AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AIతో హీరోయిన్లను టార్గెట్ చేస్తున్నారా..? ఫేక్ వీడియోలపై స్టార్స్ ఫైర్

AIతో హీరోయిన్లను టార్గెట్ చేస్తున్నారా..? ఫేక్ వీడియోలపై స్టార్స్ ఫైర్

Lakshminarayana Varanasi
| Edited By: |

Updated on: May 26, 2026 | 6:01 PM

Share

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దుర్వినియోగంపై హీరోయిన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తన పేరుతో ఫేక్ AI బికినీ వీడియోలు వైరల్ అవుతున్నాయని రుక్మిణి వసంత్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే రష్మిక, కీర్తి సురేష్ కూడా డీప్‌ఫేక్ వీడియోలపై తీవ్రంగా స్పందించారు. టెక్నాలజీని అసభ్యంగా వాడటం నైతిక పతనానికి సంకేతమని సెలబ్రిటీలు హెచ్చరిస్తున్నారు.

AI మిస్ యూజ్ దారుణంగా జరుగుతుందా..? ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్‌తో హీరోయిన్లను ఇబ్బంది పెడుతున్నారా..? వాళ్ల వ్యక్తిగత విషయాలను సైతం AIతో నాశనం చేయాలని కుట్ర చేస్తున్నారా..? తాజాగా మన హీరోయిన్స్ కోపం చూస్తుంటే ఇది నిజమే అనిపిస్తుంది. మరో హీరోయిన్ సైతం AI మిస్ యూజ్‌పై తన గళం విప్పింది. ఎవరామె.. ఆమెకు జరిగిన నష్టమేంటి..? ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్‌తో ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయిప్పుడు. మనుషులతో అవసరం లేకుండా ఏకంగా సినిమాలు కూడా తీస్తున్నారు.. మరోవైపు ఎన్నో అవసరాల కోసం వాడుకుంటున్నారు. కానీ అదే టైమ్‌లో AIని మిస్ యూజ్ చేస్తున్న వాళ్లు లేకపోలేదు. ముఖ్యంగా హీరోయిన్లకు ఈ టెక్నాలజీ కొత్త తలనొప్పులు తెచ్చి పెడుతుంది. దీనిపై స్టార్స్ ఓపెన్ అవుతున్నారు. తాజాగా ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ దుర్వినియోగంపై రుక్మిణి వసంత్ ఓపెన్ అయ్యారు. తన పేరుతో ఫేక్ AI బికినీ వీడియోలు వైరల్ అవుతున్నాయని.. అలాంటివి చేయడం ప్రైవసీకి భంగం కలిగించడమే అన్నారు రుక్మిణి. అలాంటివి మానుకోవాలని ఆమె సూచించారు. తన టీం దీనిపై లీగల్ చర్యలు మొదలు పెట్టిందని చెప్పారు రుక్మిణి. గతంలో దీనిపై రష్మిక కూడా సీరియస్ అయ్యారు. మహిళలను లక్ష్యంగా చేసుకుని.. అసభ్యంగా చూపించడం, టెక్నాలజీ దుర్వినియోగం చేయడం కొంతమంది వ్యక్తులలో నైతిక పతనాన్ని సూచిస్తుంది.. గుర్తుంచుకోండి ఇంటర్నెట్‌లో ఉన్నది ఇకపై ప్రతీది నిజం కాదని అప్పట్లో ట్వీట్ చేసారు రష్మిక. ఈమె పోస్ట్ బాగా ట్రెండ్ అయింది. రష్మిక మాత్రమే కాదు.. మొన్నటికి మొన్న కీర్తి సురేష్ సైతం AI మిస్ యూజ్ గురించి సీరియస్ అయ్యారు. అలాంటి వీడియోలు, ఫోటోలను చూస్తుంటేనే అసహ్యమేస్తుందంటూ కీర్తి మండిపడ్డారు. కేవలం వీళ్లే కాదు.. ఇంకా చాలా మంది స్టార్స్ సైతం టెక్నాలజీని సరైన పద్దతిలో వాడాలంటూ హితవు పలుకుతున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

2026లో అక్కినేని దండయాత్ర.. నాగ్, చైతూ, అఖిల్ ప్లానింగ్ చూస్తే షాక్ అవుతారు

బాబోయ్‌.. జూన్‌ 1 నుంచి ‘ధరల బాదుడు’ మొదలా?

30 వేల అడుగుల ఎత్తులో పైలట్‌కు గుండెపోటు

Ebola Alert: ఎబోలా ఎఫెక్ట్.. ఏపీ ప్రభుత్వం అలర్ట్.. వారికి క్వారంటైన్..

రాత్రి భోజనానికి తిరిగొస్తానంటూ వెళ్లి అనంత లోకాలకు..

Follow Us