- Telugu News Photo Gallery Cinema photos Allu Sneha Reddy shares photos of memorable moments from April
జ్ఞాపకాల తోటలో..ఏప్రిల్ మెమోరీస్ అంటూ ఫొటోలు షేర్ చేసిన అల్లు స్నేహ!
ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే వారిలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి ఒకరు. ఈ బ్యూటీ ఎప్పుడూ తన ఫ్యామిలీకి సంబంధించిన ఫొటోలను నెట్టింట్లో షేర్ చేస్తూ తెగ సందడి చేస్తుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ ఏప్రిల్ నెలలో మెమొరబుల్ మూమెంట్స్ అంటూ కొన్ని ఫొటోలు షేర్ చేసింది. అవి తన అభిమానులను తెగ ఆకట్టుకుంటున్నాయి. మరి మీరు కూడా ఆ ఫొటోస్ పై ఓ లుక్ వేయండి.
Updated on: May 19, 2025 | 1:54 PM

అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రాజకీయ నాయురాలి కూతురుగా కంటే, అల్లు అర్జున్ భార్యగా మంచి ఫేమ్ సంపాదించుకుంది. బన్నీ, స్నేహా ఇద్దరు ప్రేమించుకొని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. బంధువుల వివాహంలో ఇద్దరి మధ్య మాటలు కలవడం తర్వాత స్నేహం పెరిగి, ప్రేమగా మారింది. దీంతో ఇరు కుటుంబాల అంగీకారంతో ఘనంగా వివాహం చేసుకున్నారు. అంతే కాకుండా వీరిద్దరు ఎప్పుడూ అన్యోన్యంగా ఉంటారు.

ఇక వీరికి ఓ కూతురు అర్హ, కుమారుడు అయాన్ ఉన్న విషయం తెలిసిందే. స్నేహ తన పిల్లలను, కుంటుంబాన్ని బాగా చూసుకుంటూ ఉంటుంది. అంతే కాకుండా నిత్యం సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. అలాగే స్టార్ హీరోయిన్లుకు ధీటుగా ఫొటో షూట్ చేస్తూ.. తన అందంతో అభిమానులకు గ్లామర్ ట్రీట్ ఇస్తుంది.

ఇక ఎక్కువగా స్నేహా రెడ్డి తన కూతురు, కొడుకు, లేదా అల్లు అర్జున్‌తో వెకేషన్ ఎంజాయ్ చేసిన ఫొటోలను షేర్ చేస్తుంది. కానీ తాజాగా ఈ ముద్దుగుమ్మ ఏప్రిల్ నెలలో తాను ఎంజాయ్ చేసిన మూమెంట్స్ ను ఫొటోల రూపంలో తన అభిమానులతో పంచుకుంది. అందులో తన ఫ్యామిలీతో గడిపిన జ్ఞాపకాలను గుర్తు చేసుకుంది.

అందులో స్నేహ వివాహ వేడుకకు హాజరై పసుపు దంచుతున్న ఫొటోలను, అలాగే తన కూతురు అర్హ, అయాన్‌తో కలిసి పెళ్లికి వెళ్లి న ఫొటోలను షేర్ చేసింది. అంతే కాకుండా సంప్రదాయ దుస్తులు ధరించి.. అల్లు అర్జున్, అయాన్, అర్హ, తన ఫొటోలను కూడా ఈ బ్యూటీ షేర్ చేసింది.

అంతే కాకుండా తన తల్లి పుట్టిన రోజు వేడుకలు చేస్తూ ఉన్న ఫొటొలను, బన్నీతో ఎంజాయ్ చేస్తున్న డేట్ నైట్ ఫొటో, అదే విధంగా అయాన్, అర్హ తన స్నేహితులతో ఉన్న ఫొటోలను స్నేహ రెడ్డి షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి.



