Ebola Alert: ఎబోలా ఎఫెక్ట్.. ఏపీ ప్రభుత్వం అలర్ట్.. వారికి క్వారంటైన్..
ఆఫ్రికా దేశాల్లో ఎబోలా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. తిరుపతి, విశాఖ, విజయవాడ విమానాశ్రయాల్లో ప్రత్యేక స్క్రీనింగ్ నిర్వహిస్తున్నారు. అనుమానిత లక్షణాలు ఉన్నవారిని క్వారంటైన్‌కు తరలించే ఏర్పాట్లు చేశారు. ఐసోలేషన్ వార్డులు, పీపీఈ కిట్లు సిద్ధం చేసిన ప్రభుత్వం ప్రజలు అవసరం అయితే తప్ప ఆఫ్రికా ప్రయాణాలు చేయవద్దని సూచించింది.
ఆఫ్రికా దేశాలను ఎబోలా వైరస్ ఇబ్బంది పెడుతోంది. ఇప్పటికే 200 మందికిపైగా ఎబోలా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. విమానాశ్రయాల వద్ద స్క్రీనింగ్ ఏర్పాట్లు చేసింది. ప్రయాణికులకు ఎయిర్ పోర్టుల వద్ద వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. అనుమానిత లక్షణాలను గుర్తిస్తే వెంటనే క్వారంటైన్ తరలించే ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం ఐసోలేషన్ వార్డులను ఏర్పాటు చేయాలని మంత్రి సత్యకుమార్ యాదవ్ అధికారులను ఆదేశించారు. ఎబోలా వైరస్‌పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అలర్టయింది. ఆఫ్రికాలోని మూడు దేశాలలో ఎబోలా కలకలం రేపుతోంది. ఇప్పటి వరకూ 204 మంది చనిపోయారు. అప్రమత్తమైన ఏపీ ప్రభుత్వం.. ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టింది. ఎబోలా వైరస్ వ్యాప్తి ఉన్న సూడాన్, ఉగాండా, కాంగో దేశాల నుంచి ఏపీకి వచ్చేవారికి వైద్య పరీక్షలు నిర్వహించాలని ఏపీ ఆరోగ్య శాఖ నిర్ణయం తీసుకుంది. తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం విమానాశ్రయాల్లో వీరిని గుర్తించి వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. ఎబోలా వైరస్ వ్యాప్తిపై ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అన్ని జిల్లాల అధికారులను ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశించారు. ఎయిర్‌పోర్టులతో పాటుగా పోర్టులు, రోడ్డు మార్గాలపైనా దృష్టి పెట్టాలని ఆదేశించారు. ఎవరిలోనైనా ఎబోలా వైరస్ లక్షణాలు కనిపిస్తే క్వారంటైన్ చేయాలని అధికారులకు స్పష్టం చేశారు. మరోవైపు మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశాలతో ఎయిర్ పోర్టులలో వైద్య పరీక్షలు చేస్తున్నారు. విమాన ప్రయాణికుల ట్రావెల్ హిస్టరీ ఆధారంగా ఎవరిలోనైనా ఎబోలా వైరస్ అనుమానిత లక్షణాలు కనిపిస్తే అలాంటి వారిని క్వారంటైన్ తరలించేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. గతంలో కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికించిన సంగతి తెలిసిందే. వైరస్ అనుభవాలతో ఎబోలా వైరస్ నియంత్రణ కోసం ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేసినట్లు మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఇందులో భాగంగా ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులు ఉన్న విశాఖ, తిరుపతి, విజయవాడ వంటి చోట్ల ఐసోలేషన్ వార్డులను కూడా సిద్ధం చేసినట్లు మంత్రి వివరించారు. బోధనా ఆసుపత్రుల్లో ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేశామని.. అవసరమైన పీపీఈ కిట్లు, పరీక్షా కిట్లు అందుబాటులో ఉంచినట్లుమంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. ఎబోలా వైరస్ గురించి ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎమ్‌లకు అవగాహన కల్పిస్తున్నామన్న మంత్రి సత్యకుమార్ యాదవ్.. అత్యవసరం అయితే తప్ప ఆఫ్రికా దేశాలకు ప్రయాణాలు చేయవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇటీవల ఆఫ్రికా దేశాల నుంచి వచ్చినవారు కూడా తమ ఆరోగ్య పరిస్థితిపై అప్రమత్తంగా ఉండాలని.. అనుమానిత లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్య సిబ్బందిని సంప్రదించాలని వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ కోరారు. ఆఫ్రికా ఖండంలో వేగంగా విస్తరిస్తున్న ప్రాణాంతక ‘ఎబోలా’ వైరస్ విషయంలో భారత ప్రభుత్వం అలర్టయింది. సెంట్రల్ ఆఫ్రికాలో ఎబోలా వైరస్ మహమ్మారి విలయం సృష్టిస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ దీనిని అత్యవసర పరిస్థితిగా ప్రకటించింది. దేశీయంగా వైరస్ వ్యాప్తి చెందకుండా నిరోధించేందుకు ఢిల్లీలోని అంతర్జాతీయ విమానాశ్రయంతో పాటు దేశంలోని అన్ని ప్రధాన అంతర్జాతీయ రవాణా కేంద్రాల వద్ద కేంద్రం స్క్రీనింగ్ చేపడుతోంది. ప్రస్తుతం ఆఫ్రికాలో వ్యాప్తిస్తున్న ‘బుండిబుగ్యో’ స్ట్రెయిన్ లక్షణాలు సాధారణ ఫ్లూ, టైఫాయిడ్, మలేరియాలా ఉండటం వల్ల దీనిని గుర్తించడం వైద్యులకు సవాలుగా మారింది. అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లు ‘జైర్’ స్ట్రెయిన్‌ను అడ్డుకోవడానికి రూపొందించినవి కావడంతో, ప్రస్తుత కొత్త వేరియంట్‌పై ఇవి ప్రభావవంతంగా పనిచేయడం లేదు. ఎబోలా ప్రభావిత దేశాలైన కాంగో, ఉగాండా, సౌత్ సూడాన్ నుంచి వచ్చే ప్రయాణికులు తమ ప్రయాణ వివరాలను తప్పనిసరిగా తెలియచేయాలి. ఇమ్మిగ్రేషన్ క్లియరెన్స్‌కు ముందే ఎయిర్‌పోర్ట్ హెల్త్ కియోస్క్ లో హెల్త్ చెక్ చేయించుకోవాలి. ప్రస్తుతం ఆఫ్రికాలో వందలాది కేసులు, 200 కు పైగా మరణాలు నమోదయ్యాయి. భారత్‌లో ఇప్పటివరకు ఎలాంటి కేసులు నమోదు కాకపోయినప్పటికీ, అధిక జనాభా కలిగిన నగరాల్లో వైరస్ వ్యాపించకుండా ముందుజాగ్రత్తగా ఈ చర్యలు తీసుకుంటున్నారు. ఎబోలా ప్రభావిత ప్రాంతాల నుంచి వచ్చిన ప్రయాణికులు జ్వరం, కండరాల నొప్పులు, వాంతులు, విరేచనాలతో బాధపడుతుంటే అధికారులకు సమాచారం అందించాలి. కొందరికి మూడు వారాల వ్యవధిలో ఎలాంటి లక్షణాలు కనిపించినా, వెంటనే వైద్యులను సంప్రదించాలి. పుణెలోని ‘ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ’ని ప్రధాన టెస్టింగ్ కేంద్రంగా ప్రభుత్వం ప్రకటించింది. ఎయిర్‌పోర్టుల్లో అనుమానిత లక్షణాలు ఉన్నవారిని నేరుగా ఐసోలేషన్ కేంద్రాలకు తరలించేలా ఏర్పాట్లు చేసారు. ప్రజలు కేవలం అధికారిక సమాచారాన్ని మాత్రమే నమ్మాలని అధికారులు సూచించారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రాత్రి భోజనానికి తిరిగొస్తానంటూ వెళ్లి అనంత లోకాలకు..
అంబులెన్స్‌లో తిరుగుతూ అమ్మాయిలను చంపేసే సైకో.. OTTలో ఈ రోడ్ సైడ్ క్రైమ్ థ్రిల్లర్ చూశారా?
RGV: ఆ స్టార్‌పై నాకు కోపం, ద్వేషం.. RGV ఎమోషనల్ ట్వీట్
రూ. లక్ష క్యాష్ బ్యాగ్‌ను ఎత్తుకెళ్లిన శునకం..!
Randeep Hooda: ఆ సినిమాలో ఇరుక్కుని.. మరిన్ని ఇబ్బందులు పడాలనుకోలేదు
రూ. లక్ష క్యాష్ బ్యాగ్‌ను ఎత్తుకెళ్లిన శునకం..!
చరిత్ర సృష్టించిన ఆకలి.. రెండు పిజ్జాల ధర రూ.7,400 కోట్లా
సంకల్ప బలం.. చేతులతోనే ఎవరెస్ట్ ఎక్కిన మాజీ సైనికుడు
పిల్లల్ని కన్న తర్వాత ఆక్టోపస్ ఎందుకు చనిపోతుంది?
'ఫ్రెంచ్ సండే' ప్రత్యేకత ఏంటో తెలుసా? అసలు సీక్రెట్ ఇదే
కాలానికి తగ్గట్టు రంగు మార్చే పక్షిని చూశారా
మందుల షాపు బోర్డుపై దేశభక్తి.. ప్రతి ఒక్కరికీ స్ఫూర్తి!
