Jailer 2: జైలర్2 లో పవన్.. ఇంతకీ నిజమేనా ??
జైలర్ 2 చిత్రం నుండి షారుఖ్ ఖాన్ తప్పుకోవడంతో, ఆయన స్థానంలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ నటించే అవకాశాలపై అభిమానులు ఉత్సాహంగా చర్చించుకుంటున్నారు. అతిథి పాత్ర కాబట్టి పవన్ ఓకే చెప్పవచ్చని ఊహాగానాలు చేస్తున్నారు. గతంలో తన సినిమాల గురించి తానెప్పుడూ చెప్పనని పవన్ ప్రకటించినా, జైలర్ 2 విషయంలో మాత్రం ఫ్యాన్స్ ఆశలు పెంచుకుంటున్నారు. ఈ పుకార్లలో నిజమెంత ఉందో వేచి చూద్దాం.
నా గురించి నేను చెప్పే దాకా వెయిట్‌చేయండర్రా అంటున్నారు పవర్‌స్టార్. మీరు చెప్పేటప్పుడు చెప్పండి బాస్.. ఇప్పుడు మాత్రం ఈ ఫీలింగ్ హాయిగా ఉందంటున్నారు ఫ్యాన్స్. జైలర్ సీక్వెల్ నుంచి షారుఖ్ డ్రాప్ అయ్యారనే వార్త అలా ఫ్లాష్ అయిందో లేదో.. ఇలా పవర్‌స్టార్‌ని రీప్లేస్ చేసి చూసుకుంటూ సరదాపడుతున్నారు అభిమానులు. ఉస్తాద్ భగత్‌సింగ్… బాక్సాఫీస్ దగ్గర దుమ్మురేపుతుందనుకుంటే, సైలెంట్‌గా ఫ్యాన్స్ ఆశల మీద నీళ్లు చల్లేసింది. ఆ సినిమా అటూ ఇటూ అయితేనేం… నెక్స్ట్ సినిమాలు మామూలుగా ఉండవు. మా ఓజీ స్టార్‌ని మరో రేంజ్‌లో నిలబెడుతాయంటూ రకరకాల ఈక్వేషన్స్ తో సోషల్ మీడియాలో ట్రెండ్ చేశారు ఫ్యాన్స్. అలాంటివేమీ లేవురా అబ్బాయిలూ.. ఉంటే నేనే చెబుతా కదా అని ఓపెన్ అయ్యారు పవన్ కల్యాణ్. పవర్‌స్టార్ చెప్పిన మాటలకు కొన్నాళ్లు సైలెంట్‌గా ఉన్న ఫ్యాన్స్.. ఇప్పుడు మరో విషయం గురించి మాట్లాడుకోవడం మొదలుపెట్టేశారు. అదీ జైలర్ సీక్వెల్‌తో ముడిపెట్టి. జైలర్ సీక్వెల్‌లో షారుఖ్ నటిస్తారన్నది ఎప్పటి నుంచో ఊరిస్తున్న మాట. కానీ, ఇప్పుడు షారుఖ్ సారీ చెప్పేశారనే విషయం వైరల్ అవుతోంది. కింగ్ సినిమా పనులతో బిజీగా ఉండటం, రెండు సినిమాల షెడ్యూల్స్ క్లాష్ కావడంతో సూపర్‌స్టార్‌కి సాయం చేయడానికి కుదరట్లేదట షారుఖ్‌కి. మరి.. షారుఖ్ ప్లేస్‌ని రీప్లేస్ చేయాలంటే ఓ స్ట్రేచర్ ఉండాలి కాబట్టి, పవర్‌స్టార్ అయితే పర్ఫెక్ట్ గా సరిపోతారనే డిస్కషన్ షురూ అయింది. గెస్ట్ అప్పియరెన్స్ కి ఎక్కువ కాల్షీట్లు కూడా అవసరం ఉండదు కాబట్టి, కేరక్టర్ నచ్చితే పవన్ కల్యాణ్ ఓకే చెప్పొచ్చనే మాటలూ వినిపిస్తున్నాయి. ఏం జరుగుతుందో లెట్స్ వెయిట్ అండ్ సీ…
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వరికోత కోస్తున్న కూలీలు..దుబ్బుల మాటున ఉన్నది చూసి హడల్
పోలీస్ స్టేషన్ సమీపంలోనే రెచ్చిపోయిన దొంగలు.. ఏం చేశారో చూడండి
UPI Rules 2026: RBI కొత్త ప్రతిపాదన.. UPI పేమెంట్లలో గంట ఆగాల్సిందే
వరికోత కోస్తున్న కూలీలు..దుబ్బుల మాటున ఉన్నది చూసి హడల్
పోలీస్ స్టేషన్ సమీపంలోనే రెచ్చిపోయిన దొంగలు.. ఏం చేశారో చూడండి
మహిళా పోలీసుల అండర్ కవర్ ఆపరేషన్.. ఆరుగురు అరెస్ట్
భర్త నల్లగా ఉన్నాడని భార్య దారుణం..
అటవీ మార్గంలో బస్సు పై దాడి.. ప్రయాణికుల హాహాకారాలు
ఇంటర్నెట్ కేబుల్ తో ఇంటిగుట్టు చౌర్యం
ఎవరినైనా తిట్టారో.. తిట్టుకు రూ.500 ఫైన్.. ఎక్కడో తెలుసా ??

