OTT Movie: యూట్యూబ్‌లోకి వచ్చేసిన లేటెస్ట్ తెలుగు థ్రిల్లర్ మూవీ.. ఫ్రీగా చూసేయండి
సాధారణంగా సినిమాలు యూట్యూబ్ లోకి రావాలంటే చాలా సమయం పడుతుంది. అయితే ఈ మూవీ థియేటర్లలో విడుదలైన రెండు నెలలకే యూట్యూబ్ లోకి వచ్చేసింది. కాబట్టి ఓటీటీ సబ్ స్క్రిప్షన్ లేని వారు యూట్యూబ్ లో ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీని ఫ్రీగా చూడవచ్చు.

ప్రముఖ టాలీవుడ్ కొరియోగ్రాఫర్ కమ్ దర్శకుడు అమ్మ రాజశేఖర్ తన కుమారుడు అమ్మ రాగిన్ రాజ్ హీరోగా పరిచయం చేస్తూ ఈ సినిమాను తెరకెక్కించాడు. అంకిత నస్కర్ హీరోయిన్‌గా యాక్ట్ చేసింది. రోహిత్, ఎస్తర్ నోరోన్హా, సత్యం రాజేష్, అజయ్, ముక్కు అవినాష్, రాజీవ్ కనకాల, ఇంద్రజ తదితరులు కీలకపాత్రలో నటించారు. శ్రీనివాస్ గౌడ్ నిర్మాతగా వ్యవహరించారు. కంటెంట్ బాగుండడంతో ఈ మూవీలో రెండు పాటలకు తమన్ మ్యూజిక్ అందించడం విశేషం. ఈ ఏడాది ఫిబ్రవరిలో థియేటర్లలో విడుదలైన ఈ సినిమా యావరేజ్ గా నిలిచింది. కంటెంట్ పరంగా ఈ మూవీ ప్రశంసలు అందుకుంది. ఆ తర్వాత ఓటీటీలోనూ ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం ఈ సినిమా ఇప్పటికే అమెజాన్ ప్రైమ్‌ల వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. మొదట్లో అద్దె ప్రాతిపదికన అందుబాటులో ఉన్న ఈ చిత్రం ప్రస్తుతం ఉచితంగానే స్ట్రీమింగ్ అవుతుంది. కాగాఇప్పుడీ సినిమా యూట్యూబ్‌లోకి కూడా వచ్చింది. అమెజాన్ ప్రైమ్ సబ్ స్క్రిప్షన్ ప్లాన్ లేకుంటే యూట్యూబ్‌లో ఈ సినిమాను ఉచితంగా చూసేయవచ్చు.
ఈ సినిమా పేరు తల. మదర్ సెంటిమెంట్‌కు యాక్షన్, థ్రిల్లింగ్ అంశాలు జోడించి ఈ సినిమాను తెరకెక్కించాడు అమ్మ రాజ శేఖర్. సినిమా కథ విషయానికి వస్తే.. హీరో రాగిన్ రాజ్ తల్లి అనారోగ్యంతో మంచాన పడుతుంది. ఆమె కోరిక మేరకు హీరో తండ్రి కోసం వెతుక్కుంటూ వెళ్తాడు. ఈ క్రమంలో అతనికి పలు ఇబ్బందులు ఎదురవుతాయి. వాటిని దాటుకుని ఎట్టకేలకు తండ్రిని కలుస్తాడు. తానేవరో చెప్పకుండా తండ్రికి దగ్గరవుతాడు. అయితే తండ్రిని కలిసిన తర్వాత హీరో జీవితంలో అనుకోని సంఘటనలు చోటు చసుకుంటాయి. మరి హీరో తల్లిదండ్రులు ఎందుకు విడిపోయారు? తండ్రిని తీసుకొస్తానని తల్లికి ఇచ్చిన మాటను హీరో ఎలా నిలబెట్టుకున్నాడు? హీరో ప్రేమించిన అమ్మాయి ఎవరు? అసలు హీరో తల్లిదండ్రులు కలుస్తారా? అనే ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే తల సినిమాను చూడాల్సిందే.
యూట్యూబ్ లో తల సినిమా..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.