Actress Trisha : త్రిష కంటే చిన్నదే.. కానీ ఆమెకే తల్లి పాత్ర.. ఈ కిర్రాక్ హీరోయిన్ ఎవ్వరో తెలుసా
ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ త్రిష. దాదాపు రెండు దశాబ్దాలుగా సినీరంగంలో వరుస సినిమాలతో దూసుకుపోతుంది. ఇన్నాళ్లు ఇండస్ట్రీని ఏలేస్తున్న త్రిష.. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లోనూ చేతినిండా సినిమాలతో బిజీగా ఉంటుంది. కానీ ఇప్పుడు ఈ బ్యూటీ గురించి ఆసక్తికర విషయం ఫిల్మ్ వర్గాల్లో వైరలవుతుంది.

సినీరంగుల ప్రపంచంలో హీరోయిన్లుగా గుర్తింపు తెచ్చుకోవాలనుకుంటారు. ఒక్క సినిమాతోనే రాత్రికి రాత్రే స్టార్ గా మారిన హీరోయిన్స్.. ఆ తర్వాత వెంటనే ఫేడౌట్ అవుతుంటారు. ఒకటి రెండు చిత్రాలతో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న హీరోయిన్స్.. ఆ తర్వాత వయసుకు తగిన పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే హీరోయిన్ సైతం ఆడపాదడపా చిత్రాల్లో కథానాయికగా నటించింది. కానీ చిన్న వయసులోనే తల్లి పాత్రలు పోషిస్తూ సినీప్రియులను అలరిస్తుంది. ఈ హీరోయిన్ త్రిష కంటే చిన్న అమ్మాయి. ఇంతకీ ఆమె ఎవరో తెలుసుకుందామా.. ? దాదాపు రెండు దశాబ్దాలుగా వరుస సినిమాలతో అలరిస్తుంది హీరోయిన్ త్రిష. 1999లో విడుదలైన జోడి సినిమాలో చిన్న పాత్రతో సినీప్రయాణం స్టార్ట్ చేసింది.
ఆ తర్వాత సౌత్ ఇండస్ట్రీలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. ఇప్పుడు 42 ఏళ్ల వయసులోనూ చేతినిండా సినిమాలతో బిజీగా ఉంది. ఇప్పుడు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషలలో వరుస సినిమాల్లో నటిస్తుంది. ఇటీవలే గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న త్రిష.. ప్రస్తుతం కమల్ హాసన్ సరసన థగ్ లైఫ్ చిత్రంలో నటిస్తుంది. మణిరత్నం దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో శింబు, త్రిష, అభిరామి కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం జూన్ 5న థియేటర్లలో విడుదల కానుంది. అయితే ఈ సినిమాలో నటిస్తున్న అభిరామి త్రిష కంటే సీనియర్. 1995లో ‘కథాపురుషన్’ చిత్రంలో చైల్డ్ ఆర్టిస్టుగా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత హీరోయిన్ గా రాణించింది.
అయితే త్రిష ఇప్పటికీ హీరోయిన్ గా వరుస సినిమాల్లో నటిస్తుంది. ఇప్పుడు థగ్ లైఫ్ సినిమాలో తల్లి పాత్రలో నటిస్తుంది అభిరామి. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. అభిరామి త్రిష కంటే వయసులో చిన్నది. త్రిష మే 4, 1983న జన్మించింది. ఆమె వయసు ప్రస్తుతం 42 సంవత్సరాలు. ఇక అభిరామి జూలై 1983లో జన్మించింది. ఇప్పుడు ఆమె వయసు 41 సంవత్సరాలు. త్రిష కంటే వయసులో చిన్న అమ్మాయి.. కానీ ఇప్పుడు త్రిషకు తల్లి పాత్రలో నటిస్తుంది.
View this post on Instagram
ఇవి కూడా చదవండి :
Genelia : ఆ ఒక్కటి తినడం మానేసిందట.. 37 ఏళ్ల వయసులో జెనీలియా ఫిట్నెస్ రహాస్యం ఇదే..
Tollywood: రస్నా యాడ్లో కనిపించిన ఈ చిన్నారి రాజమౌళీ సినిమాలో హీరోయిన్.. ఇంతకీ ఎవరీ బ్యూటీ..?
Suriya : 100 రోజుల్లోనే సిక్స్ ప్యాక్.. 49 ఏళ్ల వయసులో కుర్రాడిలా సూర్య.. డైట్ ప్లాన్ చెప్పిన హీరో..




