AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆరోగ్యాన్నిచ్చే అంబలి.. ఇలా చేసి తింటే మళ్లీ మళ్లీ కావాలంటారు!

వేసవి కాలంలో చాలా మంది లిక్విడ్స్ తీసుకోవడానికి ఎక్కువ ఇంట్రస్ట్ చూపిస్తుంటారు. అయితే ఈ సమ్మర్‌లో ఆరోగ్యంగా ఉండాలి అంటే తప్పకుండా అంబలి తాగాల్సిందే అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ముఖ్యంగా దీనిని చిన్న పిల్లలకు పెడితే, చాలా ఇష్టంగా మళ్లీ మళ్లీ కావాలి అంటూ తింటారంట. మరి ఈ అంబలి ఇంటిలో సులభంగా ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం.

Samatha J
|

Updated on: Apr 13, 2026 | 1:50 PM

Share
కావాల్సిన పదార్థాలు : బియ్యం రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్స్, ఉప్పు, పెసరపప్పు, నీళ్ళు.

1 / 5
తయారీ విధానం : ముందుగా బియ్యాన్ని శుభ్రంగా కడగాలి. తర్వాత వాటిని ఫ్యాన్ కింద ఆరబెట్టి, నీటి పదన లేకుండా చూసుకోవాలి. ఆ తర్వాత పెసర పప్పు తీసుకొని వాటిని పెనంపై వేయించాలి. తర్వాత ఈ రెండింటినీ మంచిగా మిక్సీ పట్టుకోవాలి.

2 / 5
తర్వాత స్టవ్ ఆన్ చేయాలి. పాన్ పెట్టి, అందులో కొన్ని నీళ్లు పోసి మిక్సీ పట్టుకున్న పౌడర్ వేసి బాగా కలపాలి. ఇలా చేయడం వలన పిండి బాగా ఉడుకుతుంది. బుడగలు వచ్చే సమయంలో కొంచెం ఉప్పు వేయాలి. తర్వాత బాగా కలపాలి.

3 / 5
తర్వాత దీనిని వేరే బౌల్‌లోకి తీసుకొని, పై కొంచెం కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. అంతే టేస్టీ టేస్టీ అంబలి రెడీ. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. దీనిని ప్రతి రోజూ తినడం వలన కీళ్ల సమస్యలు తొలిగిపోతాయి. ఆరోగ్యం బాగుంటుంది, శరీరానికి చలువ చేస్తుంది.

4 / 5
ముఖ్యంగా చిన్న పిల్లలకు చాలా బెస్ట్ బ్రేక్ ఫాస్ట్ అని చెప్పాలి. ఇది వారి ఎదుగుదలకు ఉపయోగపడుతుంది. ఎముకలు బలంగా ఉండటమే కాకుండా జీర్ణక్రియ సాఫీగా సాగేలా చేస్తుంది. రక్తహీనత వంటి సమస్యల నుంచి త్వరగా బయటపడేలా చేస్తుంది.

5 / 5
Follow Us