓటీటీలోనూ ఊహించని రెస్పాన్స్ వచ్చింది. అంతకుముందు డైరెక్టర్ ప్రేమ్ కుమార్ తెరకెక్కించిన 96 చిత్రం సైతం సూపర్ సక్సెస్ అయ్యింది.

ఇదిలా ఉంటే.. సత్యం సుందరం వంటి సూపర్ హిట్ చిత్రాన్ని అందించిన దర్శకుడికి జీవితంలో గుర్తుండిపోయే గిఫ్ట్ ఇచ్చారు. ప్రేమ్ కుమార్ ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న డ్రీమ్ కారును కానుకగా ఇచ్చారు సూర్య కార్తీ. అదే మహీంద్ర థార్. అది తన డ్రీమ్ కారు అని.. కానీ కొన్ని కారణాల వల్ల 5 డోర్స్ వెర్షన్ కారు కొనలేకపోయానని చెప్పుకొచ్చారు ప్రేమ్ కుమార్. ప్రత్యేకంగా డిజైన్ చేసిన థార్ ఆర్ఓఎక్స్ఎక్స్ ఏఎక్స్ 5ఎల్ 4*4 మోడల్ లో వైట్ కలర్ కారు కొనాలని డబ్బులు కూడా రెడీ చేసుకున్నారట. కానీ కారు రావడానికి చాలా రోజులు సమయం పట్టడంతో రాజా సర్ సాయం అడిగారట. ఆ తర్వాత కారు కొనడానికి దాచిన డబ్బులు ఖర్చు కావడంతో కారు తీసుకోవాలనే కల చెదిరిపోయిందట.

అయితే విషయం తెలుసుకున్న సూర్య, కార్తి మహీంద్రా థార్ కొని ప్రేమ్ కుమార్ కు సర్ ప్రైజ్ ఇచ్చారు. ఒకరోజు తనకు సూర్య దగ్గరి నుంచి కారు ఫోటో వచ్చిందని.. దీంతోవెంటనే తాను రాజా సర్ కు కాల్ చేసి డబ్బులు లేవని చెబిత.. సూర్య తనకు గిఫ్ట్ ఇస్తున్నారని చెప్పారట. ఆ తర్వాత కార్తి చేతుల మీదుగా కారు అందుకున్నానని.. ఇప్పటికీ ఇదంతా కలలాగే ఉందని అన్నారు. సూర్య అన్న, కార్తీ బ్రదర్స్, రాజా సర్ కు థాంక్స్ అంటూ తన ఇన్ స్టాలో సుధీర్ఘ పోస్ట్ రాసుకొచ్చారు.

ఇవి కూడా చదవండి :  

Tollywood: చైల్డ్ ఆర్టిస్టుగా ఎంట్రీ.. 16 ఏళ్లకే క్రేజీ హీరోయిన్.. హార్మోన్ ఇంజక్షన్స్ తీసుకుందంటూ..

Mahesh Babu: మహేష్ బాబు రిజెక్ట్ చేశాడు.. బ్లాక్ బస్టర్ హిట్టుకొట్టిన ఉదయ్ కిరణ్.. ఏ సినిమా అంటే..

Tollywood: 36 ఏళ్ల హీరోయిన్‏తో 60 ఏళ్ల హీరో లిప్ లాక్ సీన్.. దెబ్బకు కొడుకుతో ఆగిపోయిన పెళ్లి..