30 వేల అడుగుల ఎత్తులో పైలట్‌కు గుండెపోటు
30,000 అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్న జెట్2 విమాన పైలట్‌కు గుండెపోటు రావడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. 220 మంది ప్రయాణికులతో ఉన్న విమానాన్ని కో పైలట్ అత్యవసరంగా పోర్చుగల్‌లో ల్యాండ్ చేశాడు. కేబిన్ సిబ్బంది డాక్టర్ల కోసం సహాయం కోరగా ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. సమయానికి తీసుకున్న నిర్ణయంతో పెద్ద ప్రమాదం తప్పిందని నిపుణులు చెబుతున్నారు.
విమానం గాల్లో 30,000 అడుగుల ఎత్తులో ఉండగా పైలట్‌కు గుండెపోటు వచ్చింది. శుక్రవారం తెల్లవారుజామున జెట్2 విమానం స్పెయిన్‌లోని టెనెరెట్ నుంచి బర్మింగ్‌హామ్‌కు బయల్దేరింది. విమానం 30,000 అడుగుల ఎత్తులో ప్రయాణిస్తుండగా.. పైలట్‌కు గుండెపోటు వచ్చినట్లు కో పైలట్ గమనించారు. ఘటన సమయంలో విమానంలో 220మంది ప్రయాణికులు ఉన్నారు. విమాన సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. కేబిన్ క్రూ హడావుడిగా ప్రయాణికుల మధ్య పరుగులు తీస్తూ, “ఎవరైనా డాక్టర్ ఉన్నారా? మెడికల్ ట్రైనింగ్ ఉన్నవారెవరైనా ఉన్నారా?” అంటూ సహాయం కోరారు. దాంతో పరిస్థితి ఎంత సీరియస్‌గా ఉందో అందరికీ అర్థమైంది. పైలట్ ఆరోగ్యం అకస్మాత్తుగా క్షీణించడంతో ఎమర్జెన్సీ ఏర్పడినట్లు తెలుసుకున్నారు. విమానం వేగంగా కిందకు దిగడంతో ప్రయాణికులు ఒక్కసారిగా భయపడ్డారు. కేబిన్‌లో ఆ సమయంలో ఏర్పడిన టెన్షన్ వాతావరణం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. పిల్లలు ఏడ్వడం మొదలుపెట్టారు. “జీవితంలో ఇంత భయంకర ప్రయాణం ఎప్పుడూ చేయలేదు” అంటూ కొందరు ప్రయాణికులు తమ అనుభవాలను పంచుకున్నారు. విమానం దారి మళ్లించి దగ్గర్లోని పోర్చుగల్ ఎయిర్‌పోర్ట్‌లో అత్యవసర ల్యాండింగ్ చేసారు. విమానం నేలను తాకగానే ఎమర్జెన్సీ సిబ్బంది వెంటనే విమానంలోకి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. మెడికల్ టీమ్ నేరుగా కాక్‌పిట్‌లోకి వెళ్లి పైలట్‌కు చికిత్స అందించింది. అనంతరం ఆయన్ని ఆసుపత్రికి తరలించారు. పైలట్ ఆరోగ్య పరిస్థితిపై పూర్తి వివరాలు ఇంకా బయటకు రాలేదు. అయితే విమానం సురక్షితంగా ల్యాండ్ కావడంతో ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు. విమాన ప్రయాణాల్లో సిబ్బంది అప్రమత్తత ఎంత ముఖ్యమో ఈ సంఘటన మరోసారి చూపించింది. సమయానికి నిర్ణయం తీసుకుని అత్యవసర ల్యాండింగ్ చేయడంతో పెద్ద ప్రమాదం తప్పిందని నిపుణులు చెబుతున్నారు. అయితే ఎయిర్‌లైన్స్ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసేవరకు దాదాపు 13 గంటల పాటు టెర్మినల్‌లోనే ఉన్నామని.. అయినా అధికారులు తమకు ఎటువంటి వసతి ఏర్పాట్లు చేయలేదని ప్రయాణికులు ఫిర్యాదు చేసారు. శనివారం మరో విమానం ఏర్పాటు చేయడంతో బర్మింగ్‌హామ్‌కు చేరుకున్నట్లు చెప్పారు. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి జెట్2 క్షమాపణలు చెప్పింది. ప్రయాణికులు, సిబ్బంది భద్రత విషయంలో తమ ఎయిర్‌లైన్స్ ఎప్పుడూ రాజీ పడదని తెలిపింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Ebola Alert: ఎబోలా ఎఫెక్ట్.. ఏపీ ప్రభుత్వం అలర్ట్.. వారికి క్వారంటైన్..
రాత్రి భోజనానికి తిరిగొస్తానంటూ వెళ్లి అనంత లోకాలకు..
అంబులెన్స్‌లో తిరుగుతూ అమ్మాయిలను చంపేసే సైకో.. OTTలో ఈ రోడ్ సైడ్ క్రైమ్ థ్రిల్లర్ చూశారా?
రూ. లక్ష క్యాష్ బ్యాగ్‌ను ఎత్తుకెళ్లిన శునకం..!
చరిత్ర సృష్టించిన ఆకలి.. రెండు పిజ్జాల ధర రూ.7,400 కోట్లా
సంకల్ప బలం.. చేతులతోనే ఎవరెస్ట్ ఎక్కిన మాజీ సైనికుడు
పిల్లల్ని కన్న తర్వాత ఆక్టోపస్ ఎందుకు చనిపోతుంది?
'ఫ్రెంచ్ సండే' ప్రత్యేకత ఏంటో తెలుసా? అసలు సీక్రెట్ ఇదే
కాలానికి తగ్గట్టు రంగు మార్చే పక్షిని చూశారా
మందుల షాపు బోర్డుపై దేశభక్తి.. ప్రతి ఒక్కరికీ స్ఫూర్తి!

