మాస్ సినిమాలు వద్దు.. ఎమోషనల్ సినిమాలే ముద్దు..
టాలీవుడ్ హీరోలు ఇప్పుడు మాస్ సినిమాలకే పరిమితం కాకుండా ఎమోషనల్ డ్రామాల వైపు అడుగులు వేస్తున్నారు. చిరంజీవి ‘మెగా158’, బాలయ్య-కొరటాల మూవీ, రవితేజ ‘ఇరుముడి’, సూర్య ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ వంటి సినిమాలు భావోద్వేగాలకు పెద్దపీట వేస్తున్నాయి. ఇమేజ్ కంటే కథ, ఎమోషన్ ముఖ్యమని భావిస్తూ స్టార్ హీరోలు కొత్త ట్రెండ్ సెట్ చేస్తున్నారు.
మన హీరోల మనసంతా ఎప్పుడూ మాస్ సినిమాలపైనే ఉంటుందనుకుంటారంతా.. కానీ మనోళ్లు కూడా అప్పుడప్పుడూ కొత్తదనం కోరుకుంటారు. అందుకే బరువైన కథలను ఓకే చేస్తున్నారు. మనసును కదిలించే కథల వైపే మన స్టార్స్ అడుగులు పడుతున్నాయిప్పుడు. ఇమేజ్ పక్కనబెట్టి ఎమోషనల్ డ్రామాలకు కనెక్ట్ అయిపోతున్నారు. టాలీవుడ్‌లో ఇదే కొత్త ట్రెండ్ ఇప్పుడు. మాస్ సినిమాలది ఏముంది.. ఎప్పుడైనా చేయొచ్చు. మనసును కదిలించే సినిమాలు చేసినపుడే కదా కిక్ వచ్చేది అంటున్నారు మన హీరోలు. అందుకే అందరూ హై రేంజ్ ఎమోషనల్ డ్రామాల వైపు వెళ్తున్నారు. ఈ లిస్టులో సీనియర్లే ఎక్కువగా ఉన్నారు. చిరంజీవినే తీసుకోండి.. బాబీతో చేస్తున్న మెగా158 పూర్తిగా ఎమోషనల్ డ్రామా. తండ్రీ కూతుళ్ళ నేపథ్యంతో సాగే కథ ఇది. మెగా158లో మీరు వింటేజ్ మెగాస్టార్‌తో పాటు గ్రేట్ యాక్టర్‌ను కూడా చూస్తారంటూ ప్రామిస్ చేసారు బాబీ. కోల్‌కత్తా బ్యాక్‌డ్రాప్‌తో వస్తున్న ఈ చిత్రంలో చిరు కూతురుగా అనస్వర రాజన్ నటిస్తున్నారు. ఇక బాలయ్య సైతం ఈ దారిలోనే వెళ్తున్నారు. కొరటాల సినిమాలో మాస్ యాక్షన్ ఉన్నా.. ఎమోషన్స్‌కే పెద్ద పీట వేస్తున్నారు. తనకు కలిసొచ్చిన మెసేజ్ ఓరియెంటెడ్‌గానే NBK112 ప్లాన్ చేస్తున్నారు కొరటాల. మాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అయిన రవితేజ కూడా ఈసారి ట్రాక్ మార్చారు. శివ నిర్వాణ తెరకెక్కిస్తున్న ఇరుముడి కన్నీరు పెట్టించే ఎమోషనల్ డ్రామా. నిన్ను కోరి, మజిలీ లాంటి హై ఎమోషనల్ సినిమాల తర్వాత శివ నిర్వాణ నుంచి వస్తున్న సినిమా ఇరుముడి. ఇక సూర్య, వెంకీ అట్లూరి కాంబోలో వస్తున్న విశ్వనాథ్ అండ్ సన్స్ పూర్తిగా ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామానే.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
30 వేల అడుగుల ఎత్తులో పైలట్‌కు గుండెపోటు
Ebola Alert: ఎబోలా ఎఫెక్ట్.. ఏపీ ప్రభుత్వం అలర్ట్.. వారికి క్వారంటైన్..
రాత్రి భోజనానికి తిరిగొస్తానంటూ వెళ్లి అనంత లోకాలకు..
అంబులెన్స్‌లో తిరుగుతూ అమ్మాయిలను చంపేసే సైకో.. OTTలో ఈ రోడ్ సైడ్ క్రైమ్ థ్రిల్లర్ చూశారా?
రూ. లక్ష క్యాష్ బ్యాగ్‌ను ఎత్తుకెళ్లిన శునకం..!
చరిత్ర సృష్టించిన ఆకలి.. రెండు పిజ్జాల ధర రూ.7,400 కోట్లా
సంకల్ప బలం.. చేతులతోనే ఎవరెస్ట్ ఎక్కిన మాజీ సైనికుడు
పిల్లల్ని కన్న తర్వాత ఆక్టోపస్ ఎందుకు చనిపోతుంది?
'ఫ్రెంచ్ సండే' ప్రత్యేకత ఏంటో తెలుసా? అసలు సీక్రెట్ ఇదే
కాలానికి తగ్గట్టు రంగు మార్చే పక్షిని చూశారా
మందుల షాపు బోర్డుపై దేశభక్తి.. ప్రతి ఒక్కరికీ స్ఫూర్తి!

