తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ ప్రాంగణంలో ఓ చిరుత కలకలం సృష్టించింది. క్లినికల్ సైన్సెస్ విభాగంలో మహిళా సిబ్బందికి చిరుత కనిపించడంతో భయాందోళన నెలకొంది. ఏడాది వయసున్న ఆడ చిరుత టాయిలెట్లో దాక్కుంది. సమాచారం అందుకున్న అటవీ శాఖ సిబ్బంది చిరుతను బోనులో బంధించి విజయవంతంగా జూ పార్కుకు తరలించారు.