AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chiranjeevi: మగధీర మూవీలో చిరంజీవికి డూప్‌గా నటించింది ఎవరో తెల్సా..! ప్రభాస్‌కు బాగా క్లోజ్

ప్రభాస్ శ్రీను తన సినీ ప్రస్థానంలో చిరంజీవి, ప్రభాస్, బ్రహ్మానందం లాంటి ప్రముఖులతో అనుబంధాన్ని వివరించారు. చిరంజీవికి మగధీర చిత్రంలో డూప్‌గా నటించిన అనుభవాన్ని పంచుకున్నారు. ఆయనను అందరూ డార్లింగ్ అని పిలవడం తన అదృష్టమన్నారు. బ్రహ్మానందాన్ని జ్ఞానసాగరంగా అభివర్ణించి, ఆయన నుంచి ఎన్నో నేర్చుకున్నానని తెలిపారు.

Chiranjeevi: మగధీర మూవీలో చిరంజీవికి డూప్‌గా నటించింది ఎవరో తెల్సా..! ప్రభాస్‌కు బాగా క్లోజ్
Chiranjeevi
Ravi Kiran
|

Updated on: Mar 19, 2026 | 11:42 AM

Share

టాలీవుడ్ నటుడు ప్రభాస్ శ్రీను ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్‌లో ఎదురైన ఆసక్తికరమైన అనుభవాలను పంచుకున్నారు. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి, ప్రభాస్, బ్రహ్మానందం లాంటి దిగ్గజాలతో తన అనుబంధాన్ని వివరించారు. మగధీర చిత్ర నిర్మాణ సమయంలో చిరంజీవికి డూప్‌గా నటించడం తన అదృష్టమని ప్రభాస్ శ్రీను గుర్తుచేసుకున్నారు. ఒకరోజు రాజమౌళి బృందం నుంచి అర్జెంట్ కాల్ వచ్చిందని, ప్రభాస్ ఇంట్లో వాలీబాల్ ఆడుతున్న సమయంలో తెల్లవారుజామున 3 గంటలకు షూటింగ్‌కు రమ్మని పిలిచారని తెలిపారు. అల్యూమినియం ఫ్యాక్టరీలో చిరంజీవి డూప్ షాట్స్ కోసం వెళ్లగా, చిరంజీవి డ్రెస్ ధరించి డూప్ షాట్స్ చేశానని వివరించారు. చిరంజీవి సెట్‌లోకి రాగానే తాను వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోయేవాడినని, అదే డ్రెస్ వేసుకుని ఆయన వెనుక కనిపించేవాడినని చెప్పారు.

ప్రభాస్, చిరంజీవితో పాటు అనేక మంది ఇతర హీరోలతోనూ పనిచేసే అవకాశం లభించడం తన అదృష్టమన్నారు. ఏ హీరో కూడా తనను ప్రభాస్ శ్రీను అని చూడరని, అందరూ తనను డార్లింగ్ అని ప్రేమగా పిలుస్తారని పేర్కొన్నారు. తాను కలిసి పనిచేసిన హీరోలలో ఎవరికీ అహంభావం లేదని, వారు సరదాగా అందరితో కలిసిపోయి మాట్లాడతారని వెల్లడించారు. ఎవరైనా ప్రతికూలంగా మాట్లాడినప్పుడు, చిరంజీవి ఒకరి గురించి చెడుగా మాట్లాడొద్దు. తాను సరదాగా అన్నప్పటికీ, చిరంజీవి అలాంటి మాటలను ఒప్పుకునేవారు కాదన్నారు. ఇది భగవంతుడు తనకు ఇచ్చిన అదృష్టమని ప్రభాస్ శ్రీను అభిప్రాయపడ్డారు.

హాస్యనటుడు బ్రహ్మానందంతో పనిచేసిన అనుభవం గురించి మాట్లాడుతూ, ఆయనను కేవలం ఒక ఆర్టిస్ట్‌గా మాత్రమే కాకుండా, ఒక గైడ్, ఒక పుస్తకం, ఒక లైబ్రరీ, ఒక మహాసముద్రంతో పోల్చారు. బ్రహ్మానందం నుంచి నేర్చుకోవలసినవి ఎన్నో ఉన్నాయని, ముఖ్యంగా ఆయన ప్రవర్తన, జ్ఞానం అపారమని కొనియాడారు. బ్రహ్మానందంతో 24 గంటలు ప్రయాణం చేసినా సరిపోదని, మరో రెండు గంటలు రోజులో ఉంటే బాగుండునని అనిపించిందని అన్నారు.

Follow Us