డెకాయిట్ మూవీతో మరో బ్లాక్ బస్టర్.. రెమ్యునరేషన్ తగ్గించుకున్న మృణాల్

Rajitha Chanti

Pic credit - Instagram

13 April 2026

టాలీవుడ్‌లో ప్రస్తుతం మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ ఎవరంటే అందరూ చెప్పే పేరు మృణాల్ ఠాకూర్. 'సీతారామం' సినిమాతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో 'సీత'గా స్థిరపడిపోయింది.

తర్వాత వరుస సినిమాలతో తన క్రేజ్‌ను అమాంతం పెంచుకుంది. తాజాగా అడివి శేష్‌తో కలిసి నటించిన 'డెకాయిట్' సినిమా కోసం మృణాల్ చేసిన త్యాగం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.

సాధారణంగా ఏ హీరోయిన్ అయినా వరుస హిట్లు వస్తే తమ రెమ్యూనరేషన్‌ను భారీగా పెంచేస్తుంటారు. కానీ మృణాల్ మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరించింది.

'డెకాయిట్' సినిమా కథ తనకి బాగా నచ్చడంతో, తన మార్కెట్ రేటు కంటే తక్కువ పారితోషికానికే ఈ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ఈ సినిమా కోసం ఆమె ఏకంగా 149 రోజుల భారీ కాల్ షీట్స్ ఇచ్చింది. కేవలం డబ్బు కోసమే కాకుండా, ఒక మంచి పాత్రలో నటించాలనే పనతో ఆమె ఈ నిర్ణయం తీసుకుందట.

ఈ సినిమాలో మృణాల్ 'సరస్వతి' అనే పవర్‌ఫుల్ పాత్రలో నటించింది. కేవలం గ్లామర్‌కే పరిమితం కాకుండా, రిస్కీ స్టంట్స్ కూడా స్వయంగా చేసింది

ముఖ్యంగా హ్యాండ్ బ్రేక్ లేని అంబులెన్స్‌ను హై స్పీడ్‌లో నడిపే ఛేజింగ్ సీన్స్‌లో ఆమె చూపిన ధైర్యం అందరినీ మెప్పించింది. ఈ క్రమంలో జరిగిన షూటింగ్ అనుభవాలను పంచుకుంది. 

ఒక సీన్‌లో బురదలో పడాల్సి ఉండగా, ఆమె ముఖం పాడవకుండా ఉండటం కోసం మేకర్స్ బురదకు బదులుగా 'చాక్లెట్' వాడారని ఆమె గుర్తుచేసుకుంది.