సోషల్ మీడియాను షేక్ చేస్తున్న రుక్మిణీ వసంత్.. స్టన్నింగ్ లుక్స్‌..

Rajitha Chanti

Pic credit - Instagram

26 May 2026

కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి టాలెంట్‌తో పాటు అద్భుతమైన ఫాలోయింగ్ సంపాదించుకున్న యంగ్ బ్యూటీ రుక్మిణీ వసంత్. కన్నడలో పలు చిత్రాల్లో నటించింది.

'సప్త సాగరదాచే ఎల్లో' సినిమాతో సౌత్ ఇండియాలోనే సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ భామ, కేవలం తన యాక్టింగ్‌తోనే కాదు.. లేటెస్ట్ ఫ్యాషన్ స్టైల్‌తోనూ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

తాజాగా ఆమె ట్రెడిషనల్ అండ్ మోడ్రన్ ఎథ్నిక్ అవుట్‌ఫిట్స్‌లో మెరిసిపోయిన కొన్ని ఫొటోలు నెట్టింట విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఆ ఫోటోస్ చూస్తే ఫిదా కావాల్సిందే.

ఈ ఫొటోల్లో ఆమె రాయల్ లుక్ చూసి అభిమానులు మురిసిపోతున్నారు. ఇటీవల జరిగిన ఒక అవార్డ్స్ ఫంక్షన్‌లో రుక్మిణీ షాంపేన్-గోల్డ్ కలర్ నెట్ శారీలో తళుక్కుమంది.

ఆ చీరపై చేసిన సీక్విన్స్, ముత్యాల వర్క్ అందరినీ ఆకట్టుకుంది. దానికి మ్యాచింగ్ బ్లౌజ్, సింపుల్ ఇయర్ రింగ్స్ పెట్టుకుని, జుట్టును చక్కగా వెనక్కి ముడివేసి దేవకన్యలా మెరిసిపోయింది.

ఈ ట్రెడిషనల్ శారీ లుక్ ఇన్‌స్టాగ్రామ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. అలాగే మరో ఫొటోషూట్‌లో హెవీ ఎంబ్రాయిడరీ ఉన్న స్ట్రాప్‌లెస్ లెహంగాలో అదరగొట్టింది.

మెడలో సింపుల్ డైమండ్ నెక్లెస్, చేతులకు మెరిసే నెట్ స్లీవ్స్‌తో ఆమె ఇచ్చిన పోజులు నెటిజన్లను కట్టిపడేస్తున్నాయి. 2019లో 'బీర్బల్' సినిమాతో కెరీర్ స్టార్ట్ చేసింది రుక్మిణి

2023లో వచ్చిన 'సప్త సాగరదాచే ఎల్లో' చిత్రంతో ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఈ సినిమాలో నటనకు గాను ఫిల్మ్‌ఫేర్ క్రిటిక్స్ అవార్డు కూడా అందుకుంది.