AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Randeep Hooda: ఆ సినిమాలో ఇరుక్కుని.. మరిన్ని ఇబ్బందులు పడాలనుకోలేదు

Randeep Hooda: ఆ సినిమాలో ఇరుక్కుని.. మరిన్ని ఇబ్బందులు పడాలనుకోలేదు

Phani CH
|

Updated on: May 26, 2026 | 12:54 PM

Share

విక్కీ కౌశల్ నటించిన ‘ఛావా’ సినిమాలో ఔరంగజేబు పాత్రకు మొదటి ఎంపిక అక్షయ్ ఖన్నా కాదని, రణ్‌దీప్ హుడానే అని తాజాగా వెలుగులోకి వచ్చింది. అయితే వీర్ సావర్కర్ సినిమా సమయంలో బరువు తగ్గడం, కోర్టు కేసులు, హిందూ-ముస్లిం వివాదాల మధ్య చిక్కుకోవద్దనే కారణాలతో తాను ఆ పాత్రను తిరస్కరించానని రణ్‌దీప్ వెల్లడించాడు. ప్రస్తుతం ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

బాలీవుడ్ స్టార్ హీరో విక్కీ కౌశల్ ప్రధాన పాత్రలో నటించిన హిస్టారికల్ మూవీ ఛావా. ఛత్రపతి శివాజీ కుమారుడు శంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీలో రష్మిక మందన్నా ఏసుబాయిగా మెప్పించింది. అలాగే కీలకమైన ఔరంగ జేబు పాత్రలో ఒకప్పటి బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ ఖన్నా అద్దిరిపోయే పెర్ఫామెన్స్ ఇచ్చాడు. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించిన ఛావా చిత్రం రూ.800 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. బాలీవుడ్ లో అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది. ఈ సినిమాలో శంభాజీ పాత్రలో విక్కీ కౌశల్ అభినయం నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. అతను తప్పితే మరొకరు ఈ పాత్రలో నటించలేరన్న విధంగా యాక్ట్ చేశాడు విక్కీ. ఇక ఆ తర్వాతి రూల్… ఔరంగ జేబు పాత్ర పోషించిన అక్షయ్ ఖన్నాదే అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా క్లైమాక్స్ లో అక్షయ్ క్రూరత్వాన్ని చూసి తిట్టుకోని వారుండరంటే అతి శయోక్తి కాదు. అంతలా ఆ పాత్రలో ఒదిగిపోయాడు అక్షయ్ ఖన్నా. అయితే ఔరంగ జేబు పాత్రకు ఫస్ట్ ఛాయిస్ అక్షయ్ ఖన్నా కాదట. బాలీవుడ్ వెర్సటైల్ యాక్టర్ రణ్ దీప్ హుడాను మొదట ఈ పాత్ర కోసం సంప్రదించారట. అయితే అతను రిజెక్ట్ చేయడంతో అక్షయ్ ఖన్నా లైన్ లోకి వచ్చాడట. ఈ విషయం గురించి రణ్ దీప్ హుడా లేటెస్ట్ గా మాట్లాడాడు. తాను వీర్ సావర్కర్ సినిమా కోసం బాగా బరువు తగ్గి సన్నబడ్డానని.. ఆ సమయంలో ఔరంగజేబు పాత్ర కోసం తాను సరిపోతానని అనిపించలేదని రణ్‌ దీప్ చెప్పాడు. పైగా వీర్ సావర్కర్ సినిమాకు సంబంధించి ఓ కోర్టు కేసు కూడా ఎదుర్కొంటున్నాను. అదే సమయంలో ఛావా సినిమాలో హిందూ-ముస్లింకి సంబంధించిన అంశాలు ఎక్కువగా ఉన్నాయి. దాంతో ఈ సినిమా కథలో ఇరుక్కుని మరిన్ని ఇబ్బందులు పడాలనుకోలేదని.. ఆ దారిలో అసలు నడవాలనుకోలేదంటూ రణ్ దీప్ హుడా చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ నటుడి కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి. బాలీవుడ్ లో రణ్ దీప్ హుడాకు వెర్సటైల్ యాక్టర్ గా పేరుంది. కేవలం హీరోగానే కాకుండా విలన్ గా, సహాయక నటుడిగానూ ఆకట్టుకుంటున్నాడు. ఆ మధ్యన టాలీవుడ్ దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కించిన జాట్ సినిమాలో రణ్ దీప్ క్రూరమైన విలన్ పాత్రలో అందర్నీ ఆకట్టుకున్నాడు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Donald Trump: మోదీకి నేను బిగ్‌ ఫ్యాన్‌.. ఏది అడిగినా ఇచ్చేస్తా

చరిత్ర సృష్టించిన ఆకలి.. రెండు పిజ్జాల ధర రూ.7,400 కోట్లా

రోడ్ కిందే చార్జింగ్ పాయింట్స్ ! రన్నింగ్‌ వెహికిల్‌కు క్షణాల్లో ఛార్జింగ్.!

Follow Us