AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

NEET UG 2026 Admit Card: నీట్‌ యూజీ 2026 సిటీ ఇంటిమేషన్‌ స్లిప్పులు విడుదల.. అడ్మిట్‌ కార్డులు ఎప్పుడంటే?

ప్రభుత్వ, ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజీల్లో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఎంబీబీఎస్‌, బీడీఎస్‌, బీఎస్‌ఎంఎస్‌, బీయూఎంఎస్‌, బీహెచ్‌ఎంఎస్‌ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించనున్న నీట్ యూజీ 2026 ప్రవేశ పరీక్ష సిటీ ఇంటిమేషన్‌ స్లిప్‌లు విడుదలయ్యాయి. ఈ మేరకు నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) అధికారిక..

NEET UG 2026 Admit Card: నీట్‌ యూజీ 2026 సిటీ ఇంటిమేషన్‌ స్లిప్పులు విడుదల.. అడ్మిట్‌ కార్డులు ఎప్పుడంటే?
NEET UG exam city intimation slip
Srilakshmi C
|

Updated on: Apr 13, 2026 | 2:25 PM

Share

హైదరాబాద్‌, ఏప్రిల్ 13: దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజీల్లో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఎంబీబీఎస్‌, బీడీఎస్‌, బీఎస్‌ఎంఎస్‌, బీయూఎంఎస్‌, బీహెచ్‌ఎంఎస్‌ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించనున్న నీట్ యూజీ 2026 ప్రవేశ పరీక్ష సిటీ ఇంటిమేషన్‌ స్లిప్‌లు విడుదలయ్యాయి. ఈ మేరకు నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. అభ్యర్ధులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ అప్లికేషన్‌ నంబర్‌, పాస్‌వర్డ్‌, సెక్యూరిటీ పిన్‌ నమోదు చేసి నేషనల్‌ ఎలిజిబిలిటీ కమ్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (నీట్‌) 2026 సిటీ ఇంటిమేషన్‌ స్లిప్పులను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఇక నీట్‌ యూజీ 2026 పరీక్ష దేశవ్యాప్తంగా మొత్తం 552 నగరాల్లో, విదేశాల్లోని 14 నగరాల్లో ఒకే రోజు ఆఫ్‌లైన్‌ (పెన్‌, పేపర్‌) విధానంలో మే 3వ తేదీన మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరగనుంది.

నీట్‌ యూజీ 2026 సిటీ ఇంటిమేషన్ స్లిప్‌ల డౌన్‌లోడ్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఇక పరీక్షకు 4 రోజుల ముందు అంటే ఏప్రిల్ 30వ తేదీన అడ్మిట్‌ కార్డులను విడుదల చేయనున్నారు. ఇంగ్లిష్‌, హిందీ, తెలుగుతో పాటు మొత్తం 13 భాషల్లో ఈ పరీక్షను నిర్వహించనున్నారు. పరీక్ష వ్యవధి 3 గంటలు ఉంటుంది. నెగెటివ్‌ మార్కింగ్‌ ఉంటుంది. అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్‌ కోర్సులలో ప్రవేశం కోసం యేటా నీట్‌ యూజీ పరీక్షను, జాతీయ వైద్య కమిషన్ మార్గదర్శకత్వంలో ఎన్టీయే నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.

ఇవి కూడా చదవండి

సిటీ ఇంటిమేషన్‌ స్లిప్‌ను డౌన్‌లోడ్ చేయడంలో ఎవరికైనా సమస్య ఎదురైతే NTA అందించిన హెల్ప్‌లైన్ నంబర్‌లైన 011-40759000 లేదా 011-69227700 లకు కాల్ చేయాలని సూచించింది. లేదా neetug2026@nta.ac.in కు ఇమెయిల్ పంపాలని తెలిపింది. ఇతర వివరాలకు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.

నీట్‌ యూజీ 2026 సిటీ ఇంటిమేషన్ స్లిప్‌ల డౌన్‌లోడ్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us