కొత్త ఏసీ కొంటున్నారా? ఇది తెలియకపోతే మీ జేబుకు చిల్లు పడటం ఖాయం!

13 April 2026

Jyothi Gadda

వేసవి తాపం నుండి తప్పించుకోవడానికి ఇప్పుడు ఏసీ అనేది విలాసం కాదు, అవసరంగా మారింది. అయితే మార్కెట్లో అందుబాటులో ఉన్న వందలాది మోడళ్లలో ఏది మనకు సరిపోతుందో ఎంచుకోవడం కష్టం! అందుకే ఈ టిప్స్ మీ కోసమే.

కొత్త ఏసీ కొనుగోలు చేసేటప్పుడు కేవలం ధరను మాత్రమే కాకుండా, అది ఎంత విద్యుత్తును వినియోగిస్తుందో గమనించడం ముఖ్యం. ఏసీ స్టార్ రేటింగ్ ఎంత ఎక్కువగా ఉంటే అంత తక్కువ విద్యుత్ ఖర్చవుతుంది.

ఏసీ సామర్థ్యాన్ని టన్నులలో కొలుస్తారు. మీ గది 100 నుండి 120 చదరపు అడుగుల లోపు ఉంటే 1 టన్ను ఏసీ సరిపోతుంది. 150 నుండి 200 చదరపు అడుగుల గదికి 1.5 టన్ను ఏసీ అవసరం.

విద్యుత్ ఆదా చేయడంలో స్టార్ రేటింగ్ కీలక పాత్ర పోషిస్తుంది. 3-స్టార్ ఏసీ కంటే 5-స్టార్ ఏసీ తక్కువ విద్యుత్తును వినియోగిస్తుంది. ప్రారంభంలో 5-స్టార్ ఏసీ ధర కొంచెం ఎక్కువగా అనిపించినప్పటికీ, దీర్ఘకాలంలో ఇది మీ కరెంట్ బిల్లును భారీగా తగ్గిస్తుంది.

ఇన్వర్టర్ ఏసీలు గది ఉష్ణోగ్రతకు అనుగుణంగా కంప్రెసర్ వేగాన్ని సర్దుబాటు చేస్తాయి. దీనివల్ల గది చల్లబడిన తర్వాత కంప్రెసర్ పూర్తిగా ఆగిపోకుండా తక్కువ వేగంతో నడుస్తుంది. ఇది విద్యుత్ ఆదాకు, ఎక్కువ కాలం మన్నుతుంది.

ఏసీలో కాయిల్స్ అనేవి కూలింగ్‌ను నిర్వహించే ముఖ్యమైన భాగాలు. అల్యూమినియం కాయిల్స్ ఉన్న ఏసీలు తక్కువ ధరకు లభించవచ్చు.

కానీ కాపర్ కాయిల్స్ ఉన్న ఏసీలు మెరుగైన కూలింగ్‌ను ఇవ్వడమే కాకుండా, రిపేర్లు తక్కువగా వస్తాయి. నిర్వహణ సులభం.

అవసరానికి మించి పెద్ద ఏసీ లేదా చిన్న ఏసీని ఎంచుకుంటే అది విద్యుత్ బిల్లుపై ప్రభావం చూపుతుంది.  వీటితో పాటు ఆఫ్టర్ సేల్స్ సర్వీస్, వారంటీ వివరాలను కూడా సరిచూసుకోవాలి.