AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rythu Bharosa: రైతు భరోసాపై తెలంగాణ ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్.. ఒకేసారి అందరికీ డబ్బులు.. ఈ సారి కొత్త విధానం..

రైతు భరోసాపై తెలంగాణ ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ అందించింది. తొలి విడతలో రైతలుందరికీ పెట్టుబడి సాయం అందనుంది. గతానికి భిన్నంగా ఈ సారి కొత్త విధానం పాటించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో మూడో విడతల్లోనే సాయం అందించే ప్రక్రియ పూర్తి కానుంది.

Rythu Bharosa: రైతు భరోసాపై తెలంగాణ ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్.. ఒకేసారి అందరికీ డబ్బులు.. ఈ సారి కొత్త విధానం..
Telangana Rythu Bharosa
Venkatrao Lella
|

Updated on: Mar 19, 2026 | 10:30 AM

Share

తెలంగాణలోని రైతులకు రేవంత్ సర్కార్ శుభవార్త అందించింది. రైతు భరోసా నిధుల విడుదలలో కీలక మార్పులు చేసింది. ఇక నుంచి తొలి విడతలోనే లబ్దిదారులందరికీ డబ్బులు అందనున్నాయి. ఇప్పటివరకు ఎకరం భూమి ఉన్న రైతుల నుంచి మొదలుపెట్టి విడతల వారీగా ఎక్కువ పోలం ఉన్న రైతులందరికీ నిధులు జమ చేసేవారు. దీని వల్ల ఏడెనిమిది విడతల్లో డబ్బులు జమ చేయడం వల్ల ఎక్కువ భూమి ఉన్న రైతులకు పెట్టుబడి సాయం అంటానికి చాలా ఆలస్యమవుతోంది. అయితే ఈ సారి ఈ విధానానికి రేవంత్ సర్కార్ స్వస్తి పలికింది. ఇక నుంచి పెట్టుబడి సాయం విడుదల చేయడంలో కొత్త విధానాన్ని పాటించాలని నిర్ణయించింది. ఈ సారి తొలి విడతలోనే రైతులందరీ అకౌంట్లో డబ్బులు పడేలా కొత్త నిర్ణయం అమలు చేయనున్నారు.

ఎకరం భూమికి డబ్బులు జమ

తొలి విడతలో ఎకరం భూమికి రైతు భరోసా అకౌంట్లలో జమ చేయనుంది. అంటే ఎంత భూమి కలిగి ఉన్నవారికైనా.. తొలి ఎకరానికి రూ.6 వేలు తొలి విడతలో జమ చేస్తారు. ఉదాహరణకు 5 ఎకరాల పోలం కలిగి ఉంటే.. తొలి ఎకరానికి రూ.6 వేలు జమ చేస్తారు. దీని వల్ల లబ్దిదారులందిరికీ ఒకేసారి లబ్ది చేకూరనుంది. మిగతా ఎకరాలకు తర్వాతి విడతల్లో డబ్బులు జమ చేస్తారు. ఈ నెల 22వ తేదీన నర్మెట్టలో జరిగే కార్యక్రమంలో ఎకరం భూమికి రేవంత్ నిధులు విడుదల చేయనున్నారు. మొదటి విడతలో 70 లక్షల మంది రైతులకు నిధులు రిలీజ్ చేయనుండగా.. ఇందుకు రూ.3,590 కోట్లు ఖర్చు కానుంది. ఇక తొలి విడత జమ చేసిన 20 రోజుల తర్వాత రెండో విడత సొమ్ము, ఏప్రిల్ నెలాఖరుకల్లా మూడో విడత నగదు జమ చేస్తారు. మూడు విడతల్లోనే ఈ సారి నగదు జమ చేసే ప్రక్రియ పూర్తి కానుంది.

