డిజిటల్ చెల్లింపులు సామాన్యుల నుంచి భిక్షాటకుల వరకు వ్యాపించాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఓ భిక్షాటుడు చిల్లర అడగకుండా క్యూఆర్ కోడ్ స్కాన్‌తో విరాళాలు స్వీకరిస్తున్నాడు. టెక్నాలజీని అందిపుచ్చుకుంటున్న ఈ వ్యక్తి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాడు, డిజిటల్ ఇండియా విస్తృతికి నిదర్శనంగా నిలిచాడు.