Tollywood: అనాథాశ్రమంలో వదిలేసిన తండ్రి.. మద్యానికి బానిసైన లేడీ సూపర్ స్టార్.. 38 ఏళ్లకే ముగిసిన జీవితం..
భారతీయ సినీ పరిశ్రమలో ఆమె స్టార్ హీరోయిన్. అందం, అంతకు మించిన సహజ నటనతో సినీప్రియులను కట్టిపడేసింది. కానీ నిజ జీవితంలో మాత్రం అనేక కష్టాలు ఎదుర్కొంది. పుట్టిన వెంటనే అనాథాశ్రమంలో వదిలేసిన తండ్రి.. ఆ తర్వాత వైవాహిక జీవితంలో వేధింపులు.. చివరకు అనారోగ్య సమస్యలతో 38 ఏళ్లకే జీవితాన్ని ముగించింది. ఆమె ఎవరో తెలుసా.. ?

సినీరంగంలో అగ్ర కథానాయికగా వరుస సినిమాలతో అలరించింది. అబ్బాయి జన్మిస్తాడని ఎన్నో ఆశలతో ఎదురుచూశాడు ఆమె తండ్రి. కానీ కూతురు పుట్టడంతో వెంటనే ఆమెను అనాథాశ్రమంలో వదిలేశారు. కానీ కొన్ని గంటలకే ఆమెను అయిష్టంగానే మళ్లీ ఇంటికి తీసుకెళ్లాడు. చిన్నప్పటి నుంచి ఎన్నో అవమానాలు, కష్టాలు ఎదుర్కొన్న ఆ అమ్మాయి.. భారతీయ సినిమా దృష్టిని ఆకర్షించే నటి అవుతుందని ఎవరూ ఊహించలేదు. ఎన్నో కష్టాలు, సవాళ్లు.. వైవాహిక జీవితంలో అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్న ఆ నటి.. కేవలం 38 ఏళ్ల వయసులోనే అనారోగ్య సమస్యలతో జీవితాన్ని ముగించింది. ఆమె మరెవరో కాదు.. ఒకప్పటి హీరోయిన్ మీనా కుమారి. 50లలో భారతీయ సినీ రంగుల ప్రపంచంలో ఆమె తోపు హీరోయిన్. కుటుంబంలో పేదరికం, ఆర్థిక సంక్షోభం కారణంగా చిన్న వయసులోనే ఉద్యోగం చేయాలని నిర్ణయించుకుంది. చిన్న వయసులోనే బాలనటిగా సినిమాల్లోకి అడుగుపెట్టింది.
మీనా కుమారి 1946లో ‘బచ్చో కా ఖేల్’ చిత్రం ద్వారా హీరోయిన్‌గా అరంగేట్రం చేశారు. మొదటి సినిమాతోనే అద్భుతమైన నటనతో ప్రేక్షకులను దృష్టిని ఆకర్షించింది. ఆ తర్వాత హిందీలో వరుసగా అవకాశాలు అందుకుంది. నటిగానే కాకుండా కవయిత్రిగా, నేపథ్య గాయనిగా, కాస్ట్యూమ్ డిజైనర్‌గా పనిచేసింది. అప్పట్లో ఉత్తమ నటిగా పేరుగాంచిన మీనా కుమారి.. అప్పట్లో ట్రాజెడీ క్వీన్ అనే ట్యా్గ్ సొంతం చేసుకుంది. మూప్పై ఏళ్లు నటిగా వెండితెరపై సందడి చేసింది. కెరీర్ మంచి ఫాంలో ఉండగానే 1952లో డైరెక్టర్ కమల్ అమ్రోహిని వివాహం చేసుకుంది. కానీ మనస్పర్థలతో 1964లో విడాకులు తీసుకున్నారు.

Meena Kumar. News
భర్తతో డివోర్స్ తర్వాత మీనా కుమారి మద్యానికి బానిసయ్యారు. అధికంగా మద్యం సేవించడం వల్ల ఆమె కాలేయం దెబ్బతింది. చికిత్స కోసం లండన్, స్విట్జర్లాండ్ వెళ్లారు. అప్పటికే ఆమె నటిస్తోన్న పకీజా చిత్రం 14 ఏళ్లుగా వాయిదా పడుతూ వచ్చింది. చివరకు 1972లో రిలీజ్ అయిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమా విడుదలైన రెండు వారాలకే మీనా కుమారి మరణించింది. ఆ సమయంలో మీనా కుమారి వయసు కేవలం 38 సంవత్సరాలు మాత్రమే.
ఇవి కూడా చదవండి :
Tollywood: వామ్మో.. తిని తిని 108 కిలోలు పెరిగిపోయిందట.. ఈ యాంకరమ్మను గుర్తుపట్టారా.. ?
Tollywood: చైల్డ్ ఆర్టిస్టుగా ఎంట్రీ.. 16 ఏళ్లకే క్రేజీ హీరోయిన్.. హార్మోన్ ఇంజక్షన్స్ తీసుకుందంటూ..
Mahesh Babu: మహేష్ బాబు రిజెక్ట్ చేశాడు.. బ్లాక్ బస్టర్ హిట్టుకొట్టిన ఉదయ్ కిరణ్.. ఏ సినిమా అంటే..
Tollywood: 36 ఏళ్ల హీరోయిన్‌తో 60 ఏళ్ల హీరో లిప్ లాక్ సీన్.. దెబ్బకు కొడుకుతో ఆగిపోయిన పెళ్లి..




