AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ustaad Bhagat Singh Movie Review: ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ రివ్యూ.. గబ్బర్ సింగ్ మ్యాజిక్ రిపీట్ అయిందా..?

'గబ్బర్ సింగ్' లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్లో వచ్చిన సినిమా కావడంతో 'ఉస్తాద్ భగత్ సింగ్' పై అంచనాలు ఆకాశాన్ని అంటాయి. పక్కా మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఉగాది కానుకగా థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో రివ్యూలో చూద్దాం.

Ustaad Bhagat Singh Movie Review: ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ రివ్యూ.. గబ్బర్ సింగ్ మ్యాజిక్ రిపీట్ అయిందా..?
Ustaad Bhagat Singh
Lakshminarayana Varanasi
| Edited By: |

Updated on: Mar 19, 2026 | 12:36 PM

Share

మూవీ రివ్యూ: ఉస్తాద్ భగత్ సింగ్

నటీనటులు: పవన్ కళ్యాణ్, శ్రీలీల, రాశీ ఖన్నా, పార్థిబన్, కె.ఎస్. రవికుమార్ తదితరులు

సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ (పాటలు), తమన్ (బీజీఎం)

ఇవి కూడా చదవండి

ఎడిటర్: కార్తీక శ్రీనివాస్

సినిమాటోగ్రఫర్స్: అయాంక బోస్, మనోజ్ పరమహంస

దర్శకుడు: హరీష్ శంకర్

నిర్మాతలు: నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ (మైత్రీ మూవీ మేకర్స్)

కథ:

చదలమర్రి నల్ల నాగప్ప (పార్థిబన్) తెలంగాణ ముఖ్యమంత్రి కావాలని కలలు కంటుంటాడు. కానీ నిజాయితీపరుడైన ప్రస్తుత సీఎం (కె.ఎస్. రవికుమార్) అడ్డుగా ఉన్నాడని ఆయన్ని అంతం చేయడానికి ప్లాన్ వేస్తాడు. ఈ క్రమంలో నాగప్ప కొడుకు నల్లమల అడవుల్లోకి వెళ్లి అనుమానాస్పదంగా అదృశ్యమవుతాడు. ఈ మిస్సింగ్ కేసు విచారణలో దీని వెనుక పోలీస్ ఆఫీసర్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ (పవన్ కళ్యాణ్) ఉన్నాడని తెలుస్తుంది. అసలు ఈ ఉస్తాద్ భగత్ సింగ్ ఎవరు..? సీఎంని కాపాడటానికి, నాగప్ప కొడుకు అదృశ్యానికి అతనికి ఉన్న సంబంధం ఏంటి..? ఈ కథలోకి లీల (శ్రీలీల) ఎందుకొచ్చింది.. మధ్యలో శ్లోక (రాశీ ఖన్నా)తో ఈ కథకు ఉన్న లింక్ ఏంటి అనేది మిగతా కథ.

కథనం:

పవన్ కళ్యాణ్ సినిమా చూడటం ఆయన అభిమానులకు ఓ పండగ. ఆయన స్క్రీన్ మీద కనిపిస్తే చాలు అనుకుంటారు ఫ్యాన్స్. కానీ కామన్ ఆడియన్స్ అంత కనికరంగా ఉండరు కదా.. వాళ్లకు కచ్చితంగా స్టఫ్ ఉన్న సినిమానే కావాలి. OGలో సుజీత్ ఆ మ్యాజిక్ చేసి చూపించాడు.. ప్రతీ సీన్‌లో పవన్ కళ్యాణ్‌ను నెక్ట్స్ లెవల్‌లో ప్రజెంట్ చేసాడు. పవన్ కనిపించడం కాదు.. పేరు వినిపిస్తే ఊగిపోయారు ఫ్యాన్స్ అందులో. ఉస్తాద్ భగత్ సింగ్ కూడా అలాగే డిజైన్ చేయాలని చూసాడు హరీష్ శంకర్.. తన స్టైల్ ఆఫ్ మాస్ సినిమా చేయాలని చూసాడు.. కానీ అది అంతగా వర్కవుట్ అవ్వలేదు. చాలా సీన్స్ జస్ట్ ఫిల్ చేసినట్లు అనిపించాయి కానీ ఎమోషన్ లేదు. ఫస్టాఫ్ అయితే చాలా వరకు ఓల్డ్ వైన్ న్యూ బాటిల్ అన్నట్లు రాసేసాడు హరీష్ శంకర్. లిట్రల్‌గా చెప్పాలంటే పవన్ రేంజ్‌కు తగ్గట్లు ఒక్క సీన్ కూడా పడలేదు.. టైమ్ ఇచ్చాడు కదా ఏదో ఒకటి తీసేద్దాం అన్నట్లుగానే అనిపించింది. కొన్ని సీన్స్‌లో పవన్ చెప్పిన డైలాగులు పొలిటికల్‌గానూ బాగానే పేలాయి. ఆయన రాజకీయాల్లో ఉన్నాడు కాబట్టి ఆయన మామూలుగా చెప్పినా తగలాల్సిన వాళ్లకు తగులుతాయి. గబ్బర్ సింగ్‌లో పవన్‌లోని అణువణువు వాడేసిన హరీష్ శంకర్.. ఎందుకో మరి ఈసారి కాస్త కన్ఫ్యూజ్ అయినట్లు అనిపించింది.

బహుశా హరీష్ శంకర్ జోరుకు పవన్ పదవి, ఆయన బాధ్యతలు అడ్డొచ్చాయని అర్థమవుతుంది. ఫ్రీ హ్యాండ్ తీసుకోలేదో లేదంటే తీసుకోడానికి సంకోచించాడో అర్థం కాలేదు. ఫస్టాఫ్‌తో పోలిస్తే సెకండాఫ్ బెటర్.. కొన్ని సీన్స్ మెప్పించాయి. ముఖ్యంగా తొలిప్రేమ రిఫరెన్స్ అదిరిపోయింది.. ఆ సీక్వెన్స్ అంతా ఫుల్‌గా ఎంజాయ్ చేస్తారు. క్లైమాక్స్ కూడా వీక్‌గానే రాసుకున్నాడు హరీష్ శంకర్. సెకండాఫ్‌లో శ్రీలీల, పవన మధ్య వచ్చే సీన్స్ బాగున్నాయి.. ముఖ్యంగా అక్కడక్కడా వింటేజ్ పవర్ స్టార్ అలా వచ్చి వెళ్లిపోయాడు. ఫ్యాన్స్ కోసమైతే బాగానే స్టఫ్ ఇచ్చాడు హరీష్.. కానీ మామూలు ప్రేక్షకులకు ఇది సరిపోతుందా అంటే మాత్రం కష్టమే. రొటీన్ అండ్ ఔట్ డేటెడ్ స్టోరీ ట్రీట్‌మెంట్.. బలహీనమైన విలన్ ట్రాక్… వర్కౌట్ కాని హరీష్ శంకర్ మార్క్ కామెడీ ఈ సినిమాకు మైనస్ అయితే.. పవన్ కళ్యాణ్ స్టామినా మేజర్ ప్లస్ పాయింట్. ఆయన ఛరిష్మానే ఉగాది హాలీడేస్‌లో సినిమాను కాపాడాలి. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కేవలం పవర్ స్టార్ కల్ట్ ఫ్యాన్స్‌కి మాత్రమే నచ్చే సినిమా. సాధారణ ప్రేక్షకులకు మాత్రం ఇదొక రొటీన్ కమర్షియల్ ఎంటర్టైనర్‌లా అనిపిస్తుంది. లాజిక్స్ పక్కనపెట్టి కేవలం పవన్ కళ్యాణ్ స్వాగ్, యాక్షన్ ఎపిసోడ్స్ ఎంజాయ్ చేయాలనుకుంటే ఓసారి థియేటర్‌కి వెళ్లొచ్చు..!

నటీనటులు:

పవన్ కళ్యాణ్ స్క్రీన్ మీద చాలా ఎనర్జిటిక్‌గా కనిపించాడు.. కొన్ని సీన్స్‌లో.. మరీ ముఖ్యంగా సెకండాఫ్‌లో స్టైలింగ్ అదిరిపోయింది. తన వింటేజ్ స్వాగ్ అండ్ ఎనర్జీతో స్క్రీన్ మీద చెలరేగిపోయాడు. యాక్షన్ సీన్స్, డైలాగ్ డెలివరీ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పిస్తాయి. ముఖ్యంగా పోలీస్ స్టేషన్ సీన్, ఇంటర్వెల్ బ్యాంగ్‌లో పవన్ యాటిట్యూడ్ హైలైట్. శ్రీలీల, రాశీ ఖన్నా గ్లామర్ పరంగా ఓకే కానీ.. వాళ్ళ పాత్రలకు కథలో పెద్దగా స్కోప్ లేదు. విలన్‌గా పార్థిబన్ నటన బాగున్నప్పటికీ, హీరో ఎలివేషన్స్ ముందు ఆ క్యారెక్టర్ కాస్త వీక్‌గా అనిపిస్తుంది. కేఎస్ రవికుమార్ నటన కూడా పర్లేదు. మిగిలిన వాళ్లంతా ఓకే..

టెక్నికల్ టీం:

దేవీ శ్రీ ప్రసాద్ పాటలు ఓకే.. తమన్ బ్యాగ్రౌండ్ చాలా లౌడ్‌గా ఉంది. కెమెరా వర్క్ రిచ్‌గా ఉంది. ఎడిటింగ్ వీక్.. ఫస్టాఫ్ కొన్ని సీన్స్ కోత వేసినా పెద్దగా నష్టం ఉండదేమో..? దర్శకుడు హరీష్ శంకర్ రైటింగ్‌లో మునుపటి మ్యాజిక్ కాస్త మిస్ అయ్యింది. కొన్ని ఎలివేషన్ సీన్స్, మాస్ డైలాగ్స్ బాగా రాసుకున్నాడు. ఓవరాల్ స్టోరీ నెరేషన్ ఔట్ డేటెడ్‌గా అనిపిస్తుంది. మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడక్షన్ వాల్యూస్ ఎప్పట్లాగే టాప్ క్లాస్‌లో ఉన్నాయి.

పంచ్ లైన్:

ఓవరాల్‌గా ఉస్తాద్ భగత్ సింగ్.. ఫ్యాన్స్‌కి పండగ… మిగతా వాళ్లకి రొటీన్ ఎంటర్‌టైనర్..!

Follow Us