AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actress Archana : శ్రీరామదాసు సినిమాలో సీతగా ఛాన్స్.. ఎవరికీ చెప్పాదన్నారు.. ఎందుకంటే..

శ్రీరామదాసు సినిమాలో సీత పాత్ర తన కెరీర్‌కు మలుపు అని నటి అర్చన అన్నారు. దర్శకుడు కె. రాఘవేంద్రరావు తనను ఆ పాత్రకు ఎలా ఎంపిక చేశారో ఆమె వివరించారు. తన మొదటి సినిమా అనుభవం, ఆ తర్వాత ఎదురైన కెరీర్ సవాళ్లపై కూడా అర్చన తన అభిప్రాయాలను పంచుకున్నారు. చాలా కాలం సినిమాలకు దూరంగా ఉన్న ఆమె ఇప్పుడు ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇస్తున్నారు.

Actress Archana : శ్రీరామదాసు సినిమాలో సీతగా ఛాన్స్.. ఎవరికీ చెప్పాదన్నారు.. ఎందుకంటే..
Sriramadasu
Rajitha Chanti
|

Updated on: Nov 11, 2026 | 6:50 AM

Share

తెలుగు సినీ పరిశ్రమలో తనదైన ముద్ర వేసిన నటి అర్చన, తన కెరీర్‌లో శ్రీరామదాసు చిత్రంలో సీత పాత్ర అత్యంత కీలకమైనదని వెల్లడించారు. ప్రముఖ దర్శకుడు కె. రాఘవేంద్రరావు ఈ అవకాశాన్ని తనకు ఎలా అందించారో, ఆ అనుభవాలు తనపై ఎలాంటి ప్రభావం చూపాయో పంచుకున్నారు. శ్రీరామదాసు చిత్రానికి సీత పాత్ర కోసం నటీనటుల ఎంపిక జరుగుతున్న సమయంలో, అర్చనకు డాన్స్ బ్యాక్‌గ్రౌండ్ ఉండటం కలిసొచ్చింది. తాను మనసులో ఆ పాత్రను చేయాలని బలంగా కోరుకున్నానని, అది ఒక మానిఫెస్టేషన్ లా జరిగిందని ఆమె వివరించారు. రాఘవేంద్రరావు ఆమెను పిలిచి లుక్ టెస్ట్ నిర్వహించారు. ఎటువంటి సందేహం లేకుండా “సీతా, యు ఆర్ సెలెక్టెడ్, సైలెంట్ గా ఉండు” అని చెప్పి పాత్రను ఖరారు చేశారని అర్చన గుర్తు చేసుకున్నారు. కె. రాఘవేంద్రరావు తనను ఇప్పటికీ “సీత” అని ఆప్యాయంగా పిలుస్తారని తెలిపారు. ఈ పాత్ర తనకు అపారమైన ప్రజాదరణను తెచ్చిపెట్టిందని, తద్వారా తన కెరీర్‌కు గొప్ప మలుపునిచ్చిందని అర్చన అన్నారు. అయితే, తన కెరీర్ ప్రస్థానంలో ఎదురైన కొన్ని సవాళ్లను కూడా అర్చన ప్రస్తావించారు. తన మొదటి చిత్రం “నువ్వొస్తానంటే నేనొద్దంటానా” గురించి మాట్లాడుతూ, థియేటర్లలో ఆశించినంత విజయం సాధించకపోయినా, టీవీలో చాలా మంది చూసి తన నటనను ప్రశంసించారని చెప్పారు. ఈవీవీ సత్యనారాయణ తన ఫోటోలు చూసి, ఎటువంటి ఆడిషన్ లేకుండానే ఎంపిక చేశారని, “యు ఆర్ ఏ బ్యూటిఫుల్ తెలుగు అమ్మాయి” అని ప్రశంసించి, శుభాకాంక్షలు తెలిపారని అర్చన గుర్తు చేసుకున్నారు. అది తనకెంతో సంతోషాన్ని కలిగించిన క్షణమని పేర్కొన్నారు.

అనంతరం, “నువ్వొస్తానంటే నేనొద్దంటానా” చిత్రంలో తన పాత్ర గురించి మాట్లాడుతూ చిన్న అసంతృప్తిని వెల్లడించారు. మెయిన్ లీడ్‌గా చేస్తున్న తనకు ఆ చిత్రంలో కళ్ళద్దాలతో కూడిన ఒక క్యారెక్టర్ రోల్ ఇవ్వడం వల్ల కొంత నిరాశ చెందానని తెలిపారు. అప్పట్లో మెయిన్ లీడ్‌గా పరిచయమైన తర్వాత ఇలాంటి సహాయక పాత్రలు చేయడం వల్ల తన హీరోయిన్ ఇమేజ్ పలచబడిందని భావించారు. ఈ సంఘటన తన కెరీర్‌ను ప్రభావితం చేసిందని, దాని వల్ల కొన్ని మెయిన్‌స్ట్రీమ్ హీరోయిన్ అవకాశాలు కోల్పోయానని ఆమె అన్నారు. పెద్ద ప్రొడక్షన్ హౌస్‌లు కూడా “అర్చన వేద సినిమాలో క్యారెక్టర్ రోల్ చేస్తోంది” అని భావించాయని, అది ఒక ఫన్నీ సిట్యుయేషన్ అని వ్యాఖ్యానించారు.

తెలుగు అమ్మాయిగా, మంచి రూపం, నటన, భాషపై పట్టు ఉన్నప్పటికీ, ప్రారంభ రోజుల్లో సరైన గుర్తింపు, పాత్రలు లభించకపోవడంపై తాను చాలా బాధపడ్డానని అర్చన పంచుకున్నారు. “నాకు లుక్స్ ఉన్నాయి, తెలుగు అమ్మాయిని, భాష వచ్చు, తెలివితేటలు ఉన్నాయి, యాక్టింగ్ వచ్చు. నాకు ఇంకా పుంజుకొని రావాలి కదా రోల్స్, ఎందుకు రావట్లేదు?” అనే ప్రశ్న తనను పదే పదే వేధించేదని తెలిపారు. ఒక సమయంలో ఈ ప్రభావం చాలా తీవ్రంగా ఉండేదని, కానీ ఆ తర్వాత దాన్ని వదిలేసి జీవితాన్ని ఆస్వాదించడం మొదలుపెట్టానని అర్చన చెప్పారు.

ఎక్కువ మంది చదివినవి : Rajeev Kanakala: ఆ సినిమా హిట్ కాదేమో అని తారక్ చాలా ఎమోషనల్ అయ్యాడు.. కట్ చేస్తే.. బ్లాక్ బస్టర్ హిటైన మూవీ..

Follow Us