AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘పెద్ది’కి పర్సెంటేజ్ సెగ.. తెలంగాణలో రిలీజ్ ఆగిపోతుందా?

‘పెద్ది’కి పర్సెంటేజ్ సెగ.. తెలంగాణలో రిలీజ్ ఆగిపోతుందా?

Lakshminarayana Varanasi
| Edited By: |

Updated on: May 26, 2026 | 6:06 PM

Share

టాలీవుడ్‌లో రెంట్స్, పర్సెంటేజ్ వివాదం మళ్లీ ముదిరింది. ముఖ్యంగా ‘పెద్ది’ సినిమా విడుదల చుట్టూ తెలంగాణ ఎగ్జిబిటర్లు, నిర్మాతల మధ్య టెన్షన్ నెలకొంది. పర్సెంటేజ్ లేకుంటే సినిమాను ప్రదర్శించమని ఎగ్జిబిటర్లు హెచ్చరిస్తుండగా, నిర్మాతలు మాత్రం గ్రేడింగ్ విధానంపైనే నిలబడుతున్నారు. ఈ వివాదం ‘పెద్ది’ విడుదలపై ప్రభావం చూపే అవకాశముంది.

టాలీవుడ్‌లో పర్సెంటేజ్ మంటలు మళ్ళీ మొదటికి వచ్చాయా..? పెద్ది సినిమాపై అది ఎఫెక్ట్ చూపించబోతుందా..? పర్సెంటేజ్ లేకుంటే పెద్ది వేసేది లేదని తెలంగాణ ఎగ్జిబిటర్లు తెగేసి చెబుతుంటే.. నిర్మాతలు ఎందుకింత సైలెంట్‌గా ఉన్నారు..? అసలు ఈ పర్సెంటేజ్ గొడవలతో పెద్ది సినిమా ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది..? రెంట్స్, పర్సెంటేజీల వ్యవహారం ఇండస్ట్రీలో పెద్ద దుమారమే రేపుతోంది. ముఖ్యంగా పెద్ది చుట్టూనే ఇదంతా నడుస్తుంది. పర్సెంటేజ్ ఇస్తేనే తెలంగాణలో పెద్ది ఆడనిస్తామని.. లేదంటే లేదని ఎగ్జిబిటర్స్ చెప్తున్నారు. చేతికి దొరికిన ఈ ఆయుధాన్ని వదులుకోమని.. నిర్మాతలు మాత్రం కూర్చుని మాట్లాడుకోకుండా గ్రేడింగ్ అనే కొత్త పదం తీసుకొచ్చి ఇష్యూని కావాలనే సాగదీస్తున్నారనేది ఎగ్జిబిటర్ల వాదన. తెలంగాణలో టికెట్ రేట్ల పెంపుకు కూడా నో చెప్తున్నారు ఎగ్జిబిటర్లు. డిజిటల్ రాకతో థియెట్రికల్ రన్ తగ్గిపోయిన ఈ రోజుల్లో మొదటి వారం రెంట్ తీసుకుని రెండో వారం పర్సెంటేజ్ ఇస్తామంటే ఎలా కుదురుతుందని వాళ్లు ప్రశ్నిస్తున్నారు. ఏదేమైనా విషయం ఇప్పుడు తేలాల్సిందే అంటున్నారు వాళ్ళు. మరోవైపు నిర్మాతలు మాత్రం కమిటీ చెప్పిన మాటకే కట్టుబడి ఉన్నారు. మల్టీప్లెక్స్‌లకు లేని గ్రేడింగ్ సింగిల్ స్క్రీన్స్‌కి మాత్రమే ఎందుకని డైరెక్ట్‌గా నిలదీస్తున్నారు ఎగ్జిబిటర్లు. ఏదో ఒకటి రెండు రోజుల్లో తేల్చితే హాయిగా పెద్ది థియేటర్లలో విడుదల చేస్తామని.. లేదంటే లేదంటున్నారు. ఇండస్ట్రీ పెద్దగా ఉన్న చిరంజీవి దగ్గరికే వెళ్లి తమ బాధలు చెప్పుకుంటామని కుండబద్దలు కొడుతున్నారు ఎగ్జిబిటర్లు. చూడాలిక ఈ విషయం ఎక్కడ ఆగుతుందో..?

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

30 వేల అడుగుల ఎత్తులో పైలట్‌కు గుండెపోటు

Ebola Alert: ఎబోలా ఎఫెక్ట్.. ఏపీ ప్రభుత్వం అలర్ట్.. వారికి క్వారంటైన్..

రాత్రి భోజనానికి తిరిగొస్తానంటూ వెళ్లి అనంత లోకాలకు..

అంబులెన్స్‌లో తిరుగుతూ అమ్మాయిలను చంపేసే సైకో.. OTTలో ఈ రోడ్ సైడ్ క్రైమ్ థ్రిల్లర్ చూశారా?

RGV: ఆ స్టార్‌పై నాకు కోపం, ద్వేషం.. RGV ఎమోషనల్ ట్వీట్

Follow Us