Dhurandhar The Revenge: మూవీ లవర్స్‌కు బ్యాడ్ న్యూస్.. ధురంధర్ 2 తెలుగు షోలన్నీ రద్దు.. కారణమిదే
రణ్ వీర్ సింగ్ హీరోగా నటించిన ధురంధర్ ది రివేంజ్ కు బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది. మొదటి పార్ట్ రెండో భాగం చాలా ఎంగేజింగ్ గా ఉందని రివ్యూలు వచ్చాయి. అయితే తెలుగులో ఈ సినిమా చూడాలనుకున్న వారికి మరోసారి నిరాశే ఎదురైంది.

తెలుగు ఆడియెన్స్ కు బ్యాడ్ న్యూస్. గతంలో లాగే ‘ధురంధర్ 2’ మేకర్స్ హ్యాండ్ ఇచ్చేశారు. ఉగాది కానుకగా ధురంధర్ ది రివేంజ్ సినిమా ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది. కానీ తెలుగులో ఈ మూవీని చూడాలనుకున్నవారికి చిత్ర బృందం షాక్ ఇచ్చింది. ఇవాళ (మార్చి 19) పడాల్సిన ధురంధర్ ది రివేంజ్ తెలుగు వెర్షన్ షోలన్నీ రద్దయ్యాయి. ఈ మేరకు టికెట్స్ బుక్ చేసుకున్న వాళ్లందరికీ మెసేజులు వెళ్తున్నాయి. త్వరలోనే టికెట్ డబ్బులని తిరిగి ఇచ్చేస్తామని అందులో పేర్కొన్నారు. మరి ధురందర్ 2 తెలుగు వెర్షన్ రిలీజ్ జాప్యానికి కారణమేంటి? అసలు తెరవెనక ఏం జరుగుతోందో తెలియ రావడం లేదు. గతేడాది డిసెంబర్లలో రిలీజైన ధురంధర్ సినిమా ఏకంగా రూ.1300 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. మొదట ఈ సినిమా తెలుగు వెర్షన్ ను కూడా థియేట్లలో రిలీజ్ చేస్తారని ప్రచారం జరిగింది. కానీ అదేమీ జరగ లేదు. కేవలం ఓటీటీలో మాత్రమే ధురంధర్ తెలుగు వెర్షన్ స్ట్రీమింగ్ కు వచ్చింది. అయితే ధురంధర్ 2 మాత్రం తెలుగు వెర్షన్ కూడా రిలీజవుతుందని మేకర్స్ ప్రకటించారు. హిందీతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లోనూ ధురంధర్ ది రివేంజ్ రిలీజ్ ఉంటుందని మాటిచ్చారు. ఈ మేరకు తెలుగులోనూ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. కానీ ఇప్పుడది తప్పారు.
మొదట బుధవారం (18వ తేదీన) సాయంత్రం 5 గంటల నుంచి ధురంధర్ రివేంజ్ తెలుగు షోలు ఉంటాయని చెప్పినప్పటికీ వాటిని రద్దు చేశారు. ఈ క్రమంలోనే దర్శకుడు ఆదిత్య ధర్.. రాత్రి 9 గంటల కు ఒక పోస్ట్ పెట్టాడు. ధురంధర్ 2 తెలుగు షోస్ కూడా రాత్రి 9 నుంచి అందుబాటులో ఉంటాయని అందులో పేర్కొన్నాడు. కానీ అదేమీ జరగలేదు. ఇక గురువారం (మార్చి 19) కూడా హైదరాబాద్‌లో ధురంధర్ 2 తెలుగు వెర్షన్ షోలు రద్దయ్యాయి. డబ్బింగ్ ఇంకా పూర్తిగా జరగకపోవడం, చివరి నిమిషంలో హడావుడి లాంటివి ప్రధాన సమస్యలుగా తెలుస్తోంది. ప్రస్తుతానికి బుక్ మై షోలో 20వ తేదీకి ధురంధర్ 2 తెలుగు షోలు ఉన్నాయి. అయితే అవి అయినా వేస్తారా లేదా అన్నది క్లారిటీ రావాల్సి ఉంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




