AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆటోలో  4.5 లక్షల నగలు మర్చిపోయిన మహిళ.. చివరికి..

ఆటోలో 4.5 లక్షల నగలు మర్చిపోయిన మహిళ.. చివరికి..

Phani CH
|

Updated on: Apr 12, 2026 | 8:08 PM

Share

ఆటోలో పోయిన 4.5 లక్షల విలువైన బంగారు నగలను జగ్గంపేట పోలీసులు కేవలం మూడు గంటల్లోనే రికవరీ చేశారు. పడాల లలిత ఫిర్యాదుతో, ఎస్సై రఘునాథరావు బృందం సీసీటీవీ ఫుటేజ్, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి ఆటో డ్రైవర్‌ను గుర్తించి, నగలను తిరిగి అప్పగించారు. పోలీసుల వేగం, సమయస్ఫూర్తికి సర్వత్రా ప్రశంసలు లభించాయి.

ఆటోలో పొరపాటున వదిలేసిన లక్షలాది రూపాయల విలువైన బంగారు నగలను, కేవలం మూడు గంటల వ్యవధిలోనే ట్రేస్ చేసి బాధితురాలికి అందజేశారు పోలీసులు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి పోలీసులు చూపిన ఈ వేగం ఇప్పుడు సర్వత్రా ప్రశంసలు అందుకుంటోంది. హైదరాబాద్‌కు చెందిన పడాల లలిత అనే మహిళ వ్యక్తిగత పని మీద సామర్లకోట వచ్చారు. అక్కడ నుండి జగ్గంపేట వరకు ఆటోలో ప్రయాణించారు. ఇంటికి చేరుకున్నాక చూసుకోగా.. సుమారు 4.5 లక్షల విలువైన బంగారు నగలున్న బ్యాగు కనిపించలేదు. ఆటోలో తన బ్యాగు మర్చిపోయానని గ్రహించిన మహిళ ఆందోళనతో వెంటనే జగ్గంపేట పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. బాధితురాలి ఫిర్యాదుతో వెంటనే ఎస్సై రఘునాథరావు బృందం రంగంలోకి దిగింది. ఏ ఆటోలో ప్రయాణించారో గుర్తించడానికి పట్టణంలోని కీలక ప్రాంతాల్లో ఉన్న సీసీటీవీ ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఆధునిక సాంకేతికతను జోడించి, కేవలం 3 గంటల్లోనే ఆ ఆటోను, డ్రైవర్‌ను గుర్తించారు. ఆటో డ్రైవర్ వద్ద ఉన్న బంగారు నగలను రికవరీ చేసిన పోలీసులు, సీఐ సమక్షంలో బాధితురాలికి భద్రంగా అప్పగించారు. పోగొట్టుకున్న నగలు తిరిగి దొరకడంతో బాధితురాలు లలిత పోలీసులకు కన్నీటి పర్యంతమై కృతజ్ఞతలు తెలిపారు. అతి తక్కువ సమయంలో కేసును ఛేదించిన ఎస్సై రఘునాథరావు, ఇతర సిబ్బందిని జిల్లా ఎస్పీ, డీఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అనారోగ్యం పాలైన భర్త.. బైక్‌ మెకానిక్‌గా మారిన భార్య

రోజూ నందీశ్వరుడికి ప్రదక్షిణలు చేస్తున్న నాగుపాము

Jailer 2: జైలర్‌2 లో పవన్‌.. ఇంతకీ నిజమేనా ??

వరికోత కోస్తున్న కూలీలు..దుబ్బుల మాటున ఉన్నది చూసి హడల్‌

పోలీస్ స్టేషన్ సమీపంలోనే రెచ్చిపోయిన దొంగలు.. ఏం చేశారో చూడండి

Follow Us