OG Movie: ఓజీ నుంచి మరో క్రేజీ అప్డేట్.. పవన్ సినిమాలో ఆ స్టార్ యాక్టర్ కూడా.. థియేటర్లు దద్దరిల్లుతాయ్
ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తన సినిమా షూటింగులను పూర్తి చేసే పనిలో పడ్డారు. ఇప్పటికే 'హరి హర వీర మల్లు' సినిమా మొదటి పార్ట్ షూటింగ్ పూర్తయింది. ఇప్పుడు 'ఓజీ' సినిమాను కూడా పూర్తి చేసే పనిలో బిజీగా ఉంటున్నారు.

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మూడు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ‘హరి హర్ వీర్ మల్లు’, ‘ఓజీ’ , ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలను సెట్స్ పైకి తీసుకెళ్లారు. అయితే ఆ తర్వాత పవన్ డిప్యూటీ సీఎంగా బిజీగా మారిపోవడంతో ఈ మూడు సినిమాల షూటింగులు నిలిచిపోయాయి. అయితే ఎన్నో పని ఒత్తిడుల మధ్య ఇటీవలే ‘హరి హర వీర మల్లు’ సినిమా షూటింగ్ పూర్తి చేశారు పవన్ కల్యాణ్. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. దీని తర్వాత సుజిత్ ఓజీ సినిమాను కూడా పూర్తి చేసే పనిలో ఉన్నారు పవన్. ఇప్పటికే దీనిపై ఓ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. దీని ప్రకారం ‘ఓజీ’ సినిమా షూటింగ్ కి ప్లాన్ రెడీ అయినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా ఒక జపనీస్ సూపర్ స్టార్ నటుడు ‘ఓజీ’ సినిమాలో నటించనున్నారని తెలుస్తోంది. జపాన్ సినిమాల్లో స్టార్ యాక్టర్ గా గుర్తింపు పొందిన కజుకి కితమురా ‘ఓజీ’ చిత్రంలో నటించనున్నారని తెలుస్తోంది. ఆయన జపనీస్ చిత్రాలలోనే కాకుండా కొన్ని హాలీవుడ్ చిత్రాలలో కూడా నటించారు. ‘కిల్ బిల్’ సినిమాలోని రెండు భాగాలలోనూ ఈ నటుడు భాగమయ్యారు. అంతే కాకుండా, కజుకి ‘గాడ్జిల్లా: ఫైనల్ వార్స్’, ‘ది రైడ్ 2’, ‘బ్లేడ్ ఆఫ్ ఇమ్మోర్టల్ తదితర హాలీవుడ్ సినిమాలో కూడా నటించారు. అలాగే ‘యాకుజా’, ‘అజుమి’ ‘రురౌని కెన్షిన్’ వంటి జపనీస్ సూపర్ హిట్ చిత్రాల్లోనూ యాక్ట్ చేశారు
కాగా ‘ఓజీ’ సినిమాలో కజుకి కితమురా మాత్రమే కాదు, ఒక ప్రముఖ థాయ్ నటుడు కూడా నటించనున్నారు. వితయా పన్శ్రీగన్ ‘OG’ సినిమాలో కూడా యాక్ట్ చేయనున్నారు. గతంలో ‘ఓన్లీ గాడ్ ఫర్గివ్స్’, ‘హ్యాంగోవర్ 2’, ‘పారడాక్స్’, తదితర సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు వితయా. అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2’ సినిమాలో ఆయన జపనీస్ మాఫియా డాన్ పాత్రలో ఆకట్టుకున్నాడు. ఇప్పుడు ఈ నటుడు ‘ఓజీ’ సినిమాలో విలన్ పాత్రలో నటించనున్నాడని సమాచారం.
కాగా ఓజీ సినిమాలో మరో హైలైట్ ఏంటంటే.. పవన్ కళ్యాణ్ కుమారుడు అకీరా నందన్ ఈ సినిమా ద్వారా సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇవ్వునున్నాడని తెలుస్తోంది. త్వరలోనే ఈ మూవీ గురించి మరిన్ని అప్ డేట్స్ రానున్నాయి.
ఈసారి ముగించడమే..
Malli Modhalaindi…. Eeesaari Mugiddaaam… #OG #TheyCallHimOG #FireStormIsComing pic.twitter.com/gvvsS3q2PQ
— DVV Entertainment (@DVVMovies) May 12, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.