AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చిన్నారుల రక్తపు మరకల.. బ్యాగులతో చర్చలు

చిన్నారుల రక్తపు మరకల.. బ్యాగులతో చర్చలు

Phani CH
|

Updated on: Apr 12, 2026 | 5:19 PM

Share

పాకిస్థాన్‌లో ఇరాన్-అమెరికా శాంతి చర్చలు మొదలయ్యాయి. యుద్ధంతో ఇరాన్‌లో సామాన్యుల కష్టాలు, తీవ్రమైన ద్రవ్యోల్బణం, నిత్యావసరాల ధరల పెరుగుదల ప్రధాన సమస్యలుగా మారాయి. అమాయక చిన్నారుల మరణాలను గుర్తుచేస్తూ ఇరాన్ ప్రతినిధి బృందం చేసిన నిరసన ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. శాంతి చర్చల్లో కాల్పుల విరమణపై దృష్టి సారించారు.

పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్ లో ఇరాన్‌ అమెరికా శాంతి చర్చలు ప్రారంభమయ్యాయి. ఇరాన్ ప్రతినిధి బృందం రక్తసిక్తమైన స్కూల్ బ్యాగులు, బూట్లు, మరణించిన చిన్నారుల ఫొటోలను తమ వెంట తీసుకువెళ్లారు. విమానంలో ముందు వరుస సీట్లలో ఆ వస్తువులను ఉంచి కంట తడి పెట్టుకున్నారు ఇరాన్ స్పీకర్. ఆ ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అందరినీ కలచివేసింది. యుద్ధం తొలి రోజు ఫిబ్రవరి 28న మినాబ్ పట్టణంలో అమెరికా-ఇజ్రాయెల్ జరిపినట్లు ఆరోపిస్తున్న దాడుల్లో 168 మంది పాఠశాల విద్యార్థులు మరణించారు. వారి జ్ఞాపకార్థం ఇరాన్ తమ ప్రతినిధి బృందానికి ‘మినాబ్ 168’ అని పేరు పెట్టింది. ఈ చర్చల్లో ప్రధానంగా టెహ్రాన్ ప్రతిపాదించిన 10 సూత్రాల కాల్పుల విరమణపై చర్చించనున్నారు. యుద్ధంతో ఇరాన్‌లో సామాన్యుల కష్టాలు మామూలుగా లేవు. యుద్ధం ఎఫెక్ట్‌తో ద్రవ్యోల్బణం పెరిగి పరిస్థితి దారుణంగా మారుతోంది. ఉపాధి అవకాశాలు కూడా తగ్గడంతో ప్రజల కొనుగోలు శక్తి క్షీణించింది. ఇరానియన్ రియాల్ బలహీనపడుతుండటంతో.. మార్కెట్లో ధరలు అమాంతం పెరిగిపోయాయి. దీంతో అక్కడి ప్రజలు నిత్యావసరాలు కొనేందుకూ తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఉంది. ఉప్పు, పప్పు మొదలుకొని కూరగాయల ధరల వరకూ అన్నీ పెరిగిపోయాయి. ఇరాన్‌లో ద్రవ్యోల్బణం ఎఫెక్ట్ అక్కడి ఆహార పదార్థాలపై పడింది. కిలో బియ్యం ధర నెటిజన్లను షాకయ్యేలా చేస్తోంది. ఇరాన్‌లో ప్రస్తుతం కిలో బియ్యం ధర 340 రూపాయల నుంచి 455 రూపాయలకు చేరుకుంది. గతంలో బియ్యం ధర రూ.53 నుంచి రూ.70 రూపాయల మధ్య ఉండేదని తెలుస్తోంది. అలాగే కిలో పప్పుల ధర ప్రస్తుతం 550 నుంచి 770 రూపాయలకు చేరింది. ఏడాది క్రితం వీటి ధర 70 నుంచి రూ.105 రూపాయల మధ్య ఉండేది. ప్రస్తుతం ధరలు విపరీతంగా పెరగడంతో సామాన్య ప్రజలు వీటిని కొనే పరిస్థితి లేక.. ఉన్న వాటితోనే సర్దుకుంటున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మహిళా పోలీసుల అండర్‌ కవర్‌ ఆపరేషన్‌.. ఆరుగురు అరెస్ట్‌

భర్త నల్లగా ఉన్నాడని భార్య దారుణం.. ఆస్కార్ లెవెల్‌ యాక్టింగ్‌తో డ్రామా

Aditya Dhar: ప్రభాస్‌ లెజెండ్‌ అంటూ.. ధురంధర్ డైరెక్టర్ క్రేజీ కామెంట్స్

ముమ్మాటికీ ఇది దాడే !! నిప్పులు చెరిగిన కమల్ హాసన్

అటవీ మార్గంలో బస్సు పై దాడి.. ప్రయాణికుల హాహాకారాలు

Follow Us