AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jr NTR: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌ బర్త్ డే .. ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. ఇలా చేశారేంటి?

టాలీవుడ్ యంగ్ టైగర్, గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ ఈనెల 20న తన పుట్టినరోజు జరుపుకోనున్నారు. తమ అభిమాన హీరో బర్త్ డేను గ్రాండ్ గా సెలబ్రేట్ చేయడానికి ఫ్యాన్స్ అప్పుడే ప్రణాళికలు రచిస్తున్నారు. అయితే ఇంతలోనే వారికి ఒక షాకింగ్ న్యూస్ తెలిసింది.

Jr NTR: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌ బర్త్ డే .. ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. ఇలా చేశారేంటి?
Jr Ntr's Birthday
Basha Shek
|

Updated on: May 18, 2025 | 5:10 PM

Share

స్టార్ హీరోల పుట్టిన రోజుల సందర్భంగా సినిమా బృందాలు అప్‌డేట్‌లను అందిస్తాయి. వీటి కోసం అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. అలా ఇప్పుడు ఎన్టీఆర్ అభిమానులు తమ హీరో కొత్త సినిమా అప్డేట్స్ కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే వార్ 2 సినిమా నుంచి గ్లింప్స్ లేదా టీజర్ రిలీజ్ కావొచ్చిని అధికారికంగా అప్డేట్ వచ్చింది. దీంతో పాటు ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా , ప్రశాంత్ నీల్ తో సినిమా అప్డేట్ కోసం కూడా అభిమానులు ఎదురు చూస్తున్నారు. అయితే ఇంతలోనే వారికి నిర్మాణ సంస్థ షాకింగ్ న్యూస్ చెప్పింది. ప్రశాంత్ నీల్ – జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా నుంచి ఎలాంటి గ్లింప్స్ విడుదల చేయబోమని ‘మైత్రి మూవీ మేకర్స్’ సంస్థ ప్రకటించింది. దీనికి కారణం కూడా వారు వివరించారు. ‘ఇది పూర్తిగా ‘వార్‌ 2’ టైమ్‌.. మేం ఈ సినిమాను గౌరవిస్తున్నాం. మన మారణహోమాన్ని ప్రారంభించే ముందు.. దీన్ని సెలబ్రేట్‌ చేసుకుందాం. మన మాస్‌ మిస్సైల్‌ను సరైన సమయంలో విడుదల చేద్దాం. ఈ పుట్టినరోజును ‘వార్ 2’తో చేసుకోండి’ అంటూ అభిమానులను ఉద్దేశించి పోస్ట్‌ పెట్టింది మైత్రీ మూవీ మేకర్స్. దీంతో ప్రశాంత్‌నీల్‌ మూవీ నుంచి అప్‌డేట్‌ లేదని క్లారిటీ వచ్చేసింది.

ప్రశాంత్ నీల్, జూనియర్ ఎన్టీఆర్ కాంబోలో తెరకెక్కుతోన్న చిత్రానికి ఇంకా టైటిల్ ఖరారు కాలేదు. అయితే డ్రాగన్ అనే పేరు ఎక్కువగా వినిపిస్తోంది. ఇది పూర్తి యాక్షన్ సినిమాగా ఉంటుంది. శరవేగంగా షూటింగ్ జరుపుకొంటోన్న ఈమూవీ జూన్ 25, 2026న థియేటర్లలో విడుదల అవుతుంది. జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తెలుగుతో పాటు కన్నడ, తమిళం, హిందీ, మలయాళం వంటి భాషల్లో పాన్ ఇండియా రేంజ్ లో ఈ మూవీ విడుదల కానుంది. ఈ సినిమాలో రుక్మిణీ వసంత్ హీరోయిన్ గా నటిస్తోంది.

ఇవి కూడా చదవండి

మైత్రీ మూవీ మేకర్స్ ట్వీట్..

మైత్రి మూవీ మేకర్స్’, ‘ఎన్టీఆర్ ఆర్ట్స్’ బ్యానర్లపై కళ్యాణ్ రామ్ నందమూరి, నవీన్ యెర్నేని, రవిశంకర్ యల్మంచిలి, హరికృష్ణ కొసరాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్, టి-సిరీస్ ఫిల్మ్స్ సమర్పిస్తున్నారు. భువన్ గౌడ ఫోటోగ్రఫీ చేస్తున్నారు. రవి బస్రూర్ సంగీత దర్శకత్వం వహిస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

మంగ్లీ పై తెలంగాణవాదులు ఆగ్రహం
మంగ్లీ పై తెలంగాణవాదులు ఆగ్రహం
గోళ్లలో మీ ఆయుష్షు రహస్యం.. ఎంత కాలం జీవిస్తారో సింపుల్‌గా ఇలా..
గోళ్లలో మీ ఆయుష్షు రహస్యం.. ఎంత కాలం జీవిస్తారో సింపుల్‌గా ఇలా..
ప్రపంచంలోనే అరుదైన పువ్వు..పేరు శవం.. 9 నెలలు మొగ్గగా ఉండి చివరకు
ప్రపంచంలోనే అరుదైన పువ్వు..పేరు శవం.. 9 నెలలు మొగ్గగా ఉండి చివరకు
విశాఖలో హ్యాట్రిక్ రికార్డులు బ్రేక్ చేయనున్న కింగ్ కోహ్లీ
విశాఖలో హ్యాట్రిక్ రికార్డులు బ్రేక్ చేయనున్న కింగ్ కోహ్లీ
వెస్ట్రన్ టాయిలెట్ ఇంట్లో ఉందా?.. ఈ పొరపాట్లు చేయకండి..
వెస్ట్రన్ టాయిలెట్ ఇంట్లో ఉందా?.. ఈ పొరపాట్లు చేయకండి..
శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా