AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Santhanam: ‘శ్రీనివాస గోవింద’ పాట పేరడీ.. వివాదంపై స్పందించిన హీరో సంతానం.. వీడియో

కోలీవుడ్ స్టార్ కమెడియన్ కమ్ హీరో సంతానం ఇప్పుడు అనవసరంగా ఓ వివాదంలో చిక్కుకున్నాడు. ఇందులో అతను తప్పేమీ లేకపోయినా ప్రస్తుతం అందరీ వేళ్లు హీరో సంతానం వైపే చూపిస్తున్నాయి. తాజాగా తన సినిమా విషయంలో తలెత్తిన వివాదంపై హీరోనే స్వయంగా స్పందించాడు.

Santhanam: 'శ్రీనివాస గోవింద'  పాట పేరడీ.. వివాదంపై స్పందించిన హీరో సంతానం.. వీడియో
Santhanam
Basha Shek
|

Updated on: May 13, 2025 | 4:36 PM

Share

హీరో సంతానం నటించిన తాజా చిత్రం ‘డీడీ నెక్స్ట్ లెవల్’. గతంలో వచ్చిన డీడీ, డీడీ రిటర్న్స్ సినిమాలకు కొనసాగింపుగా ఈ మూవీ తెరకెక్కినట్లు తెలుస్తోంది. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈ శుక్రవారం (మే 16)న తమిళ్ తో పాటు తెలుగు భాషల్లో ఒకేసారి రిలీజ్ కానుంది. తాజాగా సినిమా ప్రమోషన్లలో భాగంగా ఒక పాటను రిలీజ్ చేశారు మేకర్స్. అయితే ఇందులో శ్రీనివాస గోవింద పాటని పేరడీ చేయడం వివాదానికి దారి తీసింది. దీనిపై హిందు సంఘాలు భగ్గుమంటున్నాయి. ముఖ్యంగా ఈ పాటని వెంటనే తొలగించాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే ‘డీడీ నెక్స్ట్ లెవల్’ సినిమా పాటపై పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. ఇప్పుడీ వివాదంపై హీరో సంతానం స్పందించాడు. తాజాగా జరిగిన ప్రెస్ మీట్ లో అతను మాట్లాడుతూ.. ‘తిరుమల శ్రీవారిని మేం అవమానించలేదు. సెన్సార్ బోర్డ్ నిబంధనల మేరకు సినిమా తీశాం. రోడ్డు మీద పోయే ప్రతి ఒక్కరూ ఏదో ఒకటి మాట్లాడుతారు. అందరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు’ అని చెప్పుకొచ్చాడు.

ఇవి కూడా చదవండి

కాగా తిరుమల శ్రీవారికి సంబంధించిన శ్రీనివాస గోవింద అంటూ సాగే పాట తెలియని వారుండరు. అయితే ఈ గీతాన్ని ‘డీడీ నెక్స్ట్ లెవల్’ సినిమా కోసం పేరడీ చేశారు. పార్కింగ్ డబ్బులు గోవిందా.. పాప్ కార్న్ ట్యాక్స్ గోవిందా అంటూ సినిమా పదాలతో పేరడీ చేశారు. ఇప్పుడు దీనిపైనే హిందూ భక్తులు మండిపడుతున్నారు. పాటని వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తున్నాయి. మరి ఈ వివాదం ఎంతదాకా వెళుతుందో చూడాలి.

సంతానం రియాక్షన్..

ఇక డీడీ నెక్ట్స్ లెవల్ సినిమా విషయానికి వస్తే..ప్రేమ్ ఆనంద్ తెరకెక్కించిన ఈ మూవీలో సంతానం రివ్యూయర్ గా నటిస్తున్నాడు. గీతికా తివారీ హీరోయిన్ గా నటిస్తోంది. గౌతమ్ వాసుదేవ్ మేనన్, సెల్వ రాఘవన్, నిళళ్ గల్ రవి, కస్తూరి శంకర్, రెడిన్ కింగ్ స్లే, యషికా ఆనంద్, రాజేంద్రన్ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

కాంట్రవర్సీకి కారణమైన సాంగ్ ఇదే..

మరిన్ని సినిమా కథనాల కోసం క్లిక్‌ చేయండి.  

Follow Us
2027 వన్డే ప్రపంచకప్ నుంచి మాజీ ఛాంపియన్ టీం ఔట్.. అలా జరిగితేనే
2027 వన్డే ప్రపంచకప్ నుంచి మాజీ ఛాంపియన్ టీం ఔట్.. అలా జరిగితేనే
డుకాటి నుంచి అదిరిపోయే ఫీచర్లతో స్టన్నింగ్ బైక్
డుకాటి నుంచి అదిరిపోయే ఫీచర్లతో స్టన్నింగ్ బైక్
1917లో బ్రిటీష్ ప్రభుత్వానికి రూ.35 వేల అప్పు ఇచ్చిన భారతీయుడు!
1917లో బ్రిటీష్ ప్రభుత్వానికి రూ.35 వేల అప్పు ఇచ్చిన భారతీయుడు!
విజయ్ రాజకీయాల్లో సక్సెస్ కావడానికి కారణం అదే..
విజయ్ రాజకీయాల్లో సక్సెస్ కావడానికి కారణం అదే..
రైల్‌ కోచ్‌ ఫ్యాక్టరీలో 734 ఉద్యోగాలు.. రాతపరీక్ష, ఇంటర్వ్యూ లేదు
రైల్‌ కోచ్‌ ఫ్యాక్టరీలో 734 ఉద్యోగాలు.. రాతపరీక్ష, ఇంటర్వ్యూ లేదు
త్వరలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు.. కేంద్రం క్లారిటీ!
త్వరలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు.. కేంద్రం క్లారిటీ!
క్రీడాకారులకు ఆర్థరైటిస్ షాక్.. సైనా నెహ్వాల్ చెప్పిన నిజాలు ఇవే
క్రీడాకారులకు ఆర్థరైటిస్ షాక్.. సైనా నెహ్వాల్ చెప్పిన నిజాలు ఇవే
ఆషాఢ అమావాస్య రోజున ఇంట్లో చేయాల్సిన పనులు.. వీటిని తప్పక..
ఆషాఢ అమావాస్య రోజున ఇంట్లో చేయాల్సిన పనులు.. వీటిని తప్పక..
ఏపీలో వారికి కూడా రూ.25 వేలు.. ప్రభుత్వం నుంచి అప్డేట్
ఏపీలో వారికి కూడా రూ.25 వేలు.. ప్రభుత్వం నుంచి అప్డేట్
కియారాకు ఎన్ని కోట్ల పారితోషికమంటే.. టాక్సిక్ బడ్జెట్ ఎంతంటే..
కియారాకు ఎన్ని కోట్ల పారితోషికమంటే.. టాక్సిక్ బడ్జెట్ ఎంతంటే..