ముమ్మాటికీ ఇది దాడే !! నిప్పులు చెరిగిన కమల్ హాసన్
విజయ్ దళపతి జననాయగన్ సినిమా లీక్‌పై కోలీవుడ్‌లో కలకలం రేగింది. కమల్ హాసన్ ఈ పైరసీని తీవ్రంగా ఖండించారు, సెన్సార్ జాప్యం, వ్యవస్థ వైఫల్యాన్ని కారణమన్నారు. కళ, కళాకారులపై దాడిగా అభివర్ణిస్తూ, వందలాది మంది జీవనోపాధికి ముప్పు అన్నారు. సినీ ప్రియులు సినిమాను థియేటర్లలో చూసి పైరసీని ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు, విజయ్‌కు మద్దతుగా నిలవమన్నారు.
విజయ్ దళపతి నటించిన జననాయగన్ సినిమా నెట్టింట లీక్ అవ్వడం పై కోలీవుడ్‌లో సెలబ్రిటీలందరూ ఒక్కొక్కరిగా రియాక్టవుతున్నారు. జననాయగన్‌కు మద్దతుగా తమ గళం వినిపిస్తున్నారు. తాజాగా లోకనాయకుడు కమల్ హాసన్ కూడా ఇదే చేశారు. విజయ్‌కు మద్దతుగా మాట్లాడడమే కాదు.. తీవ్రంగా కూడా రియాక్టయ్యారు. ఇది అనుకోకుండా జరిగిన సంఘటన కాదని, వ్యవస్థ వైఫల్యం వల్లే ఇలా జరిగిందని మండిపడ్డారు. సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వకపోవడంతో సకాలంలో రిలీజ్ అవలేదని, ఈ కారణం వల్లే పైరసీకి అవకాశం ఏర్పడిందని కమల్ హాసన్ అభిప్రాయపడ్డారు. ఇది కళ, కళాకారుడిపై జరిగిన దాడి అంటూ కమల్ అభివర్ణించారు. ఇలాంటి చర్యలు వందలాది కళాకారులు, సాంకేతిక నిపుణులు, థియేటర్ ఓనర్లు, నిర్మాతలను ప్రమాదంలో పడేస్తుందని హెచ్చరించారు. వ్యవస్థ విఫలమైనప్పుడు సినిమాను ఎవరు కాపాడతారని ప్రశ్నించారు. సినీ ప్రియులు ఈ చిత్రాన్ని థియేటర్లలో చూసి పైరసీ చేసేవాళ్లకు గట్టి సమాధానమివ్వాలని కోరారు. గతంలో తనకు మద్దతుగా నిలబడినట్లే జననాయగణ్ సినిమాకు సైతం అంతే అండగా నిలవాలని పిలుపునిచ్చారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పరిహారంలోనూ పక్షపాతమేనా? రాజీవ్ రహదారి బాధితుల ఆవేదన !
ఏం..పిచ్చిపిచ్చిగా ఉందా?.. ట్రంప్ ఆంక్షలపై ఇరాన్ ఫైర్! తగ్గేదే లే
ముంచుకొస్తున్న అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాలకు వానగండం..
వందేమాతరం గీతానికి అరుదైన గౌరవం!
భారత్‌కు టైఫూన్ 'డాల్ఫిన్' దెబ్బ..మన రుతుపవనాల పై ఎఫెక్ట్!
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!

