AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kamal Haasan : ఇండియాలో ఆ హీరో పాన్ ఇండియా శక్తి.. నా ఫ్రెండ్ అయినందుకు గర్వపడుతున్నా.. కమల్ హాసన్..

భారతీయ చలనచిత్ర రంగంలో కమల్ హాసన్ గురించి చెప్పక్కర్లేదు. అభిమానులు ఆయనను ప్రేమగా 'ఉలగనాయగన్' (విశ్వనటుడు) అని పిలుచుకుంటారు. సినిమా కోసం నిరంతరం కొత్త ప్రయోగాలు చేస్తూ, తనను తాను మార్చుకుంటూ దశాబ్దాలుగా ప్రేక్షకులను అలరిస్తున్నారు. 1960లో వచ్చిన 'కలత్తూర్ కన్నమ్మ' అనే తమిళ సినిమాతో బాలనటుడిగా కమల్ హాసన్ ప్రయాణం ప్రారంభమైంది.

Rajitha Chanti
|

Updated on: May 26, 2026 | 9:58 PM

Share
వైవిధ్యభరితమైన నటనతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న విశ్వనటుడు కమల్ హాసన్. పాన్ ఇండియా లెవల్లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నాడు. కమల్ హాసన్, టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి మధ్య ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వీరిద్దరూ సమకాలీన నటులైనప్పటికీ, ఒకరినొకరు ఎంతో గౌరవించుకుంటారు. గతంలో ఓ ఇంటర్వ్యూలో కమల్ హాసన్ మెగాస్టార్ చిరంజీవి స్టార్ డమ్, ఆయన వ్యక్తిత్వంపై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట మళ్లీ వైరల్ అవుతున్నాయి. 'విక్రమ్' సినిమా ప్రమోషన్స్ సమయంలో ఆయన ఈ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

1 / 5
ఈ ఇంటర్వ్యూలో కమల్ హాసన్ మాట్లాడుతూ, చిరంజీవి కేవలం టాలీవుడ్‌కే పరిమితం కాలేదని, ఆయన అనుకుని ఉంటే కోలీవుడ్ (తమిళ పరిశ్రమ) లో కూడా సులభంగా ఒక పెద్ద స్టార్‌గా ఎదిగేవారని పేర్కొన్నారు."తమిళ ప్రేక్షకులు ఆయనను వద్దనుకోలేదు, కానీ చిరంజీవి ఇక్కడ సినిమాలు చేయడానికి పెద్దగా ఆసక్తి చూపించలేదు. బహుశా ఆయన తన సొంత పరిశ్రమలోనే 'రాజు' (King) గా ఉండాలని భావించి ఉండవచ్చు" అని కమల్ హాసన్ అన్నారు. చిరంజీవికి ఉన్న టాలెంట్ , మాస్ ఫాలోయింగ్‌కు ఆయన ఏ ఇండస్ట్రీకి వెళ్లినా అగ్రస్థానంలో నిలిచేవారని చెప్పుకొచ్చారు.

2 / 5
సినిమా రంగానికి భాషా సరిహద్దులు లేవని నిరూపించడంలో చిరంజీవి ఎప్పుడూ ముందుంటారని కమల్ హాసన్ అభినందించారు. ఇతర పరిశ్రమల హీరోలను, సాంకేతిక నిపుణులను ఆదరించడంలో చిరంజీవి చూపించే చొరవను ఆయన గుర్తుచేసుకున్నారు. ఒకరి విజయాన్ని చూసి మరొకరు అసూయపడకుండా, పరిశ్రమ ఎదుగుదలకు తోడ్పడటం తాము సీనియర్ నటుల నుంచి నేర్చుకున్నామని కమల్ చెప్పారు. ఈ ఇద్దరు దిగ్గజ నటుల మధ్య ఉన్న పరస్పర గౌరవం, స్నేహపూర్వక వాతావరణం నేటితరం హీరోలకు ఎంతో ఆదర్శదాయకమని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

3 / 5
దాదాపు 35-40 సంవత్సరాల క్రితం ఏఎన్‌ఆర్‌ను ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు, ఆయన తమిళంలో పలు సిల్వర్ జూబ్లీలు సాధించినప్పటికీ, అక్కడ తన ప్రస్థానాన్ని ఎందుకు కొనసాగించలేదని కమల్ హాసన్ ప్రశ్నించారు. అందుకు ఏఎన్‌ఆర్, "ఒక తుఫాను వచ్చిందయ్యా, దాని వల్ల నేను హైదరాబాద్‌కు వచ్చేశాను" అని బదులిచ్చారని తెలిపారు. ఆ తుఫాను శివాజీ గణేశన్ అని ఏఎన్‌ఆర్ వివరించారు. కమల్ హాసన్ ఈ విషయాన్ని శివాజీ గణేశన్‌కు చెప్పగా, ఆయన "వాడు చెప్తాడు. అంత స్నేహం నా... నాతో" అని పేర్కొన్నారు. ఇది వారిద్దరి మధ్య ఉన్న గాఢమైన స్నేహం, పరస్పర గౌరవాన్ని తెలియజేస్తుంది. వారు ఒకరినొకరు నువ్వు అని సంబోధించుకునే స్థాయి స్నేహాన్ని కలిగి ఉన్నారని కమల్ హాసన్ ఆశ్చర్యంగా వివరించారు.

4 / 5
కమల్ హాసన్ తన చిన్నతనంలో ఏఎన్‌ఆర్‌తో సహాయక డ్యాన్సర్‌గా పనిచేశారని, వారి నుండి విలువైన పాఠాలు నేర్చుకున్నారని పేర్కొన్నారు. శివాజీ గణేశన్ వంటి గొప్ప వ్యక్తులు ఎంత చిన్నవారైనా, సహోద్యోగులైనా ఎప్పుడూ వీడు అని కాకుండా కమల్ హాసన్ గారు అని, తన సొంత కొడుకు ప్రభును కూడా ప్రభు గారు అని సంబోధించే గౌరవాన్ని పాటించారని కమల్ హాసన్ గుర్తుచేసుకున్నారు. వ్యక్తికి స్థలం, గౌరవం ఇవ్వడం ఎంత ముఖ్యమో ఈ సంఘటనలు తెలియజేస్తాయని ఆయన చెప్పారు. చిరంజీవి విషయంలో కూడా, ఆయనకు ఏదైనా చేయగలిగే సామర్థ్యం ఉన్నప్పటికీ, తన సొంత రంగంలో ఆధిపత్యాన్ని ఎంచుకున్నారని కమల్ హాసన్ అన్నారు.

5 / 5
Follow Us