Warangal: ఉన్మాదులుగా మారుతున్న గంజాయి బ్యాచ్
వరంగల్‌లో గంజాయి బ్యాచ్ అరాచకాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. అమాయకులపై విచక్షణారహితంగా దాడులు చేస్తూ సోషల్ మీడియాలో వీడియోలు అప్‌లోడ్ చేస్తున్నారు. ఇటీవల గాంధీనగర్‌కు వెళ్లిన సురేష్‌పై రాళ్లతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ఈ ఘటనతో వరంగల్ ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. నెల రోజుల్లో ఐదు ఘటనలు జరిగినా పోలీసులు చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
వరంగల్‌లో గంజాయి మత్తుకు బానిసలైన పోకిరీలు ఉన్మాదులుగా మారి అమాయకులపై విచక్షణారహితంగా దాడులకు పాల్పడుతున్నారు. సోషల్ మీడియాలో స్టార్స్ కావాలనే ఆలోచనతో ప్రజలపై ప్రతాపం చూపుతున్నారు. ఈ దాడులను వీడియోలు తీసి అప్‌లోడ్ చేయడంతో వరంగల్‌లో తీవ్ర కలకలం రేగుతోంది. నెల రోజుల వ్యవధిలో ఇలాంటి ఐదు ఘటనలు జరిగాయి. ఇటీవల వరంగల్‌లోని ఎల్బీ నగర్‌లో జరిగిన ఘటనలో గాంధీనగర్‌కు వెళ్లిన సురేష్‌ను గంజాయి మత్తులో ఉన్న ఇద్దరు యువకులు అడ్డగించారు. బండరాయితో కొడుతూ, పిడిగుద్దులు గుద్దుతూ, కాళ్లతో తన్నుతూ తీవ్రంగా గాయపరిచారు. ఈ దాడిని వీడియో తీసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వీళ్లు మామూలు దొంగలు కాదు.. ఏకంగా సెల్ టవర్లనే..
ఆటోలో 4.5 లక్షల నగలు మర్చిపోయిన మహిళ.. చివరికి..
అనారోగ్యం పాలైన భర్త.. బైక్ మెకానిక్‌గా మారిన భార్య
రోజూ నందీశ్వరుడికి ప్రదక్షిణలు చేస్తున్న నాగుపాము
అది బస్సా లేక విమానమా? కేరళ ఆర్టీసీ లగ్జరీ ప్రయాణం!
దుబాయ్‌లో సింగిల్ రూమ్ అద్దె ఎంతో తెలిస్తే నోరెళ్లబెడతారు!
అయ్యో.. అక్కడ సముద్రం ఎండిపోయిందా!
పిందె నుంచి కాయ వరకూ.. కొబ్బరికాయ తయారీలో ఆసక్తికరమైన దశలు
క్లాస్ రూంలో పాఠాలు చెబుతున్న టీచర్ అంతలోనే
బైకులోనుంచి వింత శబ్దాలు..దెబ్బకు బైకు వదిలి వ్యక్తి పరుగులు
ఏసీ కోచ్‌లో అనుమానాస్పదంగా మహిళ లగేజ్.. ఓపెన్ చేయగా చేయగా

