OTT Movie: ఊరి పెద్దను ఎవరు హత్య చేశారు? ఓటీటీలో మైండ్ బ్లాక్ అయ్యే క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ చూడొచ్చు
థియేటర్లలో విడుదలైన సినిమాలు ఓటీటీలో ఎప్పుడు వస్తాయో అని ఆడియెన్స్ ఎదురు చూస్తుంటారు. ఈ మధ్యన మూవీ లవర్స్ ఎక్కువగా క్రైమ్, సస్పెన్స్, హారర్, థ్రిల్లర్ సినిమాలపైనే ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం మనం మాట్లాడుకోబోయే సినిమా కూడా సరిగ్గా ఇదే కోవకు చెందుతుంది.

ఇటీవల కన్నడ నాట ఒక క్రైమ్ థ్రిల్లర్ మూవీ విడుదలైంది. ఏప్రిల్ 11న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా అక్కడి ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా ఈ సినిమాలోని క్రైమ్ డ్రామా, ట్విస్టులు ఆడియెన్స్ ను థ్రిల్ కు గురి చేశాయి. దీంతో బాక్సాఫీస్ వద్ద ఈ సినిమాకు భారీ వసూళ్లు వచ్చాయి. 25 ఏళ్లుగా అసలు నేరాలే జరగని ఒక ఊరిలో అనుమానాస్పద రీతిలో ఓ వ్యక్తిని చంపేస్తే ఏమైందనే కాన్సెప్ట్ తో ఈ సినిమాను తెరకెక్కించారు మేకర్స్. ఈ సినిమా కథ విషయానికి వస్తే.. ఒక ఊరిలో గత 25 ఏళ్లుగా ఒక్క క్రైమ్ కూడా జరగదు. అలాంటి ఊరికి గోవిందు అనే పోలీస్ బదిలీపై వస్తాడు. ఇక అంతా ప్రశాంతంగా ఉంది అనుకున్న సమయంలో ఆ ఊరి పెద్ద దారుణ హత్యకు గురవుతాడు. పోలీసు గోవింద్ పంకజ, రోహిత్, శ్రీనివాసయ్య అనే ముగ్గురిపై అనుమానం వ్యక్తం చేస్తాడు. మరి ఈ ముగ్గురే ఊరి పెద్దను హత్య చేశారా? ఇంతకీ హంతకుడు ఎవరు? 1970లో ఇదే ఊరిలో జరిగిన సంఘటనకు ఈ హత్యకు సంబంధమేంటి? అనేది తెలుసుకోవాలంటే ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీ చూడాల్సిందే.
ఇప్పటివరకు మనం మాట్లాడుకున్న సినిమా పేరు అజ్ఞాతవాసి. ప్రముఖ దర్శకుడు హేమంత్ రావు నిర్మించిన ఈ సినిమాలో రంగాయణ రఘు, సిద్దు మూలిమణి, శరత్ లోహితాశ్వ, పవన గౌడ, రవిశంకర్ గౌడ్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. జనార్ధన్ చిక్కన్న దర్శకత్వం వహించారు. ఐఎమ్‌డీబీలో ఈ మూవీ 8.6 రేటింగ్‌ను సొంతం చేసుకుంది. థియేటర్లలో సూపర్ హిట్ గా నిలిచిన అజ్ఞాతవాసి సినిమా ఇప్పుడు OTTలోకి వస్తోంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ Zee5 దీని గురించి సమాచారాన్ని అందించింది.
తెలుగులోనూ స్ట్రీమింగ్..
🎬 #Agnyathavasi –A Tale of Guilt and Forgiveness
Just came back from watching #Agnyathavasi ,a Kannada philosophical thriller set in the serene Malenadu region during the late 1990s. Here’s my detailed take 👇
📌 Plot:
Set in the quiet village of Nalkeri in Malenadu,… pic.twitter.com/LqCOhIcUzw
— Nithish KN (@Nithish_017) April 13, 2025
సాధారణంగా ఓటీటీల్లో సినిమాలు వారాంతాల్లో ప్రసారం అవుతాయి. అయితే, ‘అజ్ఞాతవాసి’ సినిమా బుధవారం (మే 28) నుంచి స్ట్రీమింగ్ కు రానుంది. కాగా ఈ సినిమా థియేటర్లలో విడుదలైన ఏడు వారాల తర్వాత OTTకి వస్తోంది. ఇది ZEE5, నిర్మాతల మధ్య ఒప్పందం కావచ్చునని తెలుస్తోంది.
Kannada film #Agnyathavasi (2025) by @Janardhan_11, premieres May 28th on @ZEE5India.#RangayanaRaghu @GowdaPaavana @sidmoolimani #SharathLohithaswa @hemanthrao11 @Prachura1 @charanrajmr2701 @pramodm271 #BharathGB @MrHydur @films_kumar @The_Biglittle @saregamasouth pic.twitter.com/ox28igk802
— CinemaRare (@CinemaRareIN) May 17, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








