ఇన్సులిన్ ఇంజెక్షన్ల సమస్యలకు ముగింపు పలికే దిశగా జపాన్‌లోని కుమమోటో యూనివర్సిటీ శాస్త్రవేత్తలు గొప్ప ఆవిష్కరణ చేశారు. త్వరలో ఇన్సులిన్ మందు బిళ్ళలు అందుబాటులోకి రానున్నాయి. DNP ప్రోటీన్‌తో ఇన్సులిన్‌ను కలిపి, జీర్ణ వ్యవస్థలో జీర్ణం కాకుండా నేరుగా రక్తంలోకి వెళ్లేలా వారు విజయం సాధించారు. ఇది మధుమేహ రోగులకు గణనీయమైన ఉపశమనం.