AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

USB Scam: రైల్వే స్టేషన్, బస్టాండ్లలో మీ ఫోన్‌కు ఛార్జింగ్ పెడుతున్నారా..? మీరు డేంజర్‌లో పడ్డట్లే..

రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, ఎయిర్‌పోర్టులు వంటి పబ్లిక్ ప్రదేశాల్లో ఫోన్‌కు ఛార్జింగ్ పెట్టుకుంటున్నారా.. అయితే మీరు జాగ్రత్తగా ఉండాల్సిందే. లేకపోతే మీ ఫోన్‌లోని సమాచారం మొత్తం హ్యాకర్ల బారిన పడే అవకాశముంది. మాల్ వేర్ల ద్వారా సైబర్ నేరగాళ్లు ఫోన్లలోకి ప్రవేశిస్తున్నారు.

USB Scam: రైల్వే స్టేషన్, బస్టాండ్లలో మీ ఫోన్‌కు ఛార్జింగ్ పెడుతున్నారా..? మీరు డేంజర్‌లో పడ్డట్లే..
Charging
Venkatrao Lella
|

Updated on: Mar 19, 2026 | 12:40 PM

Share

రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు విమానాశ్రయాల్లో చాలామంది తమ ఫోన్లకు ఛార్జింగ్ పెట్టుకుంటూ ఉంటారు. అయితే ఇలా ఛార్జ్ చేసుకోవడం అనేది చాలా ప్రమాదంతో కూడుకున్నది. పబ్లిక్ ప్రదేశాల్లో ఫోన్ ఛార్జింగ్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే మీ వ్యక్తిగత సమాచారం లీకై ప్రమాదంలోకి పడే అవకాశముంది. చిన్నపాటి అజాగ్రత్తతో మీరు ఉన్న మీ సమాచారం మొత్తం సైబర్ నేరగాళ్లు ఉచ్చులోకి వెళుతుంది. ఇటీవల జ్యూస్ జాకింగ్ అనే సైబర్ మోసాలు పెరిగిపోతున్నాయి. పబ్లిక్ యూఎస్‌బీ ఛార్జింగ్ పోర్ట్‌ల ద్వారా సైబర్ క్రిమినల్స్ మీ ఫోన్‌లోని డేటాను చోరీ చేయడం లేదా మాల్‌వేర్లను ఇన్‌స్టాల్ చేయడం లాంటివి చేస్తు్న్నారు. అసలు ఈ మోసం ఎలా చేస్తారు..? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అనే విషయాలు చూద్దాం.

జ్యూస్ జాకింగ్ అంటే..?

రైల్వే స్టేషన్లు లేదా ఎయిర్‌పోర్టులు, బస్టాండ్ల లాంటి పబ్లిక్ ప్రదేశాల్లో ఛార్జింగ్ పోర్టుల ద్వారా ఈ మోసానికి పాల్పడతారు. చార్జింగ్ పెట్టుకున్నప్పుడు మీ ఫోన్‌లోకి వివిధ మాల్‌వేర్ల ద్వారా చొరబడతారు. యూఎస్ ఛార్జింగ్ పోర్ట్‌లు కేవలం ఛార్జింగ్ మాత్రమే కాకుండా డేటాను కూడా ట్రాన్స్‌ఫర్ చేస్తాయి. దీంతో హ్యకర్లు యూఎస్‌బీ పోర్ట్‌ల ద్వారా ఫోన్లలోకి చొరబడి సమాచారం మొత్తాన్ని సేకరిస్తున్నారు. ఈ సమాచారంతో డబ్బులు కొల్లగొడుతున్నారు.

నేరానికి ఎలా పాల్పడతారు..?

ముందుగానే హ్యాకర్లు పబ్లిక్ యూఎస్‌బీ పోర్ట్స్ లేదా కేబుళ్లను హ్యాక్ చేస్తారు. ప్రయాణికులు ఛార్జింగ్ పెట్టుకున్నప్పుడు మాల్‌వేర్లను పంపించి ఫోన్‌లోని సమాచారాన్ని తెలుసుకుంటున్నారు. దీని ద్వారా ఫోన్లలోని సమాచారం మొత్తాన్ని కాపీ చేసుకుంటున్నారు. వినియోగదారులకు తెలియకుండానే కేబుల్స్, పోర్ట్‌లలో దాచిన చిప్‌ల ద్వారా సైబర్ దాడులు పాల్పడుతున్నారు.

