Gold Rates: బంగారం ధరలపై బాంబ్ పేల్చే వార్త.. త్వరలో రూ.11 లక్షలకు ఛాన్స్..! సంచలన పరిణామాలు
బంగారం ధరలపై బాంబ్ పేల్చే వార్త బయటకు వచ్చింది. రానున్న కొన్నేళ్లల్లో బంగారం ధరలు రికార్డ్ స్థాయిలో పెరగొచ్చని రాబర్ట్ కియోసారి సంచలన జోస్యం చెప్పారు. బంగారం, వెండి ధరలపై ఆయన చెప్పే అంచనాలు నిజమవుతున్నాయి. దీంతో ఆయనను చాలామంది ఫాలో అవుతున్నారు.

గత నెలలో బంగారం ధరలు భారీగా పెరగ్గా.. ప్రస్తుతం తగ్గుముఖం పడుతున్నాయి. గత కొద్ది రోజులుగా గోల్డ్, సిల్వర్ రేట్లు పతనమవుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో బంగారం, వెండి ధరలపై ఎప్పుడూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తే రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తక రచయిత, ప్రముఖ పెట్టుబడిదారుడు రాబర్ట్ కియోసాకి సంచలన వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియాలో స్టాక్ మార్కెట్లు, పసిడి, క్రిప్టో కరెన్సీపై ఆయన ఎప్పటికప్పుడు తన అంచనాలను చెబుతూ ఉంటారు. అందులో భాగంగా తాజాగా ఆయన బంగారం ధరలపై మరోసారి బాంబ్ పేల్చారు. అంతర్జాతీయ స్థాయిలో ఉద్రిక్తతల క్రమంలో ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి.
త్వరలో భారీ కుదుపు
ప్రపంచ ఆర్ధిక వ్యవస్థలో త్వరలో భారీ కుదుపు రాబోతుందని, చరిత్ర ఎన్నడూ లేనంతగా ఇది వస్తుందని రాబర్ట్ కియోసాకి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సంక్షోభంతో బంగారం, వెండి, బిట్ కాయిన్ ధరలు రికార్డు స్థాయిలో పెరుగుతాయని అంచనా వేశారు. గ్రాము బంగారం ఏకంగా రూ.లక్ష దాటుతుందని, గ్రాము వెండి రూ.540కి చేరుకుంటుదని వ్యాఖ్యానించారు. ఇక బిట్ కాయిన్ 7,50,000 డాలర్లకు చేరుకునే అవకాశముందని అంచనా వేశారు. ఇక ఎథీరియం 95 వేల డాలర్లకు పెరుగుతుందని ఎక్స్‌లో పేర్కొన్నారు. తెలివిన ఇన్వెస్టర్లు లాభపడతారంటూ ఆయన పేర్కొన్నారు. త్వరలో అతిపెద్ద ఆర్ధిక సంక్షోభం ప్రపంచవ్యాప్తంగా రానుందని, బుడగ పేలడం ఖాయమని తెలిపారు. కానీ ఎప్పుడు పేలుతుంది అనేది ఖచ్చితంగా చెప్పలేమని వ్యాఖ్యానించారు.
ప్రత్యామ్నాయ మార్గాల వైపు చూపు
ప్రభుత్వాలు కరెన్సీని ఎక్కువగా ముద్రించడం వల్ల సంప్రదాయ ఆర్ధిక వ్యవస్థ కుప్పకూలే ప్రమాదముందని రాబర్ట్ కియోసాకి స్పష్టం చేశారు. ఆర్ధిక సంక్షోభం తర్వాత పసిడి ఔన్స్‌కు 35 వేల డాలర్లకు చేరుకుంటుందన్నారు. ఇక సిల్వర్ ఔన్సుకు 200 డాలర్లకు ఎగబాకుతుందని అంచనాలు వేశారు. బిట్ కాయిన్, ఎథీరియంలు కూడా రికార్డు సృష్టిస్తాయని తెలిపారు. సంపదను కాపాడుకోవడానికి పెట్టుబడిదారులు ప్రత్యామ్నాయ మార్గాల వైపు చూస్తున్నారని, అందుకే వాటి ధరలు పెరుగుతాయని వ్యాఖ్యానించారు. తులం బంగారం రూ.11 లక్షలు, కేజీ వెండి రూ.64 లక్షలకు చేరుకునే అవకాశముందని బాంబ్ పేల్చారు.
BIGGEST BUBBLE BUST
I do not know what pin, what event will pop the biggest bubbles in histor. What ever the event, the pin is near.
It’s not IF. It’s WHEN.
When the bubbles go bust I predict gold will hit $35,000 an ounce one year after the gold bubble goes pop..
I predict…
— Robert Kiyosaki (@theRealKiyosaki) March 16, 2026
