AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: కలలో వెంటాడే వ్యక్తి ఇంటికి వస్తే.. ఓటీటీలో ‘దృశ్యం’ దర్శకుడి మరో ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్

ఇండియాలో వచ్చిన ది బెస్ట్ సస్పెన్స్ థ్రిల్లర్లలో దృశ్యం సినిమాలకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఇప్పుడు ఆ సినిమాకు ఏ మాత్రం తక్కువ కాకుండా ఓ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఓటీటీని షేక్ చేస్తోంది. ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే..ఈ సిరీస్ కు దృశ్యం డైరెక్టర్ జీతు జోసెఫ్ షో రన్నర్ గా వ్యవహరించాడు.

OTT Movie: కలలో వెంటాడే వ్యక్తి ఇంటికి వస్తే.. ఓటీటీలో 'దృశ్యం' దర్శకుడి మరో ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్
OTT Movie
Basha Shek
|

Updated on: Mar 19, 2026 | 12:10 PM

Share

దృశ్యం సినిమాలకు పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు ఉంది. రిలీజైన అన్ని భాషల్లోనూ ఈ సినిమాలు బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. తెలుగు, హిందీ, కన్నడం, మలయాళం తదితర భాషల్లో దృశ్యం సినిమాలు మంచి కలెక్షన్లు సాధించాయి. ఈ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ సినిమాలకు ఆద్యుడు ఎవరంటే మలయాళం డైరెక్టర్ జీతూ జోసెఫ్ అని చెప్పవచ్చు. ఇప్పుడీ ట్యాలెంటెడ్ డైరెక్టర్ నుంచి మరో ఇంట్రెస్టింగ్ అండ్ థ్రిల్లింగ్ వెబ్ సిరీస్ వచ్చింది. గత నెలలో ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చిన ఈ వెబ్ సిరీస్ ఇప్పటికీ ఓటీటీలో టాప్ ట్రెండింగ్ లో కొనసాగుతోంది . తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ, బెంగాళీ, మరాఠీ భాషల్లో ఈ సిరీస్ అందుబాటులో ఉంది. ‘కలలో కనిపించేవన్నీ నిజమైతే’ అనే చిన్న పాయింట్ తో ఎంతో ఎంగేజింగ్ ఈ వెబ్ సిరీస్ ను తెరకెక్కించారు. ఓ 17 ఏళ్ల అమ్మాయి చుట్టూ ఈ కథ సాగుతుంది. తన కలలో వచ్చే ఓ ఆగంతక వ్యక్తి తనను రియల్‌గానే వెంబడిస్తున్నట్లు ఆమె ఫీల్ అవుతుంటుంది. అంతేకాదు ఆ వ్యక్తి తనను వెంటాడుతున్నట్లు, చంపాలని చూస్తున్నట్లు తరచూ కలలు వస్తుంటాయి. ఓ రోజు అనుకోకుండా తన కలలో కనిపించే పచ్చ కళ్లున్న వ్యక్తి తన ఇంటికే అతిథిగా వస్తాడు. దీంతో అమ్మాయి కంగారు పడుతుంది. తీవ్ర భయాందోళనకు గురవుతుంది. తల్లిదండ్రులు ఆమెను ఓ సైకియాట్రిస్ట్ వద్దకు తీసుకెళతారు.

మరి కలలో కనిపించిన వ్యక్తి ఇంటికి వచ్చాక ఆ అమ్మాయి జీవితం ఏమైంది? అసలు ఆమె చదువుతున్న ఒక బుక్ కారణంగానే ఇదంతా జరుగుతుందా? అసలు ఆ అమ్మాయి ఎవరు? ఇంటికి వచ్చిన అతిథి ఎవరు? అన్నది తెలుసుకోవాలంటే ఈ సస్పెన్స్ థ్రిల్లర్ సిరీస్ చూడాల్సిందే. డైరెక్టర్ సుమేష్ నందకుమార్ తెరకెక్కించిన ఈ సిరీస్ పేరు రోస్లిన్. దృశ్యం డైరెక్టర్ జీతూ జోసెఫ్ తెరకెక్కించిన ఈ సిరీస్ లో సీనియర్ నటీమణులు వినీత్ , మీనా భార్యాభర్తలుగా నటించారు. ప్రస్తుతం ఈ సిరీస్ జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఊహించని సన్నివేశాలు,ఉహందని ట్విస్టులతో సాగే ఈ రోస్లిన్ వెబ్ సిరీస్ థ్రిల్లర్ జోనర్ ఇష్టపడేవాళ్ళకి మంచి ఛాయిస్ అని చెప్పవచ్చు.

ఇవి కూడా చదవండి

తెలుగులోనూ స్ట్రీమింగ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఒక్క సినిమాలోనే 30 లిప్ లాక్స్ సీన్స్.. ఇప్పుడు కనిపించకుండా..
ఒక్క సినిమాలోనే 30 లిప్ లాక్స్ సీన్స్.. ఇప్పుడు కనిపించకుండా..
మండే వేసవిలో కూల్ ట్రిప్.. హైదరాబాద్ నుంచి కశ్మీర్‌కు IRCTC సూపర్
మండే వేసవిలో కూల్ ట్రిప్.. హైదరాబాద్ నుంచి కశ్మీర్‌కు IRCTC సూపర్
శరీరాన్ని చిటికెలో చల్ల బరిచే ఈ ఐరన్ గారెలు ప్రతి ఒక్కరు తినాలి..
శరీరాన్ని చిటికెలో చల్ల బరిచే ఈ ఐరన్ గారెలు ప్రతి ఒక్కరు తినాలి..
హెడ్‎ను క్లీన్ బౌల్డ్ చేసిన రసిఖ్.. కోహ్లీ అగ్రెసివ్ సెలబ్రేషన్స్
హెడ్‎ను క్లీన్ బౌల్డ్ చేసిన రసిఖ్.. కోహ్లీ అగ్రెసివ్ సెలబ్రేషన్స్
ఎమర్జెన్సీ ఫండ్‌ ఎలా క్రియేట్‌ చేసుకోవాలి?
ఎమర్జెన్సీ ఫండ్‌ ఎలా క్రియేట్‌ చేసుకోవాలి?
సీఎం విజయ్ రియల్ క్యారెక్టర్‌ను బయటపెట్టిన హెయిర్ స్టైలిస్ట్!
సీఎం విజయ్ రియల్ క్యారెక్టర్‌ను బయటపెట్టిన హెయిర్ స్టైలిస్ట్!
అతిపెద్ద డిజాస్టర్.. అయినా ఓటీటీలో తెగ చూస్తున్న జనాలు..
అతిపెద్ద డిజాస్టర్.. అయినా ఓటీటీలో తెగ చూస్తున్న జనాలు..
రోజూ తాగే స్వీట్ డ్రింక్స్ ప్రాణాంతకం..? ఏటా 3.4 లక్షల మరణాలు!
రోజూ తాగే స్వీట్ డ్రింక్స్ ప్రాణాంతకం..? ఏటా 3.4 లక్షల మరణాలు!
ఎస్‌బీఐ శాఖలు మూతపడనున్నాయా..? బ్యాంకు ఏం చెప్పిందంటే..
ఎస్‌బీఐ శాఖలు మూతపడనున్నాయా..? బ్యాంకు ఏం చెప్పిందంటే..
వార్నీ.. పురుగులను బిర్యానీలా తినే వింత మొక్క..
వార్నీ.. పురుగులను బిర్యానీలా తినే వింత మొక్క..