AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Supritha: అరె.. ఈ టాలీవుడ్ హీరోయిన్‌కు ఏమైంది? ఆస్పత్రి బెడ్‌పై సురేఖా వాణి కూతురు.. ఫొటోస్ వైరల్

టాలీవుడ్ సీనియర్ నటి సురేఖావాణి కూతురు సుప్రీత ఇప్పుడు తెలుగులో రెండు, మూడు సినిమాలు చేస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగుల్లో బిజి బిజీగా ఉంటోందీ అందాల తార. అయితే ఉన్నట్లుండి సడెన్ గా ఆస్పత్రి బెడ్ పై కనిపించింది సుప్రిత.

Supritha: అరె.. ఈ టాలీవుడ్ హీరోయిన్‌కు ఏమైంది? ఆస్పత్రి బెడ్‌పై సురేఖా వాణి కూతురు.. ఫొటోస్ వైరల్
Actress Supritha
Basha Shek
|

Updated on: May 18, 2025 | 2:11 PM

Share

టాలీవుడ్ సీనియర్ నటి సురేఖా వాణి గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. వందలాది సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా, సహాయ నటిగా మెప్పించిందీ అందాల తార. అయితే ప్రస్తుతం పెద్దగా సినిమాల్లో కనిపించడం లేదీ సీనియర్ నటి. అదే సమయంలో ఆమె కూతురు సుప్రిత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయ్యింది. ఇప్పటికే సోషల్ మీడియాలో ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్న ఆమె త్వరలోనే సిల్వర్ స్క్రీన్ పై కూడా కనిపించనుంది. ప్రస్తుతం సుప్రిత చేతిలో ఏకంగా మూడు సినిమాలు ఉన్నాయి. అందులో ఒకటి లేచింది మహిళా లోకం. అలాగే బిగ్ బాస్ రన్నరప్ అమర్ దీప్ తో కలిసి మరో మూవీలో నటిస్తోంది. ఈ రెండు సినిమాలు ఈ ఏడాదే థియేటర్లలో విడుదల కానున్నాయి. వీటితో పాటు అమ‌రావ‌తికి ఆహ్వానం పేరుతో తెర‌కెక్కుతోన్నమరో హారర్ థ్రిల్లర్ మూవీలో నటిస్తోంది సుప్రిత‌. ఇటీవలే ఈ మూవీ పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ప్రస్తుతం ఈ సినిమాల షూటింగ్ లో బిజి బిజీగా ఉంటోంది సుప్రిత. అయితే ఉన్నట్లుండి ఆమె ఆస్పత్రి పాలైంది. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ఆస్పత్రి బెడ్ పై సెలైన్ ఎక్కించుకుంటోన్న ఫొటోలను షేర్ చేసిన ఆమె ఇలా రాసుకొచ్చింది.

‘దిష్టి నిజమే. జీవితంలో బలంగా ఎలా ఉండాలో ఈ వారం తెలుసొచ్చింది. నేను శివయ్యను బాగా నమ్ముతాను. కానీ ఆయనకు నాపై కోపం వచ్చినట్లు ఉంది. అయినా శివయ్య, అమ్మ, ప్రసన్న, రమణ.. వీళ్లు లేకుండా నేను లేను. జీవితం ఎప్పటికప్పుడు నన్ను పరీక్షిస్తోంది. దిష్టి నా మానసిక, శారీరక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తోంది. శారీరర, మానసిక ఆరోగ్యం ఎప్పుడూ ముఖ్యమే’ అని రాసుకొచ్చింది సుప్రిత. అయితే అసలు తనకు ఏమైందో మాత్రం క్లారిటీ ఇవ్వలేదీ అందాల తార.

ఆస్పత్రిలో చేతికి సెలైన్ తో సుప్రిత..

ప్రస్తుతం సుప్రిత ఫొటోలు నెట్టింట తెగ వైరలవుతున్నాయి. ఎప్పుడూ అల్లరి పనులు చేస్తూ యాక్టివ్ గా ఉండే ఆమె సడెన్ గా ఆస్పత్రిలో కనిపించడంపై ఫాలోవర్లు కంగారు పడుతున్నారు. ఏదేమైనా ఆమె త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తూ కామెంట్స్ పెడుతున్నారు.

 మదర్స్ డే వేడుకల్లో తల్లి సురేఖా వాణి తో సుప్రిత..

వెకేషన్ లో చిల్ అవుతోన్న సుప్రిత..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఉదయాన్నే ఖాళీ కడుపుతో వెల్లుల్లి తింటే శరీరంలో ఏం జరుగుతుందో తెలు
ఉదయాన్నే ఖాళీ కడుపుతో వెల్లుల్లి తింటే శరీరంలో ఏం జరుగుతుందో తెలు
బిగ్ బాస్ 10లోకి క్రేజీ బ్యూటీ..
బిగ్ బాస్ 10లోకి క్రేజీ బ్యూటీ..
బంగారం లాంటి వార్త.. మరింత తగ్గిన గోల్డ్, సిల్వర్ రేట్స్!
బంగారం లాంటి వార్త.. మరింత తగ్గిన గోల్డ్, సిల్వర్ రేట్స్!
శుక్రుడి మహా ప్రభావం.. ఈ 4 రాశుల వారికి డబ్బు, పదోన్నతి, అదృష్టం
శుక్రుడి మహా ప్రభావం.. ఈ 4 రాశుల వారికి డబ్బు, పదోన్నతి, అదృష్టం
మంగళవారం.. ఈ ఒక్క పరిహారం చేస్తే హనుమంతుడి అనుగ్రహం, కుజ దోషాలు..
మంగళవారం.. ఈ ఒక్క పరిహారం చేస్తే హనుమంతుడి అనుగ్రహం, కుజ దోషాలు..
జూన్ 9 రాశిఫలాలు:వారికి ఆర్థిక లాభాలు, అన్ని ప్రయత్నాల్లో సక్సెస్
జూన్ 9 రాశిఫలాలు:వారికి ఆర్థిక లాభాలు, అన్ని ప్రయత్నాల్లో సక్సెస్
ఉదయాన్నే కీళ్లు బిగుసుకుపోతున్నాయా? ఆర్థరైటిస్ సహా ఈ ప్రమాదకర..
ఉదయాన్నే కీళ్లు బిగుసుకుపోతున్నాయా? ఆర్థరైటిస్ సహా ఈ ప్రమాదకర..
ఎండిన తులసిని పారేయొద్దు.. ఇలా చేస్తే ఇంటికి శుభం, ఐశ్వర్యం ..
ఎండిన తులసిని పారేయొద్దు.. ఇలా చేస్తే ఇంటికి శుభం, ఐశ్వర్యం ..
ఇంట్లో పిల్లిని పెంచుకుంటే అదృష్టమా? దురదృష్టమా? వాస్తు శాస్త్రం
ఇంట్లో పిల్లిని పెంచుకుంటే అదృష్టమా? దురదృష్టమా? వాస్తు శాస్త్రం
కోట్ల విలువైన వాచీలు, చెయిన్లు.. ఫ్యాషన్ క్రికెటర్‌‌
కోట్ల విలువైన వాచీలు, చెయిన్లు.. ఫ్యాషన్ క్రికెటర్‌‌