Ketika Sharma: అరె ఏంట్రా ఇది.. హిట్టుకొట్టినా రానీ ఆఫర్స్.. అమ్మాడికి కలిసిరాని అదృష్టం..
టిక్ టాక్, రీల్స్, షార్ట్ ఫిల్మ్స్ ద్వారా ఫేమస్ అయిన కేతిక.. ఆ తర్వాత పూరి తెరకెక్కించిన రొమాంటిక్ సినిమాతో తెలుగు తెరకు పరిచమయైంది. మొదటి సినిమాతోనే అందరి దృష్టి కట్టిపడేసిన ఈ ముద్దుగుమ్మ.. ఫస్ట్ మూవీ మాత్రం సక్సెస్ కాలేదు. కానీ టాలీవుడ్ ఇండస్ట్రీలో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. తాజాగా కెరీర్ లో మొట్ట మొదటి హిట్టు అందుకుంది ఈ వయ్యారి.
Updated on: May 18, 2025 | 7:57 PM

రొమాంటిక్ సినిమాతోనే తెలుగు తెరకు పరిచయమై అందరి దృష్టిని ఆకర్షించింది కేతిక శర్మ. తొలి చిత్రంతోనే మంచి మార్కులు కొట్టేసింది.. కానీ ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద అంతగా సక్సెస్ కాలేదు. అయినా ఆఫర్స్ మాత్రం క్యూ కట్టాయి.

గ్లామర్ షోతో కుర్రాళ్లను ఫిదా చేసిన ఈ అమ్మడు.. ఆ తర్వాత నాగ శౌర్య సరసన లక్ష్య, రంగ రంగ వైభవంగా, బ్రో సినిమాల్లో అవకాశాలు అందుకుంది. కానీ ఈ మూడు సినిమాలో బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్స్ అయ్యాయి.

దీంతో ఇండస్ట్రీలో ఈ అమ్మడుకు అవకాశాలు తగ్గిపోయాయి. నెమ్మదిగా సినీరంగంలో సైలెంట్ అయ్యింది ఈ వయ్యారి. కానీ ఇటీవలే సింగిల్ మూవీతో భారీ హిట్టుకొట్టింది ఈ ముద్దుగుమ్మ. ఇందులో ఇవానా సైతం కథానాయికగా నటించింది.

శ్రీవిష్ణు, ఇవానా, కేతిక శర్మ ప్రధాన పాత్రలు పోషించిన సింగిల్ సినిమాకు సూపర్ హిట్ రెస్పాన్స్ వచ్చింది. దీంతో కెరీర్ లో మొట్ట మొదటి హిట్టు అందుకుని ఫుల్ జోష్ మీదుంది కేతిక.

అయితే ఈ అమ్మడుకు తెలుగులో అంతగా ఆఫర్స్ రావడం లేదని.. ప్రస్తుతం కేతిక సరైన ఛాన్స్ కోసం ఎదురుచూస్తుందని సమాచారం. సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటూ నిత్యం లేటేస్ట్ ఫోటోస్ షేర్ చేస్తుంది.




