AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తమిళనాట విజయ్ Vs బీజేపీ.. పొత్తుకు నో చెప్పినందుకే సీబీఐ రూటు మార్చిందా..?

తమిళనాడు రాజకీయాల్లో ఇప్పుడు దళపతి విజయ్ చుట్టూ ముదురుతున్న రాజకీయ సెగలు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి. దశాబ్దాల కాలంగా డీఎంకే, అన్నా డీఎంకేల మధ్యే సాగుతున్న అధికార పోరులోకి తమిళగ వెట్రి కళగంతో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన విజయ్‌ను లొంగదీసుకునేందుకు కేంద్రం వ్యూహాలు రచిస్తోందా? ఎన్డీయే కూటమిలోకి రావాలన్న ప్రతిపాదనను విజయ్ తిరస్కరించడమే ఇప్పుడు ఆయన సినిమా టీమ్‌కు సీబీఐ ఉచ్చుగా మారిందా?

తమిళనాట విజయ్ Vs బీజేపీ.. పొత్తుకు నో చెప్పినందుకే సీబీఐ రూటు మార్చిందా..?
Is The Cbi Targetting Vijay Jananayakan Movie Crew
Ch Murali
| Edited By: |

Updated on: Mar 19, 2026 | 2:02 PM

Share

తమిళనాడు రాజకీయ రణక్షేత్రం ఇప్పుడు డీఎంకే, అన్నా డీఎంకేల మధ్యే కాదు, తలపతి విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం వర్సెస్ కేంద్రం అన్నట్లుగా మారిపోయింది. విజయ్‌ను ఎలాగైనా ఎన్డీయే కూటమిలోకి లాగాలని బీజేపీ చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో ఇప్పుడు కేంద్ర దర్యాప్తు సంస్థల ద్వారా ఆయన్ని ఇరకాటంలో పెట్టేందుకు కుట్రలు జరుగుతున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా విజయ్ నటించిన తాజా చిత్రం జననాయకన్ ఇప్పుడు సీబీఐ రాడార్‌లోకి రావడం సంచలనం రేపుతోంది. గత కొద్దిరోజులుగా విజయ్ బీజేపీతో కలిసి ఎన్నికల బరిలోకి దిగుతారని జోరుగా ప్రచారం సాగింది. పార్టీలోని కొందరు నేతలు కూడా కూటమి వైపే మొగ్గు చూపినప్పటికీ, విజయ్ సన్నిహితులు మాత్రం రాజకీయ భవిష్యత్తు ఉండాలంటే ఒంటరి పోరే సరైన మార్గమని సూచించినట్లు తెలుస్తోంది. దీంతో విజయ్ తన నిర్ణయాన్ని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. ఎవరితోనూ పొత్తు పెట్టుకోకుండా ఒంటరిగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తానని ప్రకటించడంతో కేంద్రానికి, విజయ్‌కు మధ్య దూరం పెరిగింది.

కరూర్ తొక్కిసలాట.. సీబీఐ విచారణలో షాకింగ్ మలుపు

ఇటీవల కరూర్‌లో జరిగిన భారీ బహిరంగ సభలో తొక్కిసలాట జరిగి 41 మంది మృతి చెందిన ఘటనపై సీబీఐ విచారణ ముమ్మరం చేసింది. ఈ కేసులో ఇప్పటికే విజయ్‌ను సీబీఐ రెండుసార్లు విచారించింది. అయితే ఈ విచారణ వెనుక అసలు కారణం సినిమా షూటింగ్ అని సీబీఐ అనుమానిస్తోంది. జననాయకన్ సినిమా కోసం భారీ జనసందోహం ఉన్న దృశ్యాలను రికార్డ్ చేసేందుకు విజయ్ ఉద్దేశపూర్వకంగానే సభకు ఆలస్యంగా వచ్చారని సీబీఐ భావిస్తోంది. మధ్యాహ్నం రావాల్సిన విజయ్, సాయంత్రం 7 గంటలకు చేరుకున్నారని.. జనం బాగా పోగైన తర్వాత ఆ దృశ్యాలను షూట్ చేసి సినిమాలో వాడుకున్నారని, అదే తొక్కిసలాటకు దారితీసిందని సీబీఐ అనుమానిస్తోంది.

నెక్స్ట్ టార్గెట్.. జననాయకన్ టీమ్

ఈ క్రౌడ్ షూటింగ్ వ్యవహారంపై విజయ్‌ను ప్రశ్నించగా, తనకు తెలియదని ఆయన సమాధానం ఇచ్చినట్లు సమాచారం. దీంతో సీబీఐ ఇప్పుడు తన దృష్టిని జననాయకన్ చిత్ర బృందంపై సారించింది. త్వరలోనే సినిమా డైరెక్టర్, ప్రొడక్షన్ టీమ్‌ను విచారణకు పిలిచే అవకాశం ఉంది. విజయ్ తమ కూటమిలోకి రానందుకు ప్రతీకారంగానే బీజేపీ ఇలాంటి కుట్రలు చేస్తోందని టీవీకే నేతలు ఆరోపిస్తున్నారు. సీబీఐ విచారణ పేరుతో ఒత్తిడి తెచ్చి లొంగదీసుకోవాలని చూస్తున్నారని, కానీ విజయ్ తగ్గేదే లేదని స్పష్టం చేస్తున్నారు. ఎన్నికల వేళ తమిళనాట ఈ సినిమా – పాలిటిక్స్ వార్ ఎటు దారితీస్తుందోనని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

Follow Us