- Telugu News Photo Gallery Cinema photos Aishwarya Lekshmi latest mesmerizing looks in saree goes viral in internet
Aishwarya Lekshmi: మెరుపునే కుంచె చేసి రవివర్మ గీసిన వదనం ఈ భామ.. మెస్మరైజ్ ఐశ్వర్య..
ఐశ్వర్య లక్ష్మి మలయాళం, తమిళ చిత్రాలలో ప్రధానంగా నటిస్తుంది. తెలుగులో కూడా రెండు సినిమాల్లో చేసింది ఈ వయ్యారి. ఆమె ఒక ఫిలింఫేర్ సౌత్ అవార్డు, ఒక కేరళ ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డు, మూడు SIIMA అవార్డులను గెలుచుకుంది. ఈమె నటనకి ఫిదా కానీ ప్రేక్షకులు ఉండరు. తాజాగా ఇన్‌స్టాగ్రామ్ లో తన ఫోటోలు షేర్ చేసింది. వీటిని చూసిన ఈ బ్యూటీ అభిమానులు వావ్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.
Updated on: May 13, 2025 | 6:47 PM

6 సెప్టెంబర్ 1991న దేవతల భూమి కేరళ రాష్ట్ర రాజధాని, అనంత పద్మనాధుని నగరం త్రివేండ్రం (తిరువనంతపురం)లో ఓ హిందూ కుటుంబంలో జన్మించింది జన్మించింది అందాల తార ఐశ్వర్య లక్ష్మి. త్రివేండ్రంలోతన పాఠశాల విద్యను హోలీ ఏంజెల్స్ కాన్వెంట్, త్రిస్సూర్‌లోని సేక్రేడ్ హార్ట్ కాన్వెంట్ గర్ల్స్ హయ్యర్ సెకండరీ స్కూల్‌లో చదువుకుంది. ఎర్నాకులంలోని శ్రీ నారాయణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (SNIMS) నుంచి MBBS డిగ్రీ పట్టా పొందింది. అక్కడే తన ఇంటర్న్‌షిప్ కూడా పూర్తి చేసింది.

మోడలింగ్ లో తన కెరీర్ మొదలుపెట్టింది. ఫ్లవర్ వరల్డ్, సాల్ట్ స్టూడియో, వనిత, FWD లైఫ్ వంటి మ్యాగజైన్‌ల కవర్‌లపై కనిపించింది. చెమ్మనూర్ జ్యువెలర్స్, కరికినేత్ సిల్క్స్, లా బ్రెండా, ఎజ్వా బోటిక్, అక్షయ జ్యువెల్స్, శ్రీ లక్ష్మి జ్యువెలరీ మొదలైన బ్రాండ్‌లకు మోడల్‌గా పనిచేసింది.

మలయాళీ ఫ్యామిలీ డ్రామా సినిమా నందుకలుడే నత్తిల్ ఒరిదవేలాలో ప్రముఖ పాత్రతో చలనచిత్ర అరంగేట్రం చేసింది. తర్వాత మరి కొన్ని మలయాళీ చిత్రాలు చేసింది. మాయానది, వరతన్, బ్రదర్స్ డే, అర్చన 31 నాటౌట్, క్రిస్టోఫర్, కింగ్ ఆఫ్ కోత వంటి చిత్రాల్లో నటించింది.

2019లో యాక్షన్ అనే సినిమాతో తొలిసారి తమిళంలో నటించింది. తర్వాత జగమే తంధిరమ్, పుతం పుదు కాళై విదియాధా, గార్గి, కెప్టెన్, పొన్నియిన్ సెల్వన్: పార్ట్ 1 అండ్ పార్ట్ 2 వంటి చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం థగ్ లైఫ్ చిత్రంలో నటిస్తుంది.

2022లో సత్యదేవ్ హీరోగా తెరకెక్కిన గాడ్సే సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అయింది. గత ఏడాది అమ్ము అనే చిత్రంలో ప్రధానపాత్రలో ఆకట్టుకుంది. ప్రస్తుతం తెలుగులో సాయి దుర్గ తేజ్ సంబరాల ఎటి గట్టు సినిమాతో పాటు తమిళంలో కమల్ హసాన్ థగ్ లైఫ్ చిత్రంలో నటిస్తుంది.




