AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అనారోగ్యం పాలైన భర్త.. బైక్‌ మెకానిక్‌గా మారిన భార్య

అనారోగ్యం పాలైన భర్త.. బైక్‌ మెకానిక్‌గా మారిన భార్య

Phani CH
|

Updated on: Apr 12, 2026 | 7:56 PM

Share

ఎన్టీఆర్ జిల్లాకు చెందిన శ్రీలక్ష్మి, భర్త అనారోగ్యంతో కుటుంబ భారాన్ని మోయాల్సి వచ్చింది. గృహిణిగా ఉంటూనే బైక్ మెకానిక్ వృత్తిని నేర్చుకుంది. మొదట్లో ఎగతాళి చేసినా, పట్టుదలతో కష్టమైన పనులు కూడా నేర్చుకుని కుటుంబాన్ని పోషిస్తోంది. ఆమె కృషిని అధికారులు గుర్తించారు. సంకల్పం ఉంటే మహిళలు ఏ రంగంలోనైనా రాణించగలరని నిరూపించింది.

కష్టం వస్తే కుంగిపోకుండా, ఆ కష్టాన్నే తన బలంగా మార్చుకుంది ఆ మహిళ. గృహిణిగా ఇంటికే పరిమితమైన ఆమె, భర్తకు వచ్చిన అనారోగ్యంతో తన జీవన గమనాన్ని మార్చుకుంది. పురుషులు మాత్రమే చేయగలరని భావించే బైక్ మెకానిక్ వృత్తిలోకి అడుగుపెట్టి, ఇప్పుడు ఒంటిచేతిపై కుటుంబాన్ని నడిపిస్తోంది ఎన్టీఆర్ జిల్లా మూలపాడుకు చెందిన శ్రీలక్ష్మి. శ్రీలక్ష్మి భర్త బైక్ మెకానిక్. గ్యారేజ్ నడుపుతూ కుటుంబాన్ని పోషించేవారు. అయితే వెన్నెముక సమస్యతో ఆయన శస్త్రచికిత్స చేయించుకోవాల్సి రావడంతో మంచానికే పరిమితమయ్యారు. కుటుంబ భారం శ్రీలక్ష్మిపై పడింది. మొదట కూలీ పనులకు వెళ్లినా, ఆ సంపాదన భర్త మందులకు, ఇంటి ఖర్చులకు సరిపోయేది కాదు. దీంతో భర్త వృత్తితో తన కుటుంబాన్ని పోషించేవాడో అదే మార్గంలో తనూ నడవాలనుకుంది. బైక్‌ మెకానిక్‌ వర్క్‌ నేర్చుకోవాలని నిశ్చియించుకుంది. అనుకున్నదే బైక్ మెకానిక్ పనులు నేర్చుకుంటుంటే మొదట్లో కొందరు ఎగతాళి చేసినా ఆమె పట్టించుకోలేదు. భర్త ఇచ్చే సూచనలతో ఇంజిన్ ఆయిల్ మార్చడం నుంచి క్లిష్టమైన మెకానికల్ పనుల వరకు అన్నింటిలోనూ పట్టు సాధించింది. ఇప్పుడు మగవారికి తీసిపోని విధంగా బుల్లెట్ వంటి భారీ బైకులను సైతం ఆమె నిమిషాల్లో రిపేర్ చేస్తోంది. ఆమె పనితీరు చూసి ఇప్పుడు స్థానికులు ఆశ్చర్యపోవడమే కాకుండా మెచ్చుకుంటున్నారు. శ్రీలక్ష్మి కృషిని గుర్తించిన జిల్లా అధికారులు ఆమెకు ఆధునిక సాంకేతికతలో శిక్షణ ఇప్పించారు. కష్టపడితే మహిళలు ఏ రంగంలోనైనా రాణించగలరని ఆమె నిరూపిస్తోంది. ప్రస్తుతం అద్దె స్థలంలో పనిచేస్తున్న ఈ దంపతులకు ప్రభుత్వం చిన్న స్థలం కేటాయిస్తే, సొంతంగా గ్యారేజ్ ఏర్పాటు చేసుకుని స్థిరపడతామని ఆశగా ఎదురుచూస్తున్నారు. సంకల్పం ఉంటే అడ్డంకులు ఆపలేవని శ్రీలక్ష్మి కథ మరోసారి నిరూపించింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రోజూ నందీశ్వరుడికి ప్రదక్షిణలు చేస్తున్న నాగుపాము

Jailer 2: జైలర్‌2 లో పవన్‌.. ఇంతకీ నిజమేనా ??

వరికోత కోస్తున్న కూలీలు..దుబ్బుల మాటున ఉన్నది చూసి హడల్‌

పోలీస్ స్టేషన్ సమీపంలోనే రెచ్చిపోయిన దొంగలు.. ఏం చేశారో చూడండి

UPI Rules 2026: RBI కొత్త ప్రతిపాదన.. UPI పేమెంట్లలో గంట ఆగాల్సిందే

Follow Us