29 April, 2026
Subhash
బంగారం, వెండి ధరలు తగ్గినట్లే తగ్గి మళ్లీ షాకిస్తున్నాయి. ఉన్నట్టుండి ఒక్కసారిగా పెరగడం వినియోగదారులను ఆందోళన కలిగిస్తోంది.
ఏప్రిల్ 29న ఉదయం సమయంలో తులం బంగారంపై ఏకంగా 2700 రూపాయలకుపైగా తగ్గుముఖం పట్టగా, అదే 10 గంటల సమయానికి భారీగా పెరిగింది.
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై ఏకంగా 440 రూపాయలు పెరిగింది. అదే విధంగా 22 క్యారెట్ల 10 గ్రాముల ధరపై 400 రూపాయల వరకు ఎగబాకింది.
పెరిగిన తర్వాత 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,51,370 రూపాయలు ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 1,38,750 రూపాయల వద్ద కొనసాగుతోంది.
దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,51,530 రూపాయలు ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 1,38,900 రూపాయల వద్ద కొనసాగుతోంది.
ఇక వెండి విషయానికొస్తే.. ఇది కాస్త పెరిగింది. కిలోపై వెయ్యి రూపాయల వరకు ఎగబాకింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో కేజీ సిల్వర్ ధర 2,65,000 వద్ద కొనసాగుతోంది.
అమెరికా డాలర్ బలోపేతం కావడం, గ్లోబల్ మార్కెట్‌లో ముడిచమురు ధరల హెచ్చుతగ్గుల వల్ల పసిడి ధరలపై ఒత్తిడి పెరిగింది. పెళ్లిళ్ల సీజన్ సమీపిస్తున్నప్పటికీ ధరల్లో మార్పులు చోటు చేసుకుంటున్నాయి.
పైన పేర్కొన్న ధరలు జిఎస్‌టి (GST), మేకింగ్ ఛార్జీలు (తయారీ ఖర్చులు) కలపకముందు ఉన్న ప్రాథమిక ధరలు. మీ ప్రాంతంలోని జ్యువెలరీ షోరూమ్‌లలో ధరలు స్వల్పంగా మారే అవకాశం ఉంది.