AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఖాకీ ఓవర్ యాక్షన్.. న్యాయం కోసం వస్తే అడవిలో వదిలేసిన ఎస్సై.. పోలీస్ స్టేషన్ ముట్టడించిన మహిళలు!

రక్షణ కల్పించాల్సిన ఖాకీలే బాధితుల పట్ల రాక్షసంగా ప్రవర్తిస్తే ఇక సామాన్యులకు దిక్కెవరు? ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటూ ప్రభుత్వం ఎంత చెబుతున్నా, క్షేత్రస్థాయిలో కొందరు అధికారుల ప్రవర్తన వల్ల పోలీస్ శాఖకే మచ్చ వస్తోంది. న్యాయం చేయాలని పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన ఒక వృద్ధురాలికి సంగారెడ్డి జిల్లా ఝరాసంగం పోలీస్ స్టేషన్‌లో ఘోర అవమానం ఎదురైంది. బాధితురాలిని ఆదుకోవాల్సిన ఎస్సై, ఆమెను నడి అడవిలో వదిలేసి రావడం స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. అసలేం జరిగిందంటే?:

ఖాకీ ఓవర్ యాక్షన్.. న్యాయం కోసం వస్తే అడవిలో వదిలేసిన ఎస్సై.. పోలీస్ స్టేషన్ ముట్టడించిన మహిళలు!
Sangareddy Police Controver
P Shivteja
| Edited By: |

Updated on: May 26, 2026 | 9:07 PM

Share

సంగారెడ్డి జిల్లా ఝరాసంగం పోలీస్ స్టేషన్‌లో ఎస్సై క్రాంతి కుమార్ మానవత్వం మరిచి ప్రవర్తించిన తీరు తీవ్ర కలకలం రేపింది. ఝరాసంగం మండలం ఎల్లోయి గ్రామానికి చెందిన నరసమ్మ అనే వృద్ధురాలు పొలం పనులకు వెళ్తుండగా కొందరు దుండగులు ఆమెపై దాడి చేశారు. ఆమె మెడలోని బంగారు గొలుసు, వెండి ఆభరణాలను లాక్కొని పారిపోయారు. ఈ చైన్ స్నాచింగ్ ఘటనపై ఫిర్యాదు చేసేందుకు నరసమ్మ పోలీస్ స్టేషన్‌కు రాగా, ఎస్సై క్రాంతి కుమార్ వింతగా ప్రవర్తించారు. అసలు దొంగతనమే జరగలేదంటూ బాధితురాలితో వాదనకు దిగారు.

అంతటితో ఆగకుండా, ఘటన జరిగిన స్థలాన్ని చూపిస్తానంటూ వృద్ధురాలిని విచారణ పేరుతో పోలీస్ వాహనంలో ఎక్కించుకొని వెళ్లారు. కానీ, ఘటనా స్థలానికి సమీపంలో ఉన్న దట్టమైన అడవి ప్రాంతానికి తీసుకెళ్లి, ఆమె మాట వినకుండా నడి అడవిలోనే వదిలేసి ఎస్సై తిరిగొచ్చారు. దిక్కుతోచని స్థితిలో ఆ వృద్ధురాలు అడవిలో ఒంటరిగా కన్నీరు పెట్టుకుంటూ, ఎలాగోలా కాలినడకన గ్రామానికి చేరుకుంది.

ఎస్సై చేసిన ఈ అమానుష చర్య గురించి తెలుసుకున్న ఎల్లోయి గ్రామ మహిళలు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. బాధితురాలికి న్యాయం చేయాలని, ఎస్సై క్రాంతి కుమార్ తీరుపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ భారీ సంఖ్యలో మహిళలు ఝరాసంగం పోలీస్ స్టేషన్‌ను ముట్టడించారు. స్టేషన్ ముందు రోడ్డుపై బైఠాయించి ధర్నాకు దిగడంతో గంటల తరబడి ట్రాఫిక్ స్తంభించిపోయింది.

ఇవి కూడా చదవండి

తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల అనంతరం ఎట్టకేలకు స్థానిక పోలీసులు దిగొచ్చారు. వృద్ధురాలి నుంచి ఫిర్యాదు స్వీకరించి, కేసు నమోదు చేయడంతో మహిళల ఆందోళన తాత్కాలికంగా ముగిసింది. బాధితుల పట్ల ఇంత దురుసుగా ప్రవర్తించిన ఎస్సైపై ఉన్నతాధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఖాకీ ఓవర్ యాక్షన్.. న్యాయం కోసం వస్తే అడవిలో వదిలేసిన ఎస్సై..
ఖాకీ ఓవర్ యాక్షన్.. న్యాయం కోసం వస్తే అడవిలో వదిలేసిన ఎస్సై..
లక్ష్మీదేవిని దూరం చేసి దరిద్రాన్ని తెచ్చే పెద్ద తప్పు ఇదే!
లక్ష్మీదేవిని దూరం చేసి దరిద్రాన్ని తెచ్చే పెద్ద తప్పు ఇదే!
ఫేమస్ అయ్యేందుకు రోడ్లపై స్టంట్స్ చేస్తూ రెచ్చిపోయాడు..కట్‌చేస్తే
ఫేమస్ అయ్యేందుకు రోడ్లపై స్టంట్స్ చేస్తూ రెచ్చిపోయాడు..కట్‌చేస్తే
రూ.200 కోట్లకు పైగా ఆస్తులు.. సొంతంగా ప్రైవేట్ జెట్..
రూ.200 కోట్లకు పైగా ఆస్తులు.. సొంతంగా ప్రైవేట్ జెట్..
చరిత్ర సృష్టించిన కోహ్లీ.. ఐపీఎల్ హిస్టరీలోనే ఎవరికీ సాధ్యంకాదు..
చరిత్ర సృష్టించిన కోహ్లీ.. ఐపీఎల్ హిస్టరీలోనే ఎవరికీ సాధ్యంకాదు..
ఈద్ స్పెషల్ ధమాకా.. నోరూరించే మటన్ ధమ్ బిర్యానీ..
ఈద్ స్పెషల్ ధమాకా.. నోరూరించే మటన్ ధమ్ బిర్యానీ..
ఆరోజు విజయ్, నేను చనిపోయేవాళ్లం.. షాకింగ్ విషయం చెప్పిన విలన్
ఆరోజు విజయ్, నేను చనిపోయేవాళ్లం.. షాకింగ్ విషయం చెప్పిన విలన్
అరటి తొక్కతో అందం రెట్టింపు! ఇలా వాడితే వారం రోజుల్లోనే మిరాకిల్
అరటి తొక్కతో అందం రెట్టింపు! ఇలా వాడితే వారం రోజుల్లోనే మిరాకిల్
కష్టం విలువ తెలిసినోడు సార్.. డబ్బుకు ఆశ పడడు..!
కష్టం విలువ తెలిసినోడు సార్.. డబ్బుకు ఆశ పడడు..!
ఒకేసారి ఏడు గ్రహాలు.. వీరికి ఇక వాయింపే వాయింపు
ఒకేసారి ఏడు గ్రహాలు.. వీరికి ఇక వాయింపే వాయింపు