Tollywood: ఆ అరుదైన సమస్యతో బాధపడుతోన్న టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ‘ఇక అంతా ఆ దేవుడి దయ’ అంటూ షాకింగ్ పోస్ట్
'సినిమా సెలబ్రిటీలది లగ్జరీ లైఫ్. విలావవంతమైన భవనాలు, ఖరీదైన కార్లు ఉంటాయి. విందులు, వినోదాల్లో మునిగి తేలుతుంటారు. వారికెలాంటి సమస్యలు, ఇబ్బందులు ఉండవు' అని అనుకుంటారు చాలా మంది. కానీ ఇది ఏ మాత్రం నిజం కాదు. సినిమా తారలు కూడా మనలాంటి మనుషులే.

సినిమా సెలబ్రిటీలకు ఎన్నో రకాల సమస్యలు ఉంటాయి. మరీ ముఖ్యంగా రాత్రింబవళ్లు షూటింగుల్లో పాల్గొనే వారికి తరచూ ఆరోగ్య సమస్యలు తలెత్తుతుంటాయి. అలా టాలీవుడ్ కు చెందిన ఓ క్రేజీ హీరోయిన్ కూడా తన ఆరోగ్య సమస్యను బయట పెట్టింది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఆమె ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. ‘ప్రస్తుతం నాకు కంటి సమస్య వచ్చింది. దీని పేరు కూడా సరిగ్గా పలకలేకపోతోన్నాను. నా కంటికి ఇప్పుడు ఏదీ కూడా సరిగ్గా కనిపించడం లేదు. అన్నీ రెండు రెండు కనిపిస్తున్నాయి. పైగా చాలా బ్లర్డ్‌గా కనిపిస్తున్నాయి. నా పరిస్థితి ఎలా ఉన్నా కూడా.. ఆల్రెడీ ఇచ్చిన కమిట్మెంట్‌కి అనుగుణంగా ప్రోగ్రామ్స్, ఈవెంట్‌కు వెళ్లాల్సిందే. ఇక అక్కడ ఎలా మ్యానేజ్ చేయాలో తెలియడం లేదు. అసలు ఈ సమస్య ఎలా తీరుతుందో.. అంతా ఆ దేవుడి దయ. అయినా ఇప్పుడు ఈ కళ్లద్దాలు పెట్టి మ్యానేజ్ చేస్తాను. కనిపించకపోతే ఏం నటించగలను కదా?’ అంటూ తన ఇన్ స్టా స్టోరీస్ లో ఒక వీడియోను పోస్ట్ చేసిందీ అందాల తార. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో బాగా వైరలవుతోంది. దీనిని చూసిన సినీ అభిమానులు, నెటిజన్లు ఈ హీరోయిన్ కు ఏమైందని ప్రశ్నలు వేస్తున్నారు. మీ సమస్య త్వరగా తీరిపోవాలి అంటూ కామెంట్స్ పెడుతున్నారు.
ఇలా కంటి సమస్యలతో బాధపడుతోన్న హీరోయిన్ మరెవరో కాదు..ఆర్ ఎక్స్ -100, మంగళవారం సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్న పాయల్ రాజ్ పుత్. వీటి మధ్యలో కథానాయకుడు, RDXలవ్, వెంకీమామ, డిస్కో రాజా, అనగనగా ఓ అతిథి, తీస్ మార్ ఖాన్, మాయపేటిక తదితర సినిమాల్లో నటించింది పాయల్. అయితే ఈ సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. అయితే మంగళవారం సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ముఖ్యంగా పాయల్ కెరీర్ కు మంచి బూస్ట్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో వెంకట లచ్చిమి’ అనే డిఫరెంట్ మూవీ ఉంది. దీంతో పాటు మరికొన్ని సినిమాలను ఒకే చేసే పనిలో ఉందీ అందాల తార.
పాయల్ రాజ్ పుత్ లేటెస్ట్ ఇన్ స్టా గ్రామ్ పోస్ట్..
View this post on Instagram
ఇక సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది పాయల్. తన పర్సనల్ అండ్ ప్రొఫెషల్ విషయాలను అందులో షేర్ చేసుకుంటుంది. అలాగే తన గ్లామరస్ ఫొటోస్, వీడియోలను పంచుకుంటుంది. అలా తాజాగా తన కంటి సమస్యను చెబుతూ ఇన్ స్టా స్టోరీస లో ఓ వీడియోను పోస్ట్ చేసింది పాయల్.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.