ఎలాంటి జాగ్రత్తలు అవసరం

మీరు ఈ దాడి బారిన పడకుండా ఉండాలంటే సొంత చార్జర్ లేదా కేబుల్‌ను ఉపయోగించండి. ఇక యూఎస్‌బి పోర్ట్‌కు బదులుగా ఎలక్ట్రికల్ సాకెట్ నుంచి నేరుగా ఛార్జింగ్ పెట్టుకోండి. యూఎస్‌బీ డేటా బ్లాకర్‌ను ఉపయోగించండి. ఫోన్ ఛార్జింగ్ పెట్టినప్పుడు డేటా బదిలీకి అనుమతి ఇవ్వొద్దు. మీ మొబైల్ సాఫ్ట్‌వేర్‌ను అప్డేట్‌గా ఉంచుకోండి. పరిచయం లేని ఛార్జింగ్ కేబుల్స్, పబ్లిక్ పోర్ట్‌లను ఉపయోగించకపోవడమే మంచిది. ఇటీవల జ్యూస్ జాకింగ్ మోసాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇటీవల చాలామంది దీని బారిన పడి డబ్బులు పొగొట్టుకోవడంలో ఈ తరహా మోసం వెలుగులోకి వచ్చింది. దీంతో ఇలాంటి మెసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. ఏదైనా అనుమానాస్పందగా అనిపిస్తే తమకు ఫిర్యాదు చేయాలని కోరుతున్నారు సైబర్ పోలీసులు.

Follow Us
రైల్వే స్టేషన్‌లో ఫోన్ ఛార్జింగ్ పెడుతున్నారా..? ఈ మోసం గురించి..
రైల్వే స్టేషన్‌లో ఫోన్ ఛార్జింగ్ పెడుతున్నారా..? ఈ మోసం గురించి..
మందుల కొరత తప్పదా?LPG సంక్షోభంతో ఆ మెడిసిన్స్‌ దొరుకుడు కష్టమే!
మందుల కొరత తప్పదా?LPG సంక్షోభంతో ఆ మెడిసిన్స్‌ దొరుకుడు కష్టమే!
ఆ ప్లంబర్ సంపాదన.. ఏడాదికి రూ.18 లక్షలు !
ఆ ప్లంబర్ సంపాదన.. ఏడాదికి రూ.18 లక్షలు !
ఎవర్రా మీరంతా.. ఇలా కూడా మోసం చేస్తారా.. ఇది తెలిస్తే..
ఎవర్రా మీరంతా.. ఇలా కూడా మోసం చేస్తారా.. ఇది తెలిస్తే..
ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ రివ్యూ.. పవన్ కల్యాణ్ సినిమా ఎలా ఉందంటే?
ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ రివ్యూ.. పవన్ కల్యాణ్ సినిమా ఎలా ఉందంటే?
అలర్ట్ :కొనసాగుతున్న ద్రోణి..తెలుగు రాష్ట్రాల్లో దంచికొట్టన వానలు
అలర్ట్ :కొనసాగుతున్న ద్రోణి..తెలుగు రాష్ట్రాల్లో దంచికొట్టన వానలు
ధురంధర్ 2 తెలుగు షోలన్నీ రద్దు.. కారణమిదే
ధురంధర్ 2 తెలుగు షోలన్నీ రద్దు.. కారణమిదే
కోట్లు కాదు వందల కోట్లు.. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన జంతువులు ఇవే
కోట్లు కాదు వందల కోట్లు.. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన జంతువులు ఇవే
సెకన్లలోనే రైల్వే టికెట్ పొందొచ్చు.. రైల్వేశాఖ కీలక నిర్ణయం
సెకన్లలోనే రైల్వే టికెట్ పొందొచ్చు.. రైల్వేశాఖ కీలక నిర్ణయం
మల్టీగ్రెయిన్ పిండి అందరికీ మంచిది కాదా? వీళ్లకు విషమే!
మల్టీగ్రెయిన్ పిండి అందరికీ మంచిది కాదా? వీళ్లకు విషమే!