సెల్ఫీలతో కాకరేపుతున్న గోల్డెన్ హీరోయిన్.. గుర్తుపట్టారా.. ?

Rajitha Chanti

Pic credit - Instagram

13 April 2026

టాలీవుడ్‌లో అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ స్టేటస్ అందుకున్న ముద్దుగుమ్మలలో సంయుక్త మీనన్ ఒకరు. మలయాళ చిత్ర పరిశ్రమ నుంచి వచ్చింది ఈ అమ్మడు.

'భీమ్లా నాయక్' సినిమాతో తెలుగు తెరకు పరిచయమై.. నటిగా ప్రశంసలు అందుకుంది. అలాగే మొదటి సినిమాతోనే తన నటనతో, అందంతో కుర్రకారు మనసు గెలుచుకుంది.

ఆ తర్వాత ఆమె నటించిన 'బింబిసార', 'సార్', 'విరూపాక్ష' వంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద వరుసగా భారీ విజయాలను అందుకోవడంతో 'గోల్డెన్ లెగ్' ట్యాగ్ సొంతం చేసుకుంది. 

కేవలం నటనతోనే కాకుండా, సోషల్ మీడియాలో కూడా సంయుక్త తన గ్లామర్ పవర్ చూపిస్తుంటుంది. తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోలు ఇప్పుడు నెట్టింట మంటలు రేపుతున్నాయి.

 సంయుక్త ఒక బ్లాక్ కటౌట్ డ్రెస్సులో మెరిసిపోయింది. ఆ డ్రెస్సులో ఆమె తన పర్‌ఫెక్ట్ బాడీ షేప్‌ను చూపిస్తూ, తన వంపుసొంపులతో నెటిజన్లను మంత్రముగ్ధులను చేస్తోంది.

ముఖ్యంగా ఆ డ్రెస్ డిజైన్ ఆమె అందాన్ని మరింత హైలైట్ చేస్తోంది. డీప్ నెక్ లైన్, నడుము భాగంలో ఉన్న కటౌట్స్ ఆమె గ్లామర్ డోస్‌ను అమాంతం పెంచేశాయి

ఈ ఫోటోల్లో సంయుక్త కళ్ళతోనే కవ్విస్తూ, ఎంతో కాన్ఫిడెంట్‌గా కనిపిస్తోంది. అప్పుడప్పుడు ఇలాంటి బోల్డ్ అండ్ స్టైలిష్ లుక్స్‌లో దర్శనమిచ్చి షాక్ ఇస్తుంటుంది.

తన లుక్స్‌తోనే మ్యాజిక్ చేసింది. ఈ ఫోటోలు చూసిన ఆమె అభిమానులు "బ్లాక్ బ్యూటీ", "స్టన్నింగ్", "నువ్వు ఏం చేసినా సూపర్" అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.