కొత్త దరఖాస్తులు ఆహ్వానం

అటు రైతు భరోసా కొత్త దరఖాస్తులను కూడా అర్హుల నుంచి ప్రభుత్వం ఆహ్వానిస్తోంది. ఈ నెల 25వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. ఫిబ్రవరి 2026లోగా కొత్తగా పట్టాదారు పాస్ బుక్ పొందిన రైతులందరూ దరఖాస్తు చేసుకోవచ్చని స్పష్టం చేసింది. స్థానిక రైతు వేదికలు, రైతు విస్తరణ అధికారుల వద్దకు వెళ్లి దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. పట్టాదారు పాసు పుస్తకం, ఆధార్ కార్డ్, బ్యాంక్ అకౌంట్ పాస్ బుక్, రైతు భరోసా అప్లికేషన్ తీసుకెళ్లి దరఖాస్తు చేసుకోవాలి. వ్యవసాయ భూమి ధరణి పోర్టల్‌లో ఖచ్చితంగా రిజిస్టర్ అయ్యి ఉండాలి. భూమి వ్యవసాయయోగ్యమైన భూమి అయి ఉండాలి.

Follow Us
ఎక్కువ బ్యాంకు అకౌంట్లు వాడితే ఏమవుతుంది..?
ఎక్కువ బ్యాంకు అకౌంట్లు వాడితే ఏమవుతుంది..?
ఎన్టీఆర్ పెద్ద కుమారుడు రామకృష్ణ ఎలా చనిపోయారో తెలుసా..?
ఎన్టీఆర్ పెద్ద కుమారుడు రామకృష్ణ ఎలా చనిపోయారో తెలుసా..?
భద్రాద్రి రామాలయ చరిత్రలో నవ శకం! చిన్న జీయర్ స్వామి ఆధ్వర్యంలో
భద్రాద్రి రామాలయ చరిత్రలో నవ శకం! చిన్న జీయర్ స్వామి ఆధ్వర్యంలో
ముంబై ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. వచ్చేస్తున్నాడ్రోయ్ అసలైన మొగుడు
ముంబై ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. వచ్చేస్తున్నాడ్రోయ్ అసలైన మొగుడు
డీమార్ట్‌లో షాపింగ్ చేసేవారికి బెస్ట్ టిప్.. ఈ మూడు పనులు చేస్తే.
డీమార్ట్‌లో షాపింగ్ చేసేవారికి బెస్ట్ టిప్.. ఈ మూడు పనులు చేస్తే.
కస్టమర్స్‌కు గుడ్‌న్యూస్.. జియో నుంచి కొత్త రిచార్జ్‌ ప్లాన్..
కస్టమర్స్‌కు గుడ్‌న్యూస్.. జియో నుంచి కొత్త రిచార్జ్‌ ప్లాన్..
ఇల్లు అమ్మేశా.. ఏడుస్తూ ఆయన దగ్గరకు వెళ్లా.. నా లైఫ్ మార్చేశారు..
ఇల్లు అమ్మేశా.. ఏడుస్తూ ఆయన దగ్గరకు వెళ్లా.. నా లైఫ్ మార్చేశారు..
పిల్లలు ఎలా చదివితే 100% గుర్తుంటుంది.. సైంటిఫిక్ పద్ధతులు
పిల్లలు ఎలా చదివితే 100% గుర్తుంటుంది.. సైంటిఫిక్ పద్ధతులు
మీ కిచెన్ సింక్ పసుపు రంగులోకి మారిందా? ఈ చిట్కాలతో నిమిషాల్లో
మీ కిచెన్ సింక్ పసుపు రంగులోకి మారిందా? ఈ చిట్కాలతో నిమిషాల్లో
ఎన్గిడి లేటెస్ట్ హెల్త్ అప్‌డేట్ ఇదే.. రీఎంట్రీ ఎప్పుడంటే?
ఎన్గిడి లేటెస్ట్ హెల్త్ అప్‌డేట్ ఇదే.. రీఎంట్రీ ఎప్పుడంటే?