AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Soaked Raisins: నానబెట్టిన కిస్మిస్‌ ఖాళీ కడుపుతో తింటే, శరీరంలో జరిగేది అద్భుతం! నలుపు వర్సెస్ పసుపు.. ఏది ఎక్కువ పవర్‌ఫుల్?

రాత్రిపూట నానబెట్టిన కిస్‌మిస్‌లను ఉదయం పరగడుపున తినడం వల్ల శరీరానికి అద్భుతమైన పోషకాలు లభిస్తాయి. నానబెట్టడం వల్ల కిస్‌మిస్ పైపొరలోని విటమిన్లు, ఖనిజాలు నీటిలో కరిగి, శరీరం వాటిని సులభంగా గ్రహిస్తుంది. మార్కెట్లో దొరికే పసుపు (బంగారు), నల్ల కిస్‌మిస్‌లలో ఏది ఆరోగ్యానికి మంచిదనే ప్రశ్న చాలామందిలో ఉంటుంది. మీరు కూడా ఇదే సందేహంలో ఉన్నట్టయితే.. మీ కోసమే ఈ సమాచారం..

Jyothi Gadda
|

Updated on: May 26, 2026 | 5:18 PM

Share
డ్రై ఫ్రూట్స్‌లో కిస్‌మిస్ (ఎండుద్రాక్ష)ను చాలామంది ఇష్టంగా తింటుంటారు. ఇందులో ఐరన్, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అయితే, కిస్‌మిస్‌లను పచ్చిగా తినడం కంటే, రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయాన్నే పరగడుపున తినడం వల్ల రెట్టింపు ప్రయోజనాలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. నానబెట్టడం వల్ల వాటిలోని పోషకాలను శరీరం త్వరగా గ్రహిస్తుంది. కానీ, మార్కెట్లో లభించే నల్ల కిస్‌మిస్, పసుపు కిస్‌మిస్‌లలో ఏది ఆరోగ్యానికి ఎక్కువ మేలు చేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.

1 / 5
కిస్‌మిస్‌లో ఐరన్ అధికంగా ఉంటుంది, ఇది శరీరంలో ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని పెంచి ఎనీమియా (రక్తహీనత) రాకుండా కాపాడుతుంది. నానబెట్టిన కిస్‌మిస్‌లలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది సహజ విరేచనకారిగా (Laxative) పనిచేసి మలబద్ధకం సమస్యను దూరం చేస్తుంది. ఇందులో ఉండే పొటాషియం శరీరంలోని ఉప్పు (సోడియం) శాతాన్ని సమతుల్యం చేసి, రక్తపోటును నియంత్రణలో ఉంచుతుంది.

2 / 5
నల్ల కిస్‌మిస్ (Black Raisins): ఇవి నలుపు లేదా ఎరుపు ద్రాక్షలను నేరుగా ఎండలో ఎండబెట్టడం ద్వారా తయారవుతాయి. ఎలాంటి రసాయనాలు వాడకపోవడం వల్ల వీటిలో యాంటీఆక్సిడెంట్లు (ఆంథోసైనిన్స్), ఐరన్ మరియు ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటాయి. రక్తహీనత ఉన్నవారికి, జుట్టు రాలడం తగ్గడానికి మరియు రోగనిరోధక శక్తి పెరగడానికి నల్ల కిస్‌మిస్ అత్యంత శక్తివంతమైనదిగా పనిచేస్తుంది.

3 / 5
పసుపు కిస్‌మిస్ (Yellow/Golden Raisins): వీటిని రంగు మారకుండా ఉండటానికి సల్ఫర్ డయాక్సైడ్‌తో ట్రీట్ చేస్తారు. ఇవి మరింత మెత్తగా, తియ్యగా ఉంటాయి. జీర్ణక్రియను మెరుగుపరచడానికి, బ్లడ్ షుగర్ లెవల్స్ బ్యాలెన్స్ చేయడానికి, థైరాయిడ్ స్థాయిలను అదుపులో ఉంచడానికి ఇవి సహాయపడతాయి.

4 / 5
పోషకాల సాంద్రత, ఐరన్, యాంటీఆక్సిడెంట్ల పరంగా చూస్తే పసుపు కిస్‌మిస్ కంటే నల్ల కిస్‌మిస్ ఎక్కువ శక్తివంతమైనదిగా నిపుణులు భావిస్తారు. అయితే, రెండు రకాల కిస్‌మిస్‌లు కూడా ఆరోగ్యానికి మేలు చేస్తాయి. కాబట్టి, మీ అవసరాన్ని బట్టి రెండింటినీ మితంగా డైట్‌లో చేర్చుకోవడం మంచిది.

5 / 5
Follow Us
సీన్‌ సక్సెస్‌తో హ్యాట్రిక్‌ హిట్‌ కొట్టిన సూర్య

డిసెంబర్‌ 4న బాలీవుడ్‌ బాక్సాఫీస్‌ దగ్గర భారీ క్లాష్‌

12 ఏళ్ల తర్వాత తమిళంలో రీఎంట్రీ ఇచ్చిన నజ్రియా

మీకు నచ్చినట్లు మార్చేస్తారా? " రామాయణ" మేకర్స్ పై ముఖేష్ ఖన్నా
మీకు నచ్చినట్లు మార్చేస్తారా?
బాసర ట్రిపుల్ ఐటీలో మురుగునీటి కలకలం..చర్మవ్యాధులతో విద్యార్థులు

ఇంటి కిటికీకి చుట్టుకుని కూర్చున్న భారీ కొండచిలువ..!

ఏపీ ప్రజలకు సంక్రాంతి కానుక.. తక్కువ ధరకే 3 నిత్యావసర సరుకులు!

బంగాళాఖాతంలో మళ్లీ అలజడి..ఏపీకి మళ్లీ తుఫాన్ ముప్పు..

ఆన్‌లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేస్తున్నారా? ఇది చూస్తే ఛీ యాక్ అంటారు

అమ్మో నడక మార్గంలో భారీ కొండ చిలువ.. చూస్తే వణకాల్సిందే వీడియో