Ananya Nagalla: హీరోయిన్ అనన్య నాగళ్ల దగ్గర జాబ్ చేయాలనుకుంటున్నారా? అర్హత, అనుభవం తదితర వివరాలివే
టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ అనన్య నాగళ్ల గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ప్రస్తుతం తెలుగులో చిన్న సినిమాలకు, అందులోనూ మహిళా ప్రాధాన్య చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయిందీ అందాల తార. ప్రస్తుతం ఈ వరంగల్ హీరోయిన్ చేతిలో పలు క్రేజీ ప్రాజెక్టులున్నాయి.

ఉన్నత చదువులు అభ్యసించి సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా కెరీర్ ప్రారంభించింది అనన్య నాగళ్ల. అయితే సినిమాపై ఉన్న మక్కువతో నటిగా మారింది. మొదట షార్ట్ ఫిల్మ్స్ లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత ‘మల్లేశం’ లాంటి ఓ డిఫరెంట్ మూవీతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఇక పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన వకీల్ సాబ్ లో అనన్య అభినయం అందరినీ ఆకట్టుకుంది. వీటి తర్వాత ప్లే బ్యాక్, మ్యాస్ట్రో, ఊర్వశివో రాక్షసివో, శాకుంతలం, తంత్ర, డార్లింగ్, పొట్టేల్, శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ తదితర సినిమాల్లో హీరోయిన్ గా , సెకెండ్ ఫీమెల్ లీడ్ రోల్స్ పోషించి మెప్పించింది. అలాగే బహిష్కరణ వెబ్ సిరీస్ లోనూ ఒక వైవిధ్యమైన పాత్రతో ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో పలు సినిమాలు ఉన్నాయి. సినిమాల సంగతి పక్కన పెడితే సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ ముందుంటుంది అనన్య. ఆ మధ్యన ఇరు తెలుగు రాష్ట్రాల్లో వరదలు సంభవించినప్పుడు తనకు తోచినంత విరాళం అందించి అందరి మన్ననలు అందుకుంది. అలాగే హైదరాబాద్ నగరంలో రాత్రిళ్లు రోడ్లపైనే నిద్రించే పేదలు, అనాథలకు దుప్పట్లు పంపిణీ చేసి తన అందమైన మనసును చాటుకుంది.
ఇటీవల పహల్గామ్ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన నెల్లూరు జిల్లాకు చెందిన మధు సూదన రావు కుటుంబాన్ని పరామర్శించింది అనన్య. వారి ఇంటికెళ్లి మరీ బాధిత కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పింది. ఇలా అతి తక్కువ సమయంలోనే అనన్య నాగళ్ల తెలుగు జనాల గుండెల్లో మంచి స్థానం దక్కించుకుంది.
అనన్య నాగళ్ల పోస్ట్..

Ananya Nagalla Post
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అనన్య తాజాగా ఇన్ స్టా స్టోరీస్ లో ఒక పోస్ట్ షేర్ చేసింది. ఈ సందర్భంగా ఫ్యాషన్ డిజైనర్లకు బంపర్ ఆఫర్ ప్రకటించిందీ అందాల తార. ‘ ఫ్యాషన్ డిజైనర్ కోసం వెతుకుతున్నాను. 0-6 సంవత్సరాల అనుభవం ఉండాలి. దయచేసి మీ రెజ్యూమ్‌ను CAREERS@MAYNAO.IN కు పంపండి. దయచేసి DM చేయవద్దు’ అని అందులో పేర్కొంది. ప్రస్తుతం ఈ పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. అనన్య నాగళ్ల దగ్గర ఫ్యాషన్ డిజైనర్ గా పనిచేయాలనుకునేవారికి ఇది ఒక సదవకాశమని చెప్పవచ్చు.
అనన్య నాగళ్ల లేటెస్ట్ ఇన్ స్టా గ్రామ్ పోస్ట్..
View this post on Instagram
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి . .