Rohini: సొంతింటి కలను సాకారం చేసుకున్న రోహిణి.. లగ్జరీ విల్లా కొనేసిన జబర్దస్త్ నటి .. ఎన్నికోట్లో తెలుసా?
జబర్దస్త్ టీవీ షో తో మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో లేడీ కమెడియన్ రోహిణీ ఒకరు. బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షోలోనూ సందడి చేసిన ఆమె ప్రస్తుతం పలు టీవీ షోలతో బిజి బిజీగా ఉంటోంది. అలాగే సినిమాలు, వెబ్ సిరీసుల్లోనూ మెరుస్తోంది.

ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న ది బెస్ట్ లేడీ కమెడియన్లలో రోహిణి ముందు వరుసలో ఉంటుంది. జబర్దస్త్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆమె ఏకంగా రెండు సార్లు బిగ్ బాస్ రియాలిటీ షోలో సందడి చేసింది. అయితే మొదటిసారి కంటే రెండోసారి బిగ్‌బాస్ ఛాన్స్ వల్ల రోహిణికి మరింత ఫేమ్, పాపులారిటీ వచ్చింది. గతేడాది బిగ్‌బాస్ సీజన్‌లో వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చింది రోహిణి. బిగ్ బాస్ 8వ సీజన్‌లో దాదాపు 9 వారాల పాటు హౌస్‌లో ఉండి బుల్లితెర ఆడియెన్స్ ను అలరించింది. అలాగే తన ఆట, మాట తీరుతో మరెంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. ఇందుకు గాను ఆమెకు సుమారు రూ. 18 లక్షల వరకు పారితోషికం అందిందని సమాచారం. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత రోహిణి మరింత బిజీగా మారిపోయింది. వరుసగా టీవీ షోస్, ప్రోగ్రామ్స్ చేస్తోన్న ఆమె మరోవైపు అప్పుడప్పుడు సినిమాలు, వెబ్ సిరీసుల్లోనూ కనిపిస్తోంది. మొత్తానికి ఈ మధ్యన బాగానే సంపాదిస్తోన్న రోహిణీ తాజాగా తన సొంతింటి కలను సాకారం చేసుకుంది. హైదరాబాద్‌లో శివారు ప్రాంతంలో ఓ ఖరీదైన విల్లాను కొనుగోలు చేసింది. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ఈ సందర్భంగా తన విల్లాను చూపిస్తూ ఒక స్పెషల్ వీడియోను షేర్ చేసింది.
రోహిణీ షేర్ చేసిన వీడియోలో తాను కొనుగోలు చేసిన విల్లా విశేషాల గురించి చెప్పుకొచ్చింది. ఇందులో అత్యాధునిక వసతులు ఉన్నాయంటూ హాల్, కిచెన్, పూజ గది, బెడ్ రూమ్ లను చూపించింది. కాగా ఈ లగ్జరీ విల్లా ధర రూ.1.7 కోట్లు అని రోహిణి స్వయంగా తెలిపింది. ‘మై న్యూ ఛాప్టర్ స్టార్ట్స్ నౌ’ అంటూ రోహిణి షేర్ చేసిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. పలువురు సినీ ప్రముఖులు, నెటిజన్లు, అభిమానులు జబర్దస్త్ నటికి శుభాకాంక్షలు, అభినందనలు తెలుపుతున్నారు.
కొత్త విల్లాను చూపిస్తోన్న నటి రోహిణి.. వీడియో..
View this post on Instagram
రోహిణీ లేటెస్ట్ ఇన్ స్టా గ్రామ్ పోస్ట్..
View this post on Instagram
